ఏదో ఉండబట్టలేక….రాస్తున్నా!

మొన్న ఆ మధ్య మా మెడికల్ క్యాంప్ కోసం పోస్టర్లు అంటించడానికి వెళ్ళాము నేనూ, నా స్నేహితురాలూనూ. మళ్ళీ నా బ్రెయిన్ లో ఓ మూల నక్కి, అప్పుడప్పుడూ గోల చేసే నిస్సహాయత కాసేపు గోల మొదలెట్టింది.

అవి రోడ్డు లో ఖాళీ గా ఉన్న చోట ఏర్పరుచుకున్న స్లం ఏరియా లు. ఈరోజు ఉన్నాయి..రేపు ఉంటాయో లేదో తెలీదు. వర్షకాలం లో ఎలా బ్రతుకుతారో అర్థం కాదు. ఒక చిన్న టెంటేసుకుని అందులో ఐదారుమంది ఎలా ఉంటారో అర్థం కాదు. ఓ మోస్తరు మధ్యతరగతి ఇండిపెండెంట్ ఇల్లు పట్టే స్థలం లో అక్కడ కనీసం లో కనీసం ఓ 5,6 కుటుంబాల “ఇళ్ళు” ఉంటాయి. సమస్తం అక్కడే… … మరి… చూస్తూ చూస్తూ చలించకుండా ఉండలేను… చలించినా చేయగలిగేదేమీ ఉండదు. ఆదివారం క్యాంపు కి రండమ్మా, మీ వాళ్ళకి కూడా చెప్పండి అనడం తప్ప. మహా అంటే పిల్లలతో చదువుకొమ్మని చెప్పడం… వాళ్ళు కాస్త స్నేహంగా స్పందిస్తే సరదాగా ఓ పది నిముషాలు కబుర్లాడటమో.. అవకాశముంటే ఆటాడడమో…అంతే!

నాకు అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించేది ఏమిటి అంటే – మాకున్న వాలంటీర్ల కొరత. ఇది విద్యార్థుల్లో ఉన్న indifference అనుకోవాలా? కాంపిటీషన్ లో పడి మానవత్వం మరుస్తున్నారా? క్యాంపు పెట్టిన ప్రతి సారీ ఇదే తంతు… తెలుగు తెలిసిన వాలంటీర్లు దొరకరు! ఉన్నది ఇద్దరో ముగ్గురో… వాళ్ళలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ప్రీ-క్యాంపు కార్యకలాపాలకి తప్ప క్యాంప్ కి వెళ్ళి డాక్టర్ కి సహాయపడ్డం కుదరదు చాలా సార్లు. తోటి విద్యార్థులకి చెప్పడమైతే చెప్పగలను గాని, campaign చేసే తెలివితేటలు ఏడవలేదు నాకు! 😦

ఆ మధ్య లింగ్డో గారు మా కాలేజీ కి వచ్చినప్పుడు విధ్యార్థులతో ఓ సెషన్ ఏర్పాటు చేసారు. నేను ప్రశ్నలేమీ అడక్కపోయినా అక్కడే కూర్చుని అందరి అభిప్రాయాలు విన్నాను. అప్పుడో లింగ్డో అన్న మాటలు గుర్తు వస్తున్నాయి. టెక్నికల్ యూనివర్సిటీల్లో పిల్లల మధ్య సామాజిక సమస్యల గురించీ, రాజకీయాల ఇతర యూనివర్సిటీల్లో జరిగే వాడి-వేడి చర్చలు జరగవనీ, అలా జరగడం చాలా అవసరమనీ అన్నారు. బహుశా అలాంటి చర్చలు జరక్క పోవడానికీ, మా జనాల్లో (అనగా టెక్నికల్ యూనివర్సిటీల జనాలకి) ఉండే indifference కీ ఏమన్న సంబంధం ఉంటే ఉండొచ్చు అనిపిస్తుంది. వీళ్ళకి వాస్తవం అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో లషలకు లక్షలు గుమ్మరించే ఉద్యొగం మాత్రమేనా? సమాజం లో ఇంకో తరగతి వారి జీవితాలు తమతో పోలిస్తే ఎంత దుర్భరంగా ఉన్నాయో పట్టదా? అనిపించింది. నాకేమీ ఎదగాలన్న కోరిక లేక కాదు. లక్షలు జీతాలొచ్చే ఉద్యోగం కోరుకోవడం తప్పనీ కాదు… నాకూ ఉంది చదువవగానే మంచి ఉద్యోగం లో చేరాలి అన్న కోరిక… ఎవరికుండదు? కానీ…. మనకున్న ఖాళీ సమయం లో…. ఓ కాస్త సమయం… ఐదు సినిమాలు చూసే సమయం లో నాలుగు మాత్రం చూసి ఓ సినిమా సమయం దీనికి కేటాయించొచ్చు.

అసలైనా, నేనెవరి కోసం ఈ టపా రాస్తున్నానో వారు ఇది చూసే అవకాశం లేదు అనుకోండి… అయినా…ఏదో నా గోల నాది….. మనీ సాయం చేయాలని విద్యార్థుల్నుంచి ఎవరూ ఆశించరు. మాట సాయం, కాస్త చేత సాయం…. వెరసి..కాస్త సమయానికి ఓ చెయ్యేస్తే  అంతకంటే కావాల్సిందేముంది…. ??

Advertisements
Published in: on July 15, 2007 at 3:25 pm  Comments (21)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/07/15/random-ramblings/trackback/

RSS feed for comments on this post.

21 CommentsLeave a comment

 1. నిజం

 2. mamchi point chepparu. samaajika spRuha kuDaa oka adhyayana amSamugaa umTE baagimTumdEmoa kadaa!

 3. తమాషా ఏంటంటే – సమాజాన్ని గురించి పట్టించుకోవడం, ఏం జరుగుతోందని తెలుసుకోవడం, దాంట్లో మనం కూడా ఏదన్నా పనికొచ్చే పనిచెయ్యాలని తాపత్రయ పడడం నేను టెక్నికల్ కాలేజీలు (వరంగల్ ఆర్యీసీ, కాన్పూరు అయ్యయ్టీ)లో చదువుతున్నప్పుడే నేర్చుకున్నా.

 4. నేను డిగ్రీ భీమవరంలో చదువుతున్నపుడు ఇదే అంశం మా మితృల మధ్య చర్చకు వచ్చింది. చాలాసేపు మధనపడ్డాక ఆరోజునుండే ఏదైనా మంచిపని చేయాలనుకొని అందరం కలిసి రక్తదానం చేద్దామని నిర్ణయించాం. వెంటనే మేము (ఇంచుమించు పదిమిందిమి) భీమవరంలోని ప్రభుత్వ వైద్యశాల కు వెళ్ళి మా కోరికను చెప్పాం. వాళ్ళేమో మాకు రక్తం తీసుకొని నిల్వచేసే సదుపాయం లేదు మిరు ఏలూరు గానీ విజయవాడ గానీ వెళ్ళండి అని ఒక వుచిత సలహా పారేశారు.
  ఇంకేముంది తాటాకు మంటలా మాలోని కోరిక చప్పున చల్లారింది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 5. […] పొరుగు వాడికి తోడు పడవోయి Posted July 17, 2007 ఈ టపా చూడండి. […]

 6. మా college లోనూ అంతే. నేను పెద్దగా ఏమీ చేయపోయినా, ఎవరన్నా ముందుంటే చేయాలని చాలా ఉండేది, ప్రత్యేకించి kargil war అప్పుడు. కనీసం funds collect చేద్దామని ఒకరిద్దరితో చెప్పినా ఎవరూ మట్లడలేదు. ఆఖరికీ నేనే మొదలుపెట్టి minimum 10 రూపాయిలు అడిగితే ఇవ్వటానికి ఎన్నాళ్ళు ఎంత వెనకాలపడల్సి వచ్చిందో, studentsని అంతే, faculty అంతే. పైగా జోకులు. కేవలం పదిరూపాయిలు (ప్రతిరోజు సాయింత్రం చిరుతిండికి అంతకంటే ఎక్కువే అవుతుందేమో ఒక్కక్కరికి) కూడా ఆ causeకి వెచ్చించనవసరం లేదు అనిపించేంత సామాజిక స్పృహ.

 7. నేనొక మంచి వెధవని.
  ————–
  ఈ రాజకీయవేత్తలున్నరే..వీల్ళంత దొంగలు ఇంకేవరు ఉండరు..అంతా తినడమే. అంతా కరప్టడ్ ఇడియట్స్. నా చేతుల్లో గన్నుంటేనా అందర్ని షూట్ చేసి పారేద్దును.

  ***

  సార్, ఎదో అర్జెంట్ సార్. ఇంట్లొ మరిచిపొయ్యాను. అబ్బే,వంద లేవండి. ఈ యాభై ఉంచండి. రేపు ఇటే వస్తాగా..మీకు ఆ లైసేన్సు, రిజిస్ట్రషన్ చూపిస్తాను సార్..

  ***
  ప్రతి పోలిసోడు అంతే. కర్రప్షున్ మావా..ముందు వీల్ళందర్ని జైల్లోకి తొ య్యాలి!

 8. పైన చెప్పిన వారికన్నా భిన్నమైన అభిప్రాయం నాది. ఆ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానాలు కావొచ్చు…తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు స్వయంకృతాపరాధం కూడా ఉంది. వీళ్ళను ఉద్దరిద్దాం అని పోతే..”కనకపు సింహాసమున…..” అన్న సామెత గుర్తొస్తుంది.
  మీరు చెప్పిన స్లమ్ ప్రాంతాల్లోని పిల్లోడు దీనంగా అడుక్కొంటూంటే…పాపం కదా అని పర్సు తీసి డబ్బులు ఇవ్వబోయాడు. అంతే…ఆ పొట్టి బుడంకాయ..టకామని పర్సులాక్కుని పారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఇట్ళాంటోళ్ళకి సహాయం చెయ్యాలనిపిస్తాదా? వారి ఇళ్ళను చూసి మోసపోకండి..వాళ్ళలో కొందరికి బ్యాంక్ ఖాతాలు కూడా ఉంటాయి. ఒక వేళ మంచి తిండి తినమని, మందులు కొనుక్కోమని డబ్బులిస్తే అదే రోజు ఆ డబ్బంతా ఏ సారా దుకాణంలోనో తగలేస్తారు. ఇట్లా ఉంటాయి బుద్దులు. పాపం కదా అంటే..మనకే పాపం.
  మనం జాలి పడాల్సింది…చెతులూ కాళ్ళు ఉండి పని చేసుకోకుండా అడుక్కునే వాళ్లను కాదు….దానికన్నా విధివంచితులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఒక్క సారి వికలాంగుల ఆశ్రమానికి వెళ్ళి చూడండి…మనకు ఏం చేయాలో తెలుస్తుంది. వాళ్ళ మీద జాలి చూపడం కంటే…ఎలా బ్రతకాలో నేర్పించి స్పూర్తి రగిలిస్తే అదే సరైన సేవ అవుతుంది.

 9. నవీన్,
  మీ కామెంటు చదివి ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదు.
  స్లుంలో వున్నంత మాత్రాన వారి బుద్దులన్నీ వక్రంగా వుండవండి. పెరిగిన పరిస్థితులు, వారి చుట్టు వున్న సమాజం, సమాజం వారికి నేర్పిన విలువలు వాడిని పర్సు లాక్కొని పోయేట్లు చేశాయి. ఈరోజు ఇలా నీతులు మాట్లాడే మనం కూడా స్లుంలో పుట్టి వుంటే అలాగే చేసేవాళ్ళం.
  “కనకపు సింహాసనమున…” ఉదహరించడం నాకైతే ఎబ్బెట్టుగా వుందండి.
  సరే ఇలా చెబుతా చూడండి… నా బ్లాగులో రాస్తా…

  –ప్రసాద్
  http://blog.charasala.com

 10. Hmm…
  నవీన్ గారు చెప్పిన బాపతు జనాలు లేరు అని నేను అనను కానీ ప్రసాద్ గారు అన్నట్లు…ఒకవేళ వాళ్ళు అలా చేసినా అందుకు కారణం వాళ్ళు జీవిస్తున్న పరిస్థితులు అంటాను. వాళ్ళని చూసి జాలి పడాలా వద్దా అన్నది ఎవరెవరి వ్యక్తిగత ఇష్టం. కానీ… వాళ్ళు మనంత అదృష్టవంతులు కాలేకపోయారు కనుక మన అదృష్టాన్ని కొంత వారికిచ్చే ప్రయత్నం చేయడం సముచితమేమో అనిపిస్తుంది…

 11. ఈ మధ్య నేను చదివిన పుస్తకంలో perception గురించి చెబుతూ ఉటంకించిన ఒక కథ – చాలా మందికి తెలిసే ఉండొచ్చు.
  ఒకావిడ తన పాపను చూపెట్టి, పాపకు కాన్సరని చెప్పి అడుక్కుంటోందట. ఒకతను పాప దయనీయ స్తితిని చూసి, తన జీతమంతా బిక్షగా ఇచ్చేసి ఇంటికి వెళ్ళాట్ట.
  తండ్రి దాన, దయాద్ర హృదయం అతడి కొడుక్కు నచ్చలేదట!
  కొన్నాళ్ళకు అడుక్కుంటున్నామె, మోసగత్తె అని, ఆవిడ చిన్న పాపకు ఎలాంటి జబ్బు లేదని చెబుతూ ఒక వార్త పత్రికల్లో చూసి, కొడుకు ‘నాన్నా చూడు నువ్వు మోసపోయావు ‘ అన్నాట్ట.
  దానమిచ్చిన తండ్రి, సమాధానంగా ‘నాకు ఆనందంగా ఉంది, ఆ పాపకు కేన్సరు లేదని తెలిసి ‘ అన్నాట్ట!

 12. నేను Generalization (తెప?) కు బద్ద వ్యతిరేకిని. నేను అన్నది…”అందరి” గురించి కాదు. “ఆ కొందరి” గురించి. నీతులు చెప్పడానికి పాటించడానికి చాలా ఎడం ఉంది. ఏదో వారాంతం ఖాళీ సమయాల్లో కొన్ని మందుల పెట్టెలు, రొట్టె ముక్కలు పంచి పెట్టటం, కొరగాని ఉపశమన వచనాలు పలికి రావడం చేసేవాళ్ళకు సంతృప్తిని ఇస్తుందేమో కానీ వాళ్ళ బ్రతుకుల్లో ఏ మార్పూరాదు. 20 హత్యలు చేసిన వాడు కూడా ఏదో ఒక కారణం చెబుతాడు. దానికి జాలిపడి..”పాపం అది పరిస్థితుల ప్రభావమే కాని..అతని తప్పు కాదు” అని అనగలమా? ఆ పరిస్థితులకు కారణమెవ్వరు..దానిని తీర్చడమెలా అన్నది పెద్ద సమస్య. పొద్దున్న అడుక్కుంటూ…రాత్రుళ్ళు ఎన్నో నేరాలను చేసేవాళ్ళ ఎంతో మంది ఉన్నారు. “కనకపు సింహాసమున..” అన్న అన్న నన్ను చూస్తే…మీకి ఒక రకంగా ఆలోచిస్తే..నేను నిర్దయుడని అనిపించొచ్చు…చొచ్చు కాదు..అనిపిస్తుంది. నేను మాటల్లో కనపడినంత కఠినుడను ఖచ్చితంగా కాను. సహాయం చెయ్యబోయి…ఎన్నో సార్లు దెబ్బ తిన్న సందర్భాలు నాకు పాఠాలు నేర్పాయి. నా అనుభవాలు నావి. మీరు దీని గురించి…తీరిక చేసుకొని…పెద్దగా బ్లాగితే..అది “మీ అభిప్రాయం” మాత్రమే అవుతుంది..నిజం కానేరదు. అనుభవ సారం ..నిజం ఒక్కటి కాదు. మీ అనుభవ సారం నిజం కావొచ్చు…నిజం మీ అనుభవసారం కానేరదు.
  ఇప్పటికీ నేను ఇదే అంటున్నా ….”వాళ్ళ మీద జాలి చూపడం కంటే…ఎలా బ్రతకాలో నేర్పించి స్పూర్తి రగిలిస్తే అదే సరైన సేవ అవుతుంది.”

 13. పాపకు జబ్బు ఉంది అని తెలిస్తే….జీతం అంతా ఇచ్చేయడం మంచిదా లేక క్యాన్సరుకు ఉచితంగా వైద్యం చేసే సేవా ఆస్పత్రి చిరునామా ఇవ్వడం మంచిదా? దయాద్ర హృదయం ఉన్నంత మాత్రాన సరిపోదు…మన చేసే దానాలు సేవలు సద్వినియోగం అవుతున్నాయో లేదో అన్న స్పృహ, తెలివి ఉండాలి.

 14. would you give a ‘fish”
  or teach ‘fishing’?
  what do you prefer?

 15. fish ఇంచలేనపుడు
  fish ఇవ్వటం లో తప్పు లేదు

  — శ్రవణ్

 16. నవీన్ గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నప్పటికీ ఈ వ్యాఖ్యకి మాత్రం స్పందించాలనిపించింది.

  — “ఏదో వారాంతం ఖాళీ సమయాల్లో కొన్ని మందుల పెట్టెలు, రొట్టె ముక్కలు పంచి పెట్టటం, కొరగాని ఉపశమన వచనాలు పలికి రావడం చేసేవాళ్ళకు సంతృప్తిని ఇస్తుందేమో కానీ వాళ్ళ బ్రతుకుల్లో ఏ మార్పూరాదు ”

  – వాళ్ళ బతుకుల్లో మార్పు రాకపోవచ్చేమో కానీ మరీ ఉపయోగపడని పనులు మాత్రం కావు ఇవి. అసలు ఆ మాత్రం కూడా చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు?

  చీకటిని తిడుతూ కూర్చునే కన్నా చిరుదీపం వెలిగించడం మంచిదే కదా.

  ఇక ఎవరో అన్నారు రాజకీయ నాయకులందరూ దొంగలు అని. మెజార్టీ ప్రజల ప్రతిబింబాలే రాజకీయ నాయకులు. ప్రజాస్వామ్యం లో “యధా ప్రజా తథా రాజా”

  కొందరు నిజాయితీ పరులైన రాజకీయనాయకులు స్వయంగా తెలుసు నాకు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ.

  ఏమయినప్పటికీ రాజకీయ నాయకుల మీద అలా వ్యాఖ్యానించిన వారి ఆవేదన అర్థం చేసికోదగ్గదే. ఇక పోలీస్ ల చలానోత్సాహాన్ని వర్ణించడానికి వేయినోళ్ళయినా చాలవేమో.

  విలక్షణంగా నిలుస్తున్న “లోకసత్తా” ని గమనిద్దాం. మంచిదనిపిస్తే ప్రోత్సహిద్దాం.

  ఇక సౌమ్య గారు రాసిన బ్లాగ్ విషయానికొస్తే స్పందింప చేసే విధంగా ఉంది. అబ్దుల్ కలాం రాష్ట్రపతి గా ప్రజలనుద్దేశించి ఆఖరిసారిగా చేసిన ప్రసంగంలో కానీ, ఆయన గత ప్రసంగాల్లో కానీ మన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా చెప్తూనే వచ్చారు.

  ఇక “మెడికల్ కేంపులూ – ఇప్పుడక్కడ వాలంటీర్ల కొరత, టెక్నికల్ విద్యార్ధులు – సామాజిక సేవ” విషయాలు ఏమో కానీ నేను మాత్రం ఈ వ్యాసం చదివిన స్ఫూర్తితో అలాంటి స్లం ఏరియా ల్లో వాళ్ళకి పనికొచ్చే ఏదో మంచిపని చేస్తాను. లేదా చేస్తున్న వారికి సహకరిస్తాను. ఇది చేసేటప్పుడు “వాళ్ళు మరింత బాగా ఎలా బతికాలో నేర్పించి స్ఫూర్తి రగిలించాలి ” అన్న నవీన్ గారి మాటలు దృష్టిలో ఉంచుకుంటాను.

  – కృష్ణ

 17. కృష్ణగారు, ఏమీ చెయ్యకపోవడం కన్నా కనీసం “మందుల పెట్టెలు, రొట్టె ముక్కలు” పంచి పెట్టడం మంచిదే. ఇది వంద శాతం అంగీకరిస్తాను. మోక్షం పొందడానికి భక్తి మార్గం కన్నా ఙ్ఞాన మార్గం అత్యుత్తమం. అలాగని ఙ్ఞానము భక్తి రెండూ లేకపోవటం కన్నా కనీసం భక్తి ఉండటం మంచిదే కదా.
  కానీ అంత సేవ చేసే ఉత్సాహం ఉన్నప్పుడు మన శక్తిని, వనరుల్ని ఉత్తమ మార్గంలో మళ్ళించమని చెప్పాను అంతే…
  ( దీని మీద ఒక టాపా వ్రాయక తప్పేటట్టు లేదు 🙂 )

 18. మన అనుభవాలు మనలని తీర్చి దిద్దుతాయి.
  నా మట్టుకు నాకయితే ఏమనిపిస్తుందంటే … నీవు సహాయం చేసే పరిస్థితిలో వుంటే సహాయం చేయడమే నీ వంతు. సహాయాన్ని సద్వినియోగం చేసుకోవలిసిన బాద్యత తీసుకున్న వాడి వంతు.

  నా చుట్టూ వున్నా బొలెడంత మందిని సహాయం చేయడం గురించి కదిపి చూశాను. “ఎక్కడ న్యాయం వుందండి. మీరు చేసే సహాయం అవసరం వున్న వాడికి అందుతుందని గ్యారంటీ వుందా? మద్యలో తినేవాళ్ళెక్కువ….” ఇలా ఎన్నో అనుమానచూపులతో చూసే వాళ్ళే. అయితే అనుమానంతో ఒక్కపనీ చేయకపోవడం కంటే అభిమానంతో పది పనులు చేస్తే ఒక్క చోటైనా పని జరగదా అనేది నా భావన. మనం చేసే సహాయంతో వాడు సారా తాగుతాడని చేయకపోతే తీరా వాడు అదే సారాకోసమని ఇంట్లో చంటిబిడ్డను అమ్ముతాడేమో?!

  సహయం చేసి నేనూ మోసపోయాను. కానీ మోసపోయిన మనమెందుకు చింతించాలి? మోసగించిన వాడే బాధపడాలి.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 19. మనం సహాయపడదాం అని డబ్బిస్తాం. వాడు దాన్ని ఏ సారోకో, పాపపు పనికో వినియోగిస్తే Law of Karma ప్రకారం ఆ పాపం తగిలేది మనకే. ఎందుకంటే..ఆ పాపానికి పెట్టుబడి మనదే కాబట్టి. మనం చేసే సేవ సద్వినియోగమౌతోందా లేదా అని తెలుసుకొని చెయ్యడం మన బాధ్యత. Law of Karma అని తీసిపారెయ్యకుండా కొద్దిగా లోతుగా ఆలోచించండి. ఇది మనవాళ్ళు చెప్పే “ఖర్మ” సిద్దాంతం కానే కాదు. ఇది వేరే…

 20. నవీన్ గారి మాటల్లో – అపాత్రతా దానం కూడదని, సేవా దృక్పథం ఉన్న వాళ్ళు మరింత ఆర్గనైజ్డ్ గా ఎలా సేవ చేయాలో అలోచించమన్న భావం ధ్వనిస్తోంది. ఇక ప్రసాద్ గారు – అందర్నీ అనుమానిస్తూ కూర్చుంటే సేవ ఏం చేయగలం?. మనం చేసే సేవని కొంత మంది దుర్వినియోగం చేసుకోవచ్చు గాక. అది వాళ్ళ ఖర్మ. అయితే మరి కొందరన్నా నిజంగా అర్హత ఉన్న వాళ్ళు లబ్ధి పొందుతూండటం మంచిదేగా అంటున్నారు.

  ఇద్దరు చెప్పేదీ కరెక్టే. సందర్భాన్ని బట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సమయోచిత నిర్ణయం తీసుకోవాలి.

  సేవా కార్యక్రమాల్లో డబ్బు, ఇతర వనరులు సద్వినియోగం అయితే బాగుంటుందన్న విషయంలో అందరూ ఏకీభవిస్తారు.దానికి మరిన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో , మనం వినియోగించే వనరులతో మరింత ఎక్కువ(మేగ్జిమం) ఫలితం వచ్చేలా ఎలా వ్యవహరిస్తే బాగుంటుందో సూచనల రూపంలో ఎవరైనా బ్లాగ్ వ్రాస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

  అందరికీ నమస్కారములతో …

  – కృష్ణ

 21. neevu aalochanalu chala bagunnai devudu ninnu puttichindi andu kosame nee pani neevu chei
  samajaniki neevu yentavaraku upayogapadatavo upayogapadu vere vallaku neevu spoorthi avutavu

  bye


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: