ఇదోరకం ప్రచారం కాబోలు!

మన ప్రభుత్వానికి మనం మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్ప ఇంకోటి వాడ్డం ఇష్టం ఉండదో ఏం కథో!  నన్ను బాగా ఇబ్బంది పెట్టే రెండు సైట్లు…. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో తప్ప ఇవి పనిచెయ్యవు సరిగ్గా…

మొదటిదేమో….. దేటా వన్ వారి సైటు. ఇందులో నా డేటా వన్ అకౌంట్ యూసేజ్ చుసుకోవాలంటే Internet Explorer లోనే చెల్లు. పైగా, సారీ, IE is needed అన్న మెసేజ్ ఒకటి… ఏం! వేరే బ్రౌసర్లు బ్రౌసర్లు కావా…వాటిని ఉపయోగించే వారు డేటా వన్ వినియోగదారులు కారా?? డేటా వన్ తో ఈ సమస్య కొత్త కాదు అనుకోండి… కానీ, ఈరోజే మరో సైటు తో ఇంకో రకం సమస్య వచ్చింది…

ఇక రెండవది: మా తాతగారి పాస్‌పోర్టు రెన్యూ చేసుకోడానికి ఆన్‌లైన్ లో అప్ప్లై చేయమని అడిగారు. నేను స్టైలు గా ఫైర్ఫాక్స్ తెరిచి…ఆ సైటు కి వెళ్ళి ఫాం నింపడం మొదలెట్టా. అంతా అయ్యాక సేవ్ కొడితే – invalid date అని చూపించింది… సరే… మళ్ళీ చూస్తే … 2007 అని కొట్టిన చోట 200 ఉంది. సరే పొరపాటున నేనే కొట్టలేదేమో అనుకున్నాను. అన్ని చోట్ల అలాగే ఒక డిజిట్, రెండు దిజిట్లు ఎగిరిపోయి ఉన్నాయి… నాకు అనుమానం వచ్చినా కూడా..ఏమోలే…నేనే తప్పు కొట్టానేమో అని అనుకున్నాను. సరే, మళ్ళీ డేట్ కాలంస్ నింపడం మొదలెట్టాను. నేను 2007 అని కొడితే అది తిసుకుంటోంది. కానీ, నేను తరువాతి కాలం కి వెళ్ళగానే, పైనున్న 2007 కాస్తా 200 అయిపోతోంది.. నాకు అర్థం కాలా….. సరే, ఓ ట్రయలేసి చూద్దామని internet explorer తెరిచి అందులో ఇదే సైటు కి వెళ్ళి మళ్ళీ ప్రాసెస్ మొదలుపెట్టాను….. డేటా వన్ ఉదంతం గుర్తు వచ్చి. అనుకున్నట్లే…ఏ సమస్యా లేకుండా ఫాం ఫిల్ చేసేయగలిగాను.

అదన్నమాట సంగతి…. గవర్నమెంటోళ్ళ మీద జోకులేసుకోవాల్నుకుంటే ఇది కూడా పనికొస్తుంది… అన్నట్లు మొదటి సైటు  BSNL దే అనుకుంటా కానీ… Passport సైటు NIC వాళ్ళది. ఈ రెండు అనుభవాల నుంచి అర్థం అయింది ఏమిటంటే internet explorer కి ఇదో Indirect official campaiging అని :))

Advertisements
Published in: on July 15, 2007 at 3:41 pm  Comments (10)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/07/15/dataone-passport/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. official campaigningaaa? kontha kaalam varakoo mee blaagulO koodaa “best viewed in IE” in pettinatlu gurthu….gurivinda ginja saametha vinnaaraa?

 2. mana govt. sites గురించి తెలీదు కానీ .. ఈ అమెరికన్ గవర్నమెంట్ సైట్స్ తో కూడా ఇదే ప్రాబ్లం !! బెస్ట్ ఉదాహరణ అమెరికన్ ఎంబసీ సైటు , అక్కడా అంతే ఫీ రిసీట్ డేట్ ఫైర్ ఫాక్స్ లో అస్సలు తీసుకొని చావలేదు …. IE లో భేషుగా పనిచేసింది !!
  ఇలా గవర్నమెంట్ సైట్సే కాదు మిగతావి కూడా చాలా ఉన్నాయి !!

  @ maverick : ఆ సామెత గురించి తెలీదు గానీ …. ఫైర్ ఫాక్స్ లో తెలుగు భేషుగ్గా కనిపిస్తుందని నాకు ఈ మధ్యే తెలిసింది !! IE కి అలాంటి config ప్రాబ్లం ఏం లేదు కాదు కాబట్టి ఈసీ వ్యూయింగ్ అందరూ IE వాడారు (వాడుతున్నారు )!! 😉
  బై ద వే నేను ఫైర్ ఫాక్స్ ఫాన్ బాయ్ కాదు !! 🙂

 3. maverickగారు best viewed in ie వేరు, can be viewed only in ie వేరు. అయినా dataoneవారు ఆ వెబ్‌సైటుని తయారుచేయటానికి ఇచ్చిన డబ్బులతో, ఆ కంపెనీ ie మాత్రమే పనిచేయించ గలిగిందన్నుకుంటా. browser independent వెబ్‌సైటు తయారు చేయడం అనుకున్నంత సులువుకాదు, అందుకనే తొందరగా తయారు చేసేద్దామని ఎక్కువమంది ఉపయోగించే బ్రవుజరుకు(ieకి) మాత్రమే తయారు చేసేస్తారు. ఆ తరువాత వారికి ఓపిక ఉంటే మెల్లగా మిగతా బ్రవుజర్లకు కూడా సపోర్టు చేస్తారు.

  ప్రభుత్వ వెబ్‌సైటులే కాదు, hutch, iciciలాంటి ప్రయివేటు సంస్థల వెబ్‌సైటులలో కూడా కొన్ని పేజీలు ieలోనే పని చేస్తాయి…

 4. I was about to answer Maverick’s doubt..which kind of amused me a lot… Pradeep answered it..thanks for it.
  In one sentence: I did not develop Firefox…So, I have no option to say anything other than a word of caution that – “this site is best viewed in IE”

  guruvinda ginja saameta ekkada upayoginchaalo akkada upayogimchaali. 🙂

 5. @ maverick
  😀

 6. అమెరికాలోనూ అదే తంతు. ఇప్పుడు నేను పనిచేస్తున్న DOTలో కూడా IE మాత్రమే support చేస్తారు. చివరికి నా PCలో IE తప్ప వేరే బ్రౌజర్లు వాడే అవకాశం లేదు. వాడనివ్వరు. ఇదో అర్థం కాని పిచ్చి వీరిది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 7. ఎప్పుడన్నా ఈ బ్రౌజర్లకి కోడ్ వ్రాస్తే తెలుస్తుంది కష్టాలు!

 8. చావా గారు:

  ఇక్కడ పెద్ద సమస్య బ్రౌజర్లు పూర్తిగా w3c స్టాండర్డ్స్ పాటించకపోవడమే. కొన్నిటికి తమ సొంత interpretations ఉంటున్నాయి.
  ఇక కోడ్ చేసే వారికి నరకమే.

 9. Indirect official campaign ? LOL. Do you think MS pays companies put that message? The rule is very simple for any software development project in web..It will be less expensive to develop and test any web app for a browser which is being used by 80%+ PCs in this world rather than 13% (majorly in USA) used. I really don’t see many enterprise j2ee apps are also being developed only for IE.

  Bottom line is ..business stands on practicality and not on emotions and software we love. They develop for software most of the people use. You will certainly see companies developing applications for firefox if it could reach atleast 50% browser share in future.

  one thing you must understand, there are many apps which cannot be rendered in firefox including Indic, as far as I know, IE has very minimal surface in this problem area. I switch browsers a lot…but when I go for any critical financial transaction, I use IE only…I dont wanna see some error message in between of some transaction saying it doesnt work with FF right? 🙂

 10. mari ayite naa frend vaalla office PCs lo only Linux ata. Does it mean she should not do many of these transactions online??? This ies4linux is there, but…how many know abt it?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: