కొత్త టపా (ఏ పేరూ తోచక ఈ పేరు పెట్టాను)

మొన్నామధ్య నాకు, నా నేస్తానికి మధ్య ఓ చర్చ లాంటిది జరిగింది. చర్చంటే చర్చ కాదు. ఓ ఐదు నిముషాలు జరిగింది. అంతే. విషయం – “కథా వస్తువు”. కథ కి వస్తువు ప్రధానమా, కథనం ప్రధానమా? అని. నేనేమో ఏ వస్తువు మీద అయినా మంచి శైలి లో, మంచి కథనం తో రాస్తే ఆ కథ లో చదివించేగుణం ఉంటుంది అన్నాను. వస్తువు కృతకంగా లేనంతవరకు వస్తువు ఏదైనా కథ ని బాగా తీర్చిదిద్దొచ్చు ఏమో అని అనిపిస్తుంది నాకు. హారర్ కథల నేపధ్యాలు అన్నీ నమ్మశక్యంగా ఉండవు. కొంత వరకు కృతకమే. అయినా, జనాలు వాటిని చదువుతూనే ఉన్నారు. దానికి కారణం కథనమే అని నా నమ్మకం. మీరు ఏమంటారు?

గత వారం లో ఓ అగాథా క్రిష్టీ నవల  “Cards on the table” చదివాను. బాగుంది. ఆ మధ్య కాలం లో క్రిష్టీ అంటే బోరు కొట్టేసింది. మళ్ళీ ఈ నవల తో ఆసక్తి కలిగింది. వెంటనే లైబ్రరీ నుండి మరో క్రిష్టీ నవల “The seven dials mystery” తెచ్చాను. ఇది కూడా ఆసక్తికరంగా ఉండింది.  క్రిష్టీ నవల్లలో నాకు నచ్చనివి కూడా ఉన్నాయి…నేను చదివిన వాటిలో. కానీ క్రిష్టీ రాక్స్ 🙂 కనీసం కొన్ని సార్లైనా ఈ విషయం అనుకోక తప్పదు.

జూన్ 30న హిందూ లో ఓ వ్యాసం వచ్చింది. చైనా లో ఇంటిపేర్ల కొరతట. 🙂 నవ్వొచ్చింది అది చదువుతూ ఉంటే. వాళ్ళకి ఏదో వంద ఇంటిపేర్లే ఉంటాయట. అందువల్లే సమస్య. మనకో! ఇంటికొక ఇంటి పేరు 😉

అన్నట్లు…ఓ ఆసక్తి కరమైన సంగతి తెలిసింది నార్ల వెంకటేశ్వర రావు రాసిన సంపాదకీయాల సంకలనాలలో “జీవిత చిత్రణ లు” అన్న భాగం చదువుతూ ఉంటే ఒక ఆసక్తి కరమైన విషయం తెలిసింది.  “ఈలపాట రఘురామయ్య” గా బాగా పేరొందిన మనిషి ని ఇన్నాళ్ళూ – “ఈలపాట” వల్ల పేరొందిన రఘురామయ్య ఏమో అనుకుంటూ వచ్చాను. కానీ, ఆయన అసలు పేరు వెంకట సుబ్బయ్యట!!!! మరైతే రఘురామయ్య పేరు ఎందుకు వచ్చిందో. ఈ పుస్తకం లో ఇలాంటి విషయాలు కోకొల్లలు. అసలు పేర్లు వినని ఎందరో పాత తరం వ్యక్తుల గురించి చదివాను. అయితే, అసలు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. అవి-
1. కొన్నింటికి మాత్రమే తారిఖులు రాసి కొన్ని సంపాదకీయాలకి ఏమీ రాయలేదు.
2. ఆ వ్యాసాల తరువాత ఆ మనిషి ని గురించి ఓ రెండు ముక్కలు రాసి ఉండాల్సింది వీటిని పుస్తకం గా అచ్చేసేటప్పుడు. ఈ తరం వారు ఎంత మందికి – డాక్టర్ రఘువీర అంటేనో, సునీతి కుమార్ ఛటర్జీ అంటేనో, ఈడ్పుగంటి అంటేనో, పటాస్కర్ అంటేనో తెలుస్తుంది? విచిత్రం ఏమిటంటే ఈ వ్యాసాల చివర ఫుట్‌నోట్లు గా – “రాజా రామమోహన్ రాయ్ ఒక సంఘ సంస్కర్త అనో, లేకుంటే బాగా ప్రజల నోళ్ళల్లో నానిన లజపతిరాయ వంటి నాయకుల గురించి ఇంట్రో లు రాయడం!!!! కాస్తో కూస్తో భారత చరిత్ర తెలిసిన వారికి అందరికి ఈ పేర్లు పరిచితమే. ఆమాత్రం చరిత్ర తెలియని వారు ఈ పుస్తకం చదివే అవకాశాలు దాదాపు నిల్లు. విచిత్రంగా వారి గురించి ఇంట్రో లు రాసి అసలు వ్యక్తుల గురించి తెలుపకపోవడం ఈ పుస్తకం ప్రత్యేకత.

నేనో మూడు నాలుగు రోజులు Need For Speed కి అంకితమై మళ్ళీ వారం రోజుల క్రితమే బయటపడ్డాను. అఫ్కోర్సు, ఇంకా ఫెలూదా జపం నుండి, సత్యజిత్ రే నామస్మరణ నుండి మాత్రం బయటకు రాలేదు.

ఇక్కడితో ఈ ప్రసారం సమాప్తం.

Advertisements
Published in: on July 10, 2007 at 1:57 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/07/10/random-post/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. మా వూళ్ళో రేగే వేసవికాలపు గాలిదుమారంలా ఉంది నీ టపా, సౌమ్యా! :-)గుక్క తిప్పకుండా ఒక్క టపాలో ఒక వంద విషయాలు చెరిగేశావుగా!

  నీకూ నీ నేస్తానికీ వచ్చిన చర్చలో – సంగీతానికి “శృతిర్మాతా, లయః పితా” లాగా గొప్ప కథకి వస్తువూ కథనమూ రెండూ ముఖ్యమే. చప్పటి వస్తువుని గురించి గొప్ప కథనంతో రాస్తే నువ్వన్నట్టు చదివించే గుణం ఉంటుంది కానీ, అది గొప్ప కథ కాలేదు. మంచి వస్తువుని తీసుకుని అడ్డదిడ్డపు కథనంతో రాసినవి చదివినప్పుడు మరింత నిస్పృహ కలుగుతుంది – తెలుగులో గత పదేళ్ళ కథల్లో చాలా మట్టుకు ఇలాంటి నిస్పృహ మిగిల్చాయి.

 2. కథా ? కథనమా ?
  ఇదే నిన్న నా సమీక్షలో వివరించడానికి ప్రయత్నించా.
  నా అభిప్రాయం లేక్కల పరిభాషలో,
  వావ్ విలువ = కథ x కథనం
  కథ belongs to 0 to infinity
  కథనం is a percentage.

  నిన్నటి మీ కథలో , కథ = 10 (say), కథనం = 99%,
  మొత్తం విలువ = 9.9
  అలాగే ‘నేను’ వ్రాసిన కథలో, కథ = 50 (relative to above), కథనం = 10%, మొత్తం విలువ = 5
  కాని ఇది వావ్ విలువ మాత్రమే, ఇలా వేరే విలువలు ఇంకా ఉంటాయు,
  ఉదా- హ్యాపి ఫీలింగ్ విలువ, వైడోంట్-సచ్-తింగ్స్-హెపెన్-టుమీ విలువ వగైరా,
  వాటిలో కథనానికి ఇంకా ఎక్కవ ప్రాముఖ్యం ఉండవచ్చు.
  for example, if you are reading O Henry stories, you are left with an amazing wow feeling. Where as if you are reading Ruskin Bond story, you are left with a heart warming feeling etc.

  In summary, Kahta has something to offer and Kathanam has to ensure you get everything that the Katha has to offer out of it.

  Thats my 2 paisa on the ‘debate’.

 3. “In summary, Katha has something to offer and Kathanam has to ensure you get everything that the Katha has to offer out of it. “

  బాగా చెప్పావు రాకేశ్వరా!

 4. ఎదో మీ దయ గురువుగారు 🙂

 5. నా అభిప్రాయాలు ఇవే.
  నాకు మాటలలో చెప్పడం వెంటనే చేతకాక ఆలోచిస్తూ ఉండి పోయాను.
  అభిప్రాయం ఇదే అయినా, నా మీద పుస్తకం చూపే ప్రభావానికి మాత్రం, కథనం ఎక్కువ పాత్ర వహిస్తుందేమో అనిపిస్తుంటుంది నాకు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: