రైతుల ఆత్మహత్యలు

ఇవాళ ఉదయం హిందూ పేపర్ లో P.Sainath రాసిన ఓ వ్యాసం చదివాను. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు ప్రస్తుతం ఏమి చేస్తున్నాయి అన్న విషయం పై రెండు ఉదాహరణలతో రాసిన వ్యాసం అది. అది చదివాక ఒక విధమైన – “ఇది” అని చెప్పలేని తరహా – బాధ కలిగింది. ఇప్పుడే మరో వ్యాసం చూసాను – Andhra pradesh – Suicide for survival అని Binu Matthew రాసిన వ్యాసం. “A unique drama is being played out in the South Indian state of Andhra Pradesh. Grim, dark and unbelievable yet horrifically real.” అంటూ మొదలైంది. నిజానికి ఈ విషయం వినడం కొత్తేమీ కాకపోయినా కూడా ఈ తరహా భాష లో వినడం ఇదే తొలిసారి. కాబట్టి తగలాల్సిన దాని కంటే ఎక్కువగానే తగిలింది దెబ్బ నాకు.

Driven to desperation farmers in the state are committing suicide with the hope of getting the relief package offerered for the survivros of deceased…” చదువుతూంటే మనసంతా ఎదోలా అయిపోయింది. ఆత్మహత్యకి ముందు తమ కుటుంబాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. మళ్ళీ మరు క్షణం లో అదే నిర్ణయం బాధ్యతారాహిత్యం గా, తన వారిని నట్టేటిలో ముంచేసేలా అనిపిస్తుంది. ఈ ఆత్మహత్యల పర్వం ఎవరి బాగు కి? ఎవరి బాధ కి? అన్నది నాకో చిక్కు ప్రశ్న గా మారింది చివరికి. బాధితులు, లాభితులు కూడా ఒకరేలా కనిపిస్తున్నారు.  మన వ్యవసాయానికి వర్షం కోసం చాతక పక్షి లా ఎదురు చూడ్డం తప్ప మరో మార్గాంతరం లేదా?? మన రైతులకి ప్రకృతి వంచిస్తే కోలుకునే మరో మార్గం లేదా? పరిస్థితి చక్కబడడానికి ప్రభుత్వం పాత్ర ఏమిటి? సామాన్యులు ఏమన్నా చేయగలరా?

– అప్పుడోసారీ, ఇప్పుడోసారి చదవడం మినహా ఈ సమస్యతో నాకు ప్రత్యక్ష సంబంధం లేదు కనుకే ఇన్ని సందేహాలు. 😦

Advertisements
Published in: on June 26, 2007 at 9:49 am  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/06/26/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2-%e0%b0%86%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. I’m not saying it’s easy.
  But something can be done with inspiration from this http://gsnaveen.wordpress.com/2007/06/11/ratnappa/?

 2. ఇంకో బ్లాగు కూడా ఉందా ? నాకిప్పుడే తెలిసింది.

  ఈ ఆత్మహత్యల పర్వం ఎవరి బాగు కి?
  బాగు అన్నది రిలేటివ్. చావు వారి అప్పులకంటే చాలా తియ్యనైనదిగా కనిపిస్తుంది కొన్ని సార్లు.
  ఎవరి బాధ కి?
  బ్రతికున్నవాళ్ళ ఇప్పటి బాగుకి అన్నది కల్ల, వారి తరువాతి బాధకి అన్నది నిజం. మొదటిది, ఈ సమస్యకి దారి తీస్తుంది, రెండవది దాన్ని ‘సమస్య’ చేస్తుంది.
  మన వ్యవసాయానికి వర్షం కోసం చాతక పక్షి లా ఎదురు చూడ్డం తప్ప మరో మార్గాంతరం లేదా?? మన రైతులకి ప్రకృతి వంచిస్తే కోలుకునే మరో మార్గం లేదా?
  జలాసయాలూ, కాలవలు నిర్మించవచ్చు ప్రభుత్వం. దానికి తెలుసుగా ఎన్ని ఆటంకాలు ఉంటాయో. ఐనా అది ఒక్కటే సరిపోదు. రైతులకు సరైన ధర లభించకపోవడం పెద్ద సమస్య. దానికి ప్రభుత్వం మార్కెట్ ని కంట్రోల్ చెయ్యాలి. కాని మార్కెట్ అనేది కంట్రోల్ చెయ్యలేము పూర్తిగా…
  పరిస్థితి చక్కబడడానికి ప్రభుత్వం పాత్ర ఏమిటి?
  అందరూ ప్రభుత్వం అంటారు గానీ, economics government కంటే పెద్దది. ప్రభుత్వం మార్గదర్శకత్వం తప్పక చూపగలదు. రైతుల వల్ల ప్రభుత్వానికి ఇప్పటికే ఉచిత విధ్యుత్తు సబ్సీడిల వల్ల భారం పడుతూనే ఉంది. నాకూ పెద్ద గా తెలియదు. నేను ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.
  సామాన్యులు ఏవఁన్నా చేయగలరా?
  సామాన్యులు మాన్యులవగలరు. మాన్యులేదైనా చెయ్యగలరు. suicide helpline నుండి, కొత్త credit system ల వరకూ దైనినైనా స్ధాపించగలరు. నాయకులవగలరు, దారిచూపగలరు.

 3. నాకు తెలిసినంతలో ఒక ఉదాహరణ చెబుతాను: మా ఉర్లో దాదాపు ఇరవై గ్రామాల ప్రజలకు సేద్యపునీటినందించే చెఱువుకు ఒకసారి గండిపడి పొలాలకు నీరందించే కాలువ పనికిరాకుండా కోసుకొనిపోయింది. ఆ తరువాత కొన్నిసార్లు ఆ చెఱువు నిండినా కాలువలేకపోవడంతో ఎవ్వరికీ నీరందలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే, చిన్నవానపడినా చెఱువులోకి ఆ నీటిని చేర్చే కాలువ ఒకటుండేది. అదిప్పుడు వాననీటిని వ్యర్థంగా ఒక నదిలోకి పంపించేస్తూంది. ఆ కాలువ మరమ్మత్తుకు ప్రభుత్వం అప్పుడుప్పుడూ కొంతసొమ్ము విడుదలచేస్తుంది. దాన్ని స్థానిక భోక్తలు స్వాహాచేసేసి మళ్లీ చేతులు చాపుతుంటారు. ఈ కాలువేగనుక బాగుపడితే ఆ గ్రామాలన్నీ సస్యశ్యామలం అవుతాయి. వ్యవసాయపనులు నిరంతరం సాగుతాయి. కూలీలు దొరుకుతాయి. మడుగుల్లో చేపలుపెరుగుతాయి, పేదవాళ్లకు పౌష్టికాహారం లభిస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే వాళ్లకు నాయకులచుట్టూ తిరిగే పని ఉండదు. నాయకులతో పని లేనివాళ్లు ఎక్కువైతే నాయకులకు పనులు జరగవు. కాబట్టి ప్రజలు దీనులై ఉండాలి. నాయకుల దయాభిక్షమీద బతుకుతున్నామని ప్రజలు గుర్తెరగాలి. ఇది జరగాలంటే ప్రజలకు జరుగుబాటు ఉండరాదు. అంటే చెఱువు నిండరాదు, నిండినా నీరందరాదు. ఇది మావూరి అధికారిక మాఫియా. బహిరంగ తీవ్రవాదం.

 4. Can there be no way out of this?
  రానారె గారు,
  మీరు, ప్రసాద్ గారు ఇలా పల్లేటూళ్ళలో రాజకీయాల గురించి చెప్తుంటే చాలా బాధ వేస్తుంటుంది. ఏమీ చెయ్యలేరా ప్రజలు స్వంతంగా పూనుకుని? ఒక్కొక్క కుటుంబాన్నైనా నిద్ర లేపలేమా? ఏమీ చెయ్యలేమా?

 5. మధు యాష్కీ గౌడ్ – ఇప్పుడందరికీ తెలిసున్న పేరే. ఇక్కడ చెబుతున్నది ఆ మధ్య సంగతి:

  మధు యాష్కీ కి న్యూయార్క్ లో International Legal and Trade Consultancy అనే సంస్థ ఉంది. ఆదాయం బానే ఉంది. ఒకసారి న్యూయార్క్ నుండి మరో చోటకి రైల్లో వెళ్తూ అక్కడి వార్తాపత్రిక చదువుతున్నారు. ఒక చోట ఒక వార్త ఆయన్ని కదిలించివేసింది. ఆ క్షణం ఆయన జీవన గతినే మార్చేసింది. ఆ వార్త “భారత దేశంలోని అంధ్రప్రదేశ్ అన్న రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు” !! తన కర్తవ్యం ఎమిటో స్ఫురించింది. అప్పుడే ఒక నిర్ణయం తేసుకుని కొద్ది రోజుల్లో ఇండియా వచ్చారాయన. నేరుగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్ని చేరుకుని ఒక్కొక్కరికీ 10 వేలు చొప్పున 43 కుటుంబాలకి తక్షణ సాయం అందించి వారికి ధైర్యం అందించారు. అమెరికాలో తన మిత్రులకి విషయం చెప్పి వారిచే అలాంటి ఎన్నో కుటుంబాలకి పలు విధాల సాయం అందిస్తున్నారు ఇప్పటికీ. ఒక ఫౌండెషన్ స్థాపించారు కూడా.

  మన బిజీ లైఫ్ లో ఆయా రైతుల కుటుబాలని చేరుకోలేం. అలా అని యేమీ చెయ్యకుండా ఉండలేం. ఎలా సాయం చెయ్యగలమో యం.పి. మధు యాష్కీ గౌడ్ నే అడిగి తెలుసుకుందాం.

  ఆయన వెబ్ సైట్ ఇదిగో.

  http://www.madhuyaskhi.com/on_issues.htm

  మంచి వ్యాసం రాసిన సౌమ్య గారికి థాంక్స్.

  కృష్ణ

  గ్రేటర్ హైదరాబాద్

 6. namastee sir,

  iam ramesh iam complite M.A political scince O.U.

  small requset for you meeru plz start new party .
  party name (1)TELEGANA CONGRESS PARTY OR (2)TELEGANA NAVANIRMANA SENA.

  sir thapuluuventee sorry
  ————————–

  ramesh mothe
  9849935185

 7. రైతులకి సబ్సిడీలూ, ఉచిత విద్యుత్తులూ ఇవ్వకూడదు. అదే సమయంలో వారి మీద (ఎంతోకొంత) ఆదాయం పన్ను కూడా విధించాలి. వారి పంట మొత్తాన్ని (బావున్నా, బాగాలేకపోయినా) ప్రభుత్వమే కొనెయ్యాలి. ప్రభుత్వం ద్వారానే అది ఇతరులకు బట్వాడా అవ్వాలి. అటువంటి వ్యవస్థని మనం నిర్మించుకోగలిగితేనే రైతుల పరిస్థితిని మెఱుగుపఱచగలం.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: