Vasireddy Sitadevi Sahityam-6:3 navalalu

నేను వాసిరెడ్డి సీతాదేవి పేరు విని, విని –  ఆమె మట్టిమనిషి నవల గురించి విని విని –  లైబ్రరీ లో : “వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం-6:నవలలు” అన్న పుస్తకం కనిపిస్తే తీసుకున్నాను. అదో తరహా అనుభవం. మంచి reading experience అయితే ఖచ్చితంగా కాదు. మూడు నవలల సంకలనం.

“తొణికిన స్వప్నం” మొదటి నవల.మొదటి నుంచీ హీరోయిన్ రాధ కి ఓ ప్రత్యేకత ఆపాదించాలన్న ప్రయత్నం తప్ప నాకేం కనబళ్ళేదు అందులో. ఓ విషయం లేని తెలుగు సినిమానో, లేకుంటే ఓ జీడిపాకం సీరియల్ నో చదువుతున్నట్లు అనిపించింది. పైగా చెప్పదలుచుకున్నది ఏమిటో అర్థం కాలేదు. ఆ కథ లో రాధ మాటి మాటికీ నీళ్ళు తాగడం ఏమో కానీ నేను బోలెడు సార్లు “ఇంకా అవ్వదే?” అనుకున్నాను.

 “మళ్ళీ తెల్లవారింది” ఇదొక సంపూర్ణ సెంటీ, సగం నిరాశావాదం నిండిన నవల. కాస్త మూడింటిలో ok-ish గా ఉన్నది ఇది ఒకటే ఏమో. కానీ, అలా అని బాగుందని కాదు. ఈ మూడింటిలో గుడ్డిలో మెల్ల లా ఒకటి. అంతే. “బొమ్మరిల్లు” బాగా అరిగిపోయిన కథ. మొదల్లోనే అర్థమైపోతుంది కథా గమనం. ఏం కథలో ఏమో…. అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇది అయితే పక్కా సినిమా కష్టాల కథ. తండ్రి లేడు, తల్లికి ఏమీ తెలీదు, ముగ్గురు చెళ్ళెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. సుమారు 15 ఏళ్ళ వయసు తేడ తనకీ, చివరి పిల్లకీ. ఈమె ప్రేమ త్యాగం చేస్తుంది..ప్రేమికుడు చనిపోతాడు. …. ఇంట్లో వాళ్ళ ప్రేమ డబ్బు తో ముడిపడి ఉంటుంది….ఇలా అన్నమాట.

నేనైతే ఏక్తాకపూర్ కి చూపిద్దామనుకుంటున్నా ఈ పుస్తకాన్ని. కనీసం ఆమెకన్నా ఉపయోగపడుతుంది. ఇప్పటికి ముగ్గురికి చూపాను- చెప్పాను దీని గురించి. ఒకరేమో “నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను…ఆమెకి అంత పేరెలా వచ్చిందో అని” అన్నారు. ఇంకోరేమో “తెలుగు రచయిత్రులందరూ ఇంతేనా?” అని వెటకారం వ్యక్తం చేసారు. మూడో మనిషేమో “ఏమీ బాలేదు. మనసు పాడుచేయడం తప్ప ఏమీ చేయలేదు ఈ పుస్తకం”అన్నారు. ఈ చివరి మాట మాత్రం నిజం. ఈ నవల్లు చదివితే మన మనసు పాడౌతుంది తప్ప ఇంకేమీ జరగదు.చెప్పుకోదగ్గ శైలి లా ఏమీ అనిపించలేదు. చదవొచ్చా వద్దా అంటే చూస్తూ చూస్తూ OK అనలేను. కానీ, ఓ ప్రయత్నం చేస్తే చేయండి…ఆ పైన మీ ఓపిక, మీ కోరిక. ఎవరికన్నా ఏక్తా కపూర్ తెలిసి ఉంటే చెప్పండి. ఇది నేను ఓ కాపీ కొని ఆమెకి ఇస్తాను. అన్నట్లు మరిచేపోయాను. దీని ఖరీదు 150 రూపాయలు!!!!!! no value for money at all 😦

చివరగా సీతాదేవి గారి అభిమానులకు: నాకు ఆమెపై వ్యక్తిగత కక్షలు ఏమీ లేవు. ఇది ఆ పుస్తకం పై నా అభిప్రాయం మాత్రమే. వ్యక్తిగత దూషణలకు నా బ్లాగు వాడుకోవద్దని మనవి.

Advertisements
Published in: on June 7, 2007 at 2:40 am  Comments (10)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/06/07/vasireddy-sitadevi-sahityam-63-navalalu/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. చాలా యేళ్ళ క్రితం వాసిరెడ్డి సీతాదేవిదే ‘మరీచిక’ నవల చదివినట్లు గుర్తు నాకు. ఆ నవల చదివాక, అప్పటి వరకు రచయిత్రుల నవలల మీద, కథల మీద నాకున్న అభిప్రాయాలకు వాసిరెడ్డి సీతాదేవి మినహాయింపు అనుకున్నా!
  మీకూ ఆ పుస్తకం దొరికితే ఒక సారి చదవడానికి ప్రయత్నించండి!

  ఇకపోతే – పేరు, అవార్డులు రావడానికి, బాగా వ్రాయడానికి సంబంధం ఉంటుందని (కనీసం తెలుగు రచయితలు/కవులు/రచయిత్రులు/కవయిత్రులు వరకు) నేనీ మధ్యన అనుకోవడం లేదు!! కాకుంటే కొండొకచో పరిమితమైన మినహాయింపులు ఉండొచ్చు! దేనిని సాధారనీకరించలేము కదా!

  – సిరి
  పి.యెస్: మరీచిక వాసిరెడ్డి సీతాదేవి నవల కాకపోతే – మొదటి పేరాను ignore చెయ్యండి. ఆసక్తి ఉండి, మరీచిక దొరికితే చదవండి.

 2. Hello Sowmya,

  ‘marIcika’ is Vasireddi Sitadevi’s novel, I just got a confirmation.
  As I said earlier, I read it long ago and was very much impressed(don’t how I feel, if I read it now!)!

  Thanks,
  siri

 3. sItAdEvi gaaru has written quite a few novels and short stories. I was told that “samata” is her best novel. I haven’t read it yet. “maTTi manishi” and “marIcika” – are novels I have read and liked very much.

 4. Matti Manishi is an excellent novel. Matti manishi gurinchi vini avida vere novels techukovatam enduku. maTTi manishi tecchukovacchu kada.

  maTTI manishi is an outstanding novel.
  Marichika is a good novel too.

 5. @Swapna: లైబ్రరీ లో దొరికింది తెచ్చుకుంటాం కదండీ… మళ్ళీ మట్టి మనిషి దొరికితే అది కూడా తెచ్చుకుంటాను.

 6. I am sorry to see such a statement from you
  “దీని ఖరీదు 150 రూపాయలు!!!!!! no value for money at all”
  Prices are determined by publishing companies and authors or content of a book will never have anything to do it.
  Say there will be a book about ” attributing harappa culture to modern world ” and it might be written with complete trash analogies and the price may be some 1500 rs. You can accuse the writer for bad content but nt about pricing of book , i believe.
  and i conclude just like you say, this is only my opinion not to make fun of yours.

 7. @Viplove: Hmm… may b i will not worry about prices now. That was 3 yrs back, when I was still a student annd 150rs was still a princely amount back then 🙂

 8. Soumya garu

  Now we are in a digital age and all the oldest novels are seem to be very funny and useless for the techies like you. Just imagine the time of writing those novels and theme. As many people expressed as above the novel ” MATTI MANISHI” is a Sahitya Academy winning novel and people who doesnt have the agricultural back ground cannot understand the novel also.

  If you watch the movies of NTR and ANR today, you feel bore as we are in hollywood movies age.

  You are in a stage to read the novels of Chetan Bhagavat, and other corporate novels.

 9. @Sriram: Thanks for the comment. I did not read “Matti Manishi” yet. So, I can’t comment on that. However, I did read Chetan Bhagat (Not Bhagavat)….and I don’t have any good or bad feelings on them.

  Also, I object to that statement – “all the oldest novels are seem to be very funny and useless for the techies like you”. Most of the fiction I like was written perhaps in the 50s or even before that…. both in English and Telugu 🙂

 10. MATTI MANISHI NOVEL BY VASIREDDY SITA DEVI IS AN
  EXCELLENT NOVEL IN TELUGU LITERATURE. THOSE WHO LIKE
  NOVEL LITERATURE IN TELUGU MUST READ THIS NOVEL

  K R SUBRAHMANYAM
  KAKINADA


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: