ఈ రెండు పాటల మధ్య సంబంధం ఏమిటీ?

ఆ మధ్య చాణ్ణాళ్ళ క్రితం జావెద్ అఖ్తర్ కీ నస్రీన్ కబీర్ కీ మధ్య జరిగిన సంభాషణ వంటి ఇంటర్వూ ని అఖ్తర్ వి ఓ అరవై పాటలతో కలిపి వేసిన Talking Songs అన్న పుస్తకం చదివాను. ఇంటర్వ్యూ బాగుంది. పాటలు రాయడం లో ఉండే కష్ట నష్టాలు, ఒక పాటల రచయిత కీ, మరొకరి కీ మధ్య శైలుల్లో ఉండే తేడా, పదజాలం ఎంపిక, హిందీ పాటల ఎవల్యూషన్ – ఇలా ఎన్నో విషయాలు చర్చించారు. వివిధ పాటల రచయితల్ని గురించి జావెద్ అఖ్తర్ బాగా స్టడీ చేసినట్లు అనిపించింది. అసలు చివర్న ఆ పాటలు, వాటి ఇంగ్లీషు అనువాదాలు ఇవ్వడం లో ఉన్న మతలబు అర్థం కాకపోయినా కూడా, దాని వల్ల ఒక విషయం తెలిసింది.

మన ఖడ్గం సినిమా లోని – “మేమే ఇండియన్స్” పాటకూ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ సినిమా లోని ట”ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ” పాటకూ ఉన్న సారూప్యం. మన తెలుగు పాట ని శివశక్తిదత్త రాసినట్లు గుర్తు. సరే, విషయానికొస్తే హిందీ పాట ని “చదువుతూ” ఉంటే నాకు ఆశ్చర్యమేసింది….రెంటి మధ్య సారూప్యానికి ఏమన్నా కథ ఉందేమో నాకు తెలీదు కానీ, అనువాద చిత్రం కానప్పుడు అవే భావాలు ఎందుకు వాడినట్లో అర్థం కాలేదు.

ఉదాహరణ కి … తెలుగు లో… “ప్రేమా కావాలంటాం, పైసా కావాలంటాం..” అని వస్తుంది. హిందీ పాటలో – “హమే ప్యార్ చాహియే, ఔర్ కుచ్ పైసే భీ” అని వచ్చింది. “ఇలాగ ఉంటాం..అలాగ ఉంటాం.” అని తెలుగులో వస్తే “హమ్ ఐసే భీ హై, హమ్ హై వైసే భీ..” అని వచ్చింది. “కలలూ కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో..” అని తెలుగు లో ఒక లైను. హిందీ పాటలో – “ఆంఖో మే కుచ్ ఆసూ హై కుచ్ సప్నే హై..” అని వచ్చింది…. పాట థీమ్ ఒకటి అవడం యాదృచ్ఛికమే కావొచ్చు కానీ… ఇలా ఇన్ని లైన్లు కలవడం కూడా అంతేనా లేక ఏమన్నా కథుందా? అన్నది నాకు అర్థం కాలేదు.

ఏమైనా, ఇందులో అఖ్తర్ అన్న ఓ వాక్యం ఓ సారి అందరికీ చెప్పి పంచుకోదగ్గది… “All forms of creativity are an exercise in schizophrenia because you need to be more than one person within you to be creative.”

Advertisements
Published in: on July 13, 2007 at 1:12 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/07/13/relation-between-these-2-songs/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

 1. కాలేజిలో “మేమే ఇండియన్స్” అన్న పాట వింటుంటే, ఒక ఉత్తరభారతీయుడు నన్ను అడిగాడు పాట అర్థ ఎంటని, నేను అంతా ఎం వివరిస్తాంలే అని.
  ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ ఉందిగా దాని తెలుగు వెర్షన్ అని శెలవిచ్చా సరళంగా.

  పాటలలో సారూప్యం కాకతాళీయం ఐతే కచ్చితం గా కాదనిపిస్తుంది నాకు. తెలుగు పాట ఒక్కసారి వింటే అర్థమయిపోతుంది అది హిందీ నుండి ‘ఇన్సపైర్డ్’ అని. పైగా హిందీది వచ్చిన కొంత సేపటికి తెలుగుది వచ్చింది.

  —————
  schizophrenia లాజిక్ చాలా బాగుంది. ఒక సారి నా మిత్రుడొకడికి ఈ విషయాన్నే వివరించాడనికి ప్రయత్నించా. కాని వాడికి అర్థంకాలేదు.
  ఇంలాటి సిధ్ధంతమే,

  రాకేశ్వర రావు


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: