మాటసాయం తరువాత?

మా ఆషాకిరణ్ కు చెందిన ఒకానొక మెడికల్ క్యాంఫ్ లో వాలంటీర్ గా నేను ఉన్నప్పుడు …. ఒకానొక అని ఏముంది కానీ .. ఏ మెడికల్ క్యాంప్ అయినా కూడా …. జరిగిన సంఘటన – ఈ రోజు Britta Das అన్న physiotherapist భూటాన్ లో తన అనుభవాల గురించి రాసిన Buttertea at sun rise పుస్తకం చదువుతుంటే గుర్తు వచ్చింది.

మెడికల్ క్యాంప్ కి వచ్చే వారిలో ఆడవారు ఎక్కువే. ఇలా వచ్చేవారు దాదాపు 90 శాతం కూలి పనికి వెళ్ళేవారే అయి ఉంటారు. తక్కిన వారు ముసలి వారు, చిన్నపిల్లలూ నూ. ఈ ఆడవాళ్ళలో చాలా మంది సమస్యలకు మూలం – సరైన ఆహారం లేకపోవడం లేదా, వారి శక్తి కి మించిన బరువులు ఎత్తడమే. దీనికి పరిష్కారమంటూ బలానికి ఏవో మాత్రలు ఇచ్చినా కూడా వారికి చివరగా “సరిగా తినండి, మరీ శక్తికి మించిన పని చేయకండి” అని చెబుతూ ఉంటారు వాలంటీర్లు, డక్టరూ.

అలా చెప్పడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వినరు. వినరు అనే కంటే పరిస్థితులు వారిని విననివ్వవు అని చెప్పొచ్చు అనుకుంటా. ఇబ్బందిగా నవ్వి వెళ్ళిపోతారు. కానీ, అంతకంటే ఏమీ చెప్పాలో కూడా అర్థం కాదు నాకైతే. ఒక విధమైన నిస్సహాయత ఆవరిస్తుంది అది చూస్తూ ఉంటే. మాట సాయం మినహా చేయగలిగేదేమీ ఉండదు. కానీ, ఏమన్నా చేయలేమా వీరికోసం అన్న ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది.

ఈ రోజు Britta Das అనుభవాలు చదువుతూ ఉంటే ఎందుకో గానీ ఆ నిస్సహాయతే గుర్తు వచ్చింది నాకు.ఎప్పటికన్నా ఈ పరిస్థితి మెరుగుపడాలి అని ఆశావహ దృక్పథం తో ఎదురుచూట్టం కన్నా చేయగలిగేది ఏమన్నా ఉందా?

Published in: on May 26, 2007 at 1:53 pm  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/05/26/matasayam-taruvata/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. తప్పకుండా చెయ్య గలగాలి.
  ఆలోచిద్దాం. సమాధానం దొరక గలగాలి.

 2. ముందుగా ఒక పని చెయ్య వచ్చు

  వాళ్ళు తినడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు?
  వాటితో ఏమి ఏమి తింటున్నారు?
  వారు తమ తమ ఇంటిలో లేదా ఇంటి చుట్టు పక్కల ఏమైనా పెంచగలరా? మొక్కలు లాంటివి!

  ఈ విషయాలు తెలిస్తే ఆ డబ్బులతో తెలివిగా ఎలా తినవచ్చో చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఎప్పుడో టీవీలోనో, రేడియోలోనో విన్నాను, నా బుర్రలోనిది కాదు అని మనవి

 3. […] బాధ్యత Posted May 26, 2007 ఆలోచించాల్సినవి, సమాధానాలు వెతకాల్సి�… […]

 4. It is not that they are not taking proper food for lack of money. I very well remember Suresh Adina’s experience in one of our TMAD meetings. When they went to visit a slum they noticed that the slum kids are buying chip packets (10 rs. a packet). With the 10 rs. they can definitely get a Banana.

  Creating awareness is very very essential. Even most of us who claim to be educated do not know how to cook without losing Nutrients and what to eat. How can those people know.

  The best option is to invite a senior Nutrician to give training to the volunteers and also to these women. We can train these women to share the same things with their companions.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: