ఫెడోరా 6 లో తెలుగు కీబోర్డు

మొన్నో రోజు దీని గురించి ఓ వ్యాసం లో ఓ వాక్యం చెప్పాను కానీ … ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. మళ్ళీ ఈ సారి దీని పైనే ఓ టపా తో మీ ముందుకి వస్తున్నా. ఫెడోరా 6 లో ఉన్న SCIM telugu keyboard లో మనకు రెండు టైపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ITrans, ఒకటేమో inscript. దీని వల్ల మీ లినక్స్ Desktop పై ఎక్కడైనా ఏ utility లో అన్నా తెలుగు లో టైపు చేయవచ్చు. 56 తెలుగు అక్షరాల్లో 54 అక్షరాలను నేను టైపు చేసాను. మిగిలిన రెండూ – మూడో చ, మూడో జ. అవి రెండూ యూనీకోడు లోనే లేవు లా ఉన్నాయి. యూనీకోడు చార్టు లో కనబళ్ళేదు. ఇక నాలో inscript అన్న పదం పై కూడా ఆసక్తి పోయింది. ITrans RTS కి చాలా దగ్గరగా ఉంటుంది. కావున, నేనో కొత్త లేఅవుట్ నేర్చుకుని తంటాలు పడనక్కరలేదు.

Intuitive గా RTS-ITRANS – ఇవే inscript కంటే కరెక్టు గా అనిపిస్తాయి నాకు. ఇదే ఓ సారి – “మీ మైక్రోసాఫ్ట్ వాళ్ళ లే అవుట్ ఏమిటి అలా ఉంది?” ఓ మైక్రోసాఫ్ట్ ఆయనతో అంటే – నిజమే… ఆ లేఅవుట్ కంటే RTS మనిషి intuition కి దగ్గర్లో ఉంటుంది అని అన్నారు. ఫెడోరా 5 లో కూడా కీబోర్డులు ఉన్నవి కానీ, తెలుగు లేదనుకుంటా. ఏమైనా, నాకు ఆనందంగా ఉంది ఇది చూసాక. విండోస్ కి బై-బై చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. చెప్పేసే ప్రయత్నం లో ఈ మధ్యే కొన్ని మెట్లు ఎక్కడం మొదలైంది. ఇది మరో మెట్టు. మీరెవరన్నా ఫెడోరా ఉపయోగిస్తూ ఉంటే ప్రయత్నించండి. ఏవో చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా సమస్యలేమీ లేదు ఇందులో. కానీ, అవి చెప్పుకోదగ్గ సమస్యలేమీ కావు. నాకు ఐతే దీనితో ఉన్న ఏకైక సమస్య – టాగుల్ కి కీ ఉందో లేదో తెలీకపోవడం.

ఇందులో ఇంకా ఉన్న భాషలు – Arabic, Assamese, Bengali, Gujarathi, Hebrew, Hindi, Kannada, Malayalam, Marathi, Oriya, Punjabi, Simhala, Tamil, Telugu, Urdu, Chinese (రకరకాల encodings) వగైరా.

తెలుగు అక్షరాలన్నీ టైపు చేసిన screenshot కూడా పెడుతున్నా.


Advertisements
Published in: on June 8, 2007 at 1:21 pm  Comments (10)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/06/08/fedora-telugu/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. శుభ వార్త పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
  ఇక విసుగుడు, సణుగుడు, ఏడుపు మొదలు పెడతాను.
  1) లిపిలో రాయడం అన్నిటి కంటే వేగమైన పద్ధతి, పైగా మీరు తెలుగు రాసేటప్పుడు దానికి ఆంగ్లంతో ముడి పెట్టనక్కరలేదు. ఎంగిలికాని తెలుగు అన్న మాట.
  2) కొత్త లే అవుటు నేర్చుకోవడమే పని, ఆ తరువాత రెండు కీబోర్డులకి ఎటు వంటి తికమక ఉండదు, తెలుగులో ఆలోచిస్తున్నప్పుడు తెలుగు కీబోర్డు ఆంగ్లంలో ఆలోచిస్తున్నప్పుడు ఆంగ్ల కీబోర్డు ఆటోమొటిక్ గా లోడవుతాయి బుర్రలోకి.
  3) ఆ మైక్రోసాప్టు ఆయనకి తెలియదనుకుంట అది ముందునుండే టైపు రైటర్లలో వాడబడే అతి ఇన్ట్యూటివ్ లే అవుటని.
  4) క్ష అక్షరము కాదనుకుంట, దానికి బదులు మూడో ఉభయాక్షరం అఁ మరచిపోయారు.

  సారి ఫర్ సౌండిగ్ రూడ్ బట్ ఐ సీం టు ఫీల్ స్ట్రాంగ్లీ ఎబౌట్ ఇన్ స్క్రిప్ట్.

 2. ఈజీ గా ఇన్‌స్టాల్ చేసుకోవటానికి యే లైనక్స్ బాగుంటుంది?
  ఉబంటు బావుందని ఎక్కడొ చదివా.
  అలాగే SuSE లో హార్డువేర్ plug and play కి సపోర్టు బాగా ఉందని ఒక మిత్రుడు చెప్పారు.

  0)ఇన్‌స్టాలేషన్ టైము
  1)ఈజీ ఇన్‌స్టాల్షన్
  2)మంచి ప్రింటర్ సపోర్టు (ఎక్కువ రకాల ప్రింటర్స్ కి సపోర్టు)
  3)USB డివైస్ సపోర్టు (డిజిటల్ కామెరా, థంబ్ డ్రైవ్ etc.,)
  4)స్పీడ్ (Red Hat 9 నేను వాడాను చాలా స్లో. ఒక పెక్క మూవీ పెట్టి, ఇంకో పక్క వేరే ది పెడితే ఇక కదలదు)
  5)ఓపెన్ ఆఫీసు పెర్ఫార్మెన్సు
  6)తక్కువ మెమరీ ఫుట్ ప్రింట్

  ఈ పై పాయింట్ల ప్రకారం లైనక్సుల compaision తెలుసా?

 3. @Rakesh:
  Just as u feel strongly about Inscript, I feel strongly about RTS-ITrans. Its not just my feeling..its a fact that RTS is intuitively closer to human mind than inscript.

  RTS అన్నది ఎంగిలి అన్న ప్రశ్నే లేదు. క అంటే k రాస్తాం. ఎందుకు… పలకడం లో కూడా దగ్గర గా ఉంతుంది కాబట్టి. మ అంటే m రాస్తే నాకు లాగికల్ గా అనిపిస్తుంది కానీ c rAstE kAdu.

  @Manyav:
  Easy installation… నేను లినక్స్ మొదలుపెట్టినరోజు నుండి ఫెడోరా తప్ప వేరొకటి ఎరుగను. ఫెడోరా లో నాకు సమస్యలేమీ అనిపించలేదు. ఉబంటు గురించి… installation బానే ఔతుంది కానీ దానిలో ప్రతి package మనంఏ install చెయ్యాలి అనుకుంటా…

 4. […] June 9th, 2007 — వీవెన్ తెలుగు కీబోర్డు లేఔట్లపై సౌమ్య టపా మరియు తెలుగుబ్లాగు సమూహాంలో […]

 5. సరే,
  క్షమించాలి.
  Inscript వారు ఎలా ఆలోచిస్తారంటే, ‘చ’ కి ‘చ’ కొట్టాలి ‘సి’ కొట్టకూడదు అని. మ,c ఒకే చోట ఉంటాయన్నది మీరు గుర్తుచేస్తే గాని గుర్తురాదు.
  ఏదేమైనా, ఇక్కడ పోటీ ఏమి జరగట్లేదుగా, ఎవరు వేగంగా కొట్టగలరని. అందుకని, మీరు నన్ను మన్నించి, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం.
  రాకేశ్

 6. http://www.quillpad.in/telugu ఉండగా వేరేగా తెలుగు కీ బోర్డ్ ఎందుకండి?

 7. MicroSoft KeyBoard Layout Creator 1.4
  రిలీజ్ అయ్యింది . చూడండి . ఇందులో మనకు నచ్చిన విధంగా కీ బోర్డ్ డిజైన్ చేసుకోవచ్చు. http://www.microsoft.com/globaldev/tools/msklc.mspx

  (ఇది నేను చేసినది (పూర్తి చేయనిది.)(మీరు ప్రయోగాలు/ పరిశోధన చేస్తున్నారు కాబట్టి http://mdileep.googlepages.com/wx.zip)

 8. http://mdileep.googlepages.com/wx.klc కూడా చూడ వచ్చు.

 9. Hmm..ధన్యవాదాలు దిలీప్ గారు… ఇంతకీ ఓ సందేహం… ఈ కేఎల్సీ ఫైలు లినక్స్ లో పని చేస్తుందా?

 10. pani chEyadhu.MicroSoft Product kaabatti.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: