బూదరాజు ఉషా రాణిగారు, కథాకేళి, మమ్ముట్టి సినిమా వగైరా…

నిన్న మా అమ్మ నన్ను అడిగింది నన్ను – “మన ఇంట్లో ఫ్రెంచ్, రష్యన్ రచయితల అనువాదాలు ఏమన్నా ఉన్నాయా?” అని. నేను తనకేమో అనుకున్నాను. తరువాత అమ్మే అన్నది – “.. నాక్కాదు లే. ఆవిడకి” అని. అప్పుడే మా అమ్మ కింద అపార్ట్మెంట్లో ఉన్న తన స్నేహితుల ఇంటికి వెళ్ళివచ్చింది. సో, వాళ్ళ గురించి అని అర్థమైంది. మా ఇల్లు ఓ పుస్తకాల అడవి తరహా ది. ఎప్పుడో 70లలో నుండి మా నాన్న కొన్న పుస్తకాలు మొదలు, కొత్త మిలీనియం లో నుండి మేము కొంటున్నవి వరకు(అంటే నేను, తమ్ముడు కొన్నవి 1% ఉంటాయేమో బహుశా) ఇంట్లో ఎటు చూసినా కనిపిస్తూ ఉంటాయి పుస్తకాలు. సాధారణంగా నాకు పుస్తకాలు ఇంకోళ్ళకి ఇవ్వడం లో ఆసక్తి ఉండదు. దిగులు … వాటికి ఏమౌతుందో అని. కానీ, వీళ్ళు జాగ్రత్తగానే తిరిగిస్తారని నమ్మకం ఉండటం వల్లనూ, నాకో సారి – “కలకత్తార్ కే చేయీ” అన్న మంచి బెంగాలి నవల తెలుగు అనువాదాన్నీ, “భద్రిరాజు కృష్ణమూర్తి” గారు రాసిన ద్రవిడ భాషలపై పుస్తకాన్నీ ఇచ్చి ఉండటం వల్లనూ నేను అర్జెంటు గా రెండు పుస్తకాలు – ఒకటి Anton Chekov కథలు, ఒకటి Fyodor Dostovesky కథలు – తీసాను. అమ్మకి ఇచ్చాను. అవి చూడగానే అమ్మ – “తెలుగు అనువాదాలు నేను అడిగింది.” అన్నది. అప్పుడు తట్టింది నాకు – అమ్మ చెబుతున్నది నేను అనుకుంటున్న మనిషి గురించి కాదు, ఆవిడ అమ్మ గురించి అని.

అమ్మ చెప్పినది – ప్రముఖ భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ గారి సతీమణి బూదరాజు ఉషారాణి గారి గురించి. ఆవిడతో నాకు పరిచయం అయి ఓ రెండు మూడేళ్ళు అవుతూ ఉంది ఏమో. అనుకోకుండా ఓ రోజు మా అమ్మ తో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మొదటి సారి మాట్లాడాను. ఆవిడ పుస్తకాల పురుగు అని అర్థం కావడానికి నాకు ఎంతో సేపు పట్టలేదు. ఎటొచ్చీ నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే సుమారు డెబ్భై ఏళ్ళ దాకా ఉండొచ్చు ఆమెకి. ఇప్పుడైతే చూపు అంత బాగున్నట్లు కూడా తోచదు. ఎందుకంటే దూరం నుంచి నన్ను చూస్తే ఆవిడ గుర్తుపట్టరు. బాగా దగ్గరికి వచ్చాకే పలకరిస్తారు. ఇప్పుడు కూడా ఆమెలో సాహిత్యం పట్ల తగ్గని ఆసక్తి. ఆవిడతో చర్చించేంత సాహిత్యం నేను చదవలేదు కానీ, ఆవిడ పుస్తకాల గురించి మాట్లాడినప్పుడల్లా చాలా శ్రద్ధగా విన్నాను నేను. సాధారణంగా నేను చూసిన వాళ్ళలో, అదీ ఆడవాళ్ళలో ఇంత పెద్ద వయసు లో కూడా సాహిత్యం మీద ఆసక్తి చూపిన వారు తక్కువే. యుక్తవయసప్పుడు విరివిగా చదివే అలవాటు ఉన్నవారు కూడా కొన్నాళ్ళకి “ఓపిక లేదు, తీరిక లేదు” అనడం విన్నాను నేను. అందుకని, ఈవిడని చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు తెలుగు సాహిత్యం తో పరిచయం అన్నది చాలా తక్కువ కానీ, లేకుంటే ఇప్పటికి ఏదో ఒకలాగ ఏదో ఒక చర్చ మొదలెట్టేదాన్ని 🙂

మొన్న ఆదివారం నాడు, నేను మా బంధువులింటికి వెళ్ళాను. అక్కడ ఒక విషయం తెలిసింది. కంప్యూటర్ విజ్ఞానం పత్రిక వారు “కథాకేళి” అన్న చిన్న పత్రిక ఒకదాన్ని నడుపుతున్నారట. నేను ఆ పుస్తకం లో కథలు చూడలేదు కానీ, ఆ ప్రింటు కి చదవాలనిపించలేదు. కాకుంటే ఎప్పుడో 50లలో మా తాతగారైన V.S.Venkata Narayana గారు “శశి” అన్న తిరుపతి ప్రాంతానికి చెందిన పత్రిక లో రాసిన ఓ వ్యాసం అందులో reproduce చేసారు. అది చదవడం ఓ మంచి అనుభవం. ఈ మధ్యనే నేను అప్పటి original శశి వ్యాసాన్నే జిరాక్స్ కాపీని చదివాను. అయినా కూడా మళ్ళీ చదవడం ఓ మంచి అనుభవం. అదొక్కటే కథాకేళి లో నాకు నచ్చింది. పాత తరం వ్యాసాలు వేయడం. మరోసారి కనిపిస్తే చూస్తా ఈ పత్రికను.

నిన్న ఓ మలయాళ సినిమా తెలుగు అనువాదం చూశా. చివరి గంట మాత్రమే చూశాను. దానితో అర్థమైపోయింది అది “వారసుడు” తెలుగు సినిమా కి మాతృక అని. వారసుడే ముందు వచ్చి ఉండొచ్చ్ కదా అనుకోడానికి లేదు. ఎందుకంటే అది ఓ మలయాళ సినిమా ఆధారంగా తీసారని విన్నాను. అది ఈ సినిమానే కాబోలు. కాకుంటే ఇందులో తండ్రి-కొడుకు ఇద్దరూ మమ్ముట్టీ నే. ద్విపాత్రాభినయం.

ఫెలూదా కథలు చదువుతున్నా. సత్యజిత్ రే రాక్స్. చిన్నపిల్లల కోసం రాసినా కూడా ఎవరినన్న అలరిస్తాయి ఆ కథలు. తెలుగులో ఇలాంటి కథలు ఉంటే చెప్పండి ఎవరన్నా. తెలుగు వారికి ఫెలూదా ని ఎవరన్నా పరిచయం చేస్తే బాగుండు. “ఫతిక్ చంద్” అన్న చిన్న నవలకు తెలుగు అనువాదం ఉందని అయితే తెలుసు (10-12 సంవత్సరాల వయసులో నాకు రే ని పరిచయం చేసిన నవల అది). మిగితావి ఏమన్నా ఉన్నాయో లేదో తెలీదు మరి.

Published in: on June 1, 2007 at 7:11 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/06/01/arbit-things/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. పుస్తక ప్రపంచంతో మీ అనుబంధం, పుస్తక ప్రముఖులతో మీ అనుభవాలు బాగున్నాయి.

  2. బాగుంది సౌమ్యా,:)

    నేను కొంతకాలం బూదరాజుగారి శిష్యుడిని,ఆయన సందర్భవశాత్తూ తన పిల్లలగురించి చెప్పారు గానీ ఉషారాణి గారి గురించి ఇపుడే వినటం.మాష్టారి భార్య అచ్చంఆయనంత కుతూహలం,శ్రద్ధ పుస్తకాలపట్ల చూపటం సహజమేగా!
    ఇక “వారసుడు” సినిమా మీరనేది కృష్ణ,నాగార్జునల దేనా?అది ఫూల్ ఔర్ కాంటే హిందీసినిమాకు రీమేకు కదా?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: