ఇదనీ, అదనీ కాదు…

               చాన్నాళ్ళైంది ఇలాంటి టపా ఒకటి రాసి. ఈరోజెందుకో రాయాలనిపిస్తోంది…. రాయడానికి బోలెడు విషయాలుంటే ఇదే ఉత్తమమైన మార్గం కాబోలు…. 😉

అందరికీ సెలవుల్లో తీరిక సమయం ఎక్కువ ఉంటుంది. నాకేమో ఇప్పుడే దేనికీ చాలడం లేదు 24 గంటలు. ఇట్టే అయిపోతోంది సమయం. నాకేమో రోజంతా బిజీ గా ఉన్నట్లే అనిపిస్తూ ఉంటుంది.  ఇప్పుడు ఇందాకే – “Delhi is not far” అన్న రస్కిన్ బాండ్ పుస్తకం చదివా లైబ్రరీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ. పుస్తకం బానే ఉంది. రస్కిన్ బాండ్  రచనలు నేనంతగా చదవలేదు కానీ…నాకు అందులో బాగా నచ్చేది వాటిలోని సహజత్వం, simplicity. ఏదో అలా పెద్దగా కష్టపడకుండా చదువుతూ వెళ్ళిపోవచ్చు. సంక్లిష్టమైన వ్యాఖ్యానాలూ, గొప్ప గొప్ప వేదాంతాలూ…ఇవేవీ ఉండవు. సామాన్యుల కథలే ఆయన నవలలు. ఇది కాక సత్యజిత్ రే సృష్టించిన ఫెలుదా నవల్లు మూడు చదివా గత వారం రోజుల్లో. ఎప్పటిలాగే ఆసక్తి కరంగా ఉన్నాయి. రే స్టైలే వేరు. దర్శకుడిగా ఆయన ఎంతటి వాడో వినడమే కానీ..చూడలేదు. కానీ, రచయిత గా రే అద్భుతంగా రాస్తాడు. పాఠకుల్ని కట్టిపడేయడం ఎలాగో ఆయనకి బాగా తెలుసు.

నేనేమో క్లాసుల్లేవు కదా … ఇప్పుడైనా ల్యాబ్ లో పూర్తి సమయం పని చేయాలి అనుకుంటాను …  కానీ మనసంతా లైబ్రరీ వైపే ఉంటుంది. రెండ్రోజులకోసారి సినిమా చూడాలనిపిస్తుంది. కానీ, నాకు సహనం తక్కువ కనుకా, ఈ ల్యాప్టాప్ కి వినికిడి దోషం కనుకా … 3,4 రోజులకోసారి సినిమా చూస్తున్నా ఈ మధ్య. అలా ఈమధ్య చూసిన సినిమాల్లో  నాకు అస్సలు నచ్చనిది బేబెల్. 4 కథలని కలుపుదాం అనుకుంటే అంతకంటే మంచి మార్గాలే ఉన్నాయి. కలపడానికి దానికంటే మంచి కథలే ఉన్నాయి. అకిరా కురాసవా సినిమా కగేముషా సగం చూసాను. బానే ఉంది. దోర్ చూసాను. మంచి సినిమా. ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆయేషా టకియా ని ఆ పాత్రలో ఊహించుకోవడం వింతగా అనిపించినా కూడా సినిమా లో చూస్తున్నప్పుడు మాత్రం బాగా చేసినట్లు అనిపించింది. శ్రేయస్ తల్పడే నవ్వించడానికి చాలానే శ్రమించాడు. ఆ శ్రమ వృధా పోలేదు…. కానీ, నాకెందుకో వీళ్ళందరికంటే గుల్ పనాగ్ చాలా నచ్చింది….. నిన్న ఇంట్లో Prestige సినిమా చూసాను. ఆసక్తికరమైన సినిమా. మీరు ఎవరైనా చూడకపోతే తప్పక చూడండి.  నేడే చూడండి. టెస్లా, ఏడిసన్లు కూడా ఈ సినిమా కథలో పాత్రలు అవడం నాకు కాస్త ఆస్ఛర్యమనిపించింది.

“మధురమే సుధాగానం … ” – బృందావనం సినిమా లోని ఈ పాట నన్ను విపరీతంగా ఆకర్షించింది శుక్రవారం సాయంత్రం. ఎందుకు గుర్తు వచ్చిందో తెలీదు కానీ, వారాంతమంతా నేను దీన్ని హం చేసుకుంటూనే ఉన్నాను.  ఈ సినిమా లో పాటలు ఏమన్నా బాగుంటాయి. మరో రోజు తీరిగ్గా రాస్తా దీని గురించి.

ఈ మధ్య కాలం లో రిసెర్చి అంటే ఏమిటి? దెవెలప్మెంట్ అంటే ఏమిటి? అసలు ఏ టెక్నాలజీకైనా ఆంతిమ ఆశయం ఏమిటి? ఇదంతా పురోగమనమా? తిరోగమనమా? అన్న ప్రశ్నలు ఎక్కువైపోయాయి నాకు 🙂 క్లాసుల్లేకపోవడం వల్ల ఏమో! 🙂 . ఇంతకీ మా కనుగొను.కాం లో ఇప్పుడు టైపింగ్ మునుపటి కంటే కాస్త సులభం. అంటే .. కనీసం నావరకన్నా సులభంగా అనిపించింది. ఇన్నాళ్ళతో పోలిస్తే ఈరోజు.  ఫలితాల విషయం లో నాకింకా అసంతృప్తి ఉంది అనుకోండి .. చాలా విషయాలు అయిపోయాయి ఈ టపా లో. ఏం చేస్తాం. రాబోయే 15 రోజుల దాకా ఇదే చివరి టపా కావొచ్చు నా బ్లాగు కి బహుశా. నేను ఊరువెళుతున్నా మరి.  హైదరాబాదొచ్చాక ఈ ఏడేళ్ళలో ఎప్పుడూ వారం పదిరోజులకు మించి ఊరు వదల్లేదు. ఓ పక్క 15 రోజులు మా హైదరాబాద్ కి దూరంగా వెళ్ళడం దిగులుగా ఉన్నా, ఓ పక్క ఈ 15 రోజుల గురించి exciting గా కూడా ఉంది….

Advertisements
Published in: on April 30, 2007 at 4:51 pm  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/04/30/medley/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. “టెస్లా, ఏడిసన్లు కూడా ఈ సినిమా కథలో పాత్రలు అవడం నాకు కాస్త ఆస్ఛర్యమనిపించింది” !!

  Christopher Nolan ఏ రోజైతే ఈ సినిమా లో టెస్లా గారి పాత్ర గురించి ప్రకటించాడో అప్పటి నుంచీ ఇది రిలీజ్ అయ్యే వరకూ కళ్ళు కాయలు కాసే దాకా ఎదురు చూసి , మొదటి రోజు టెస్లా గురూ గారిని స్క్రీన్ మీద చూసి త్రుప్తి పడ్డా !!

  అసలు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరడానికి కొంత వరకూ టెస్లా గారే … గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవర్ బార్న్ !!

 2. “టెస్లా, ఏడిసన్లు కూడా ఈ సినిమా కథలో పాత్రలు అవడం నాకు కాస్త ఆస్ఛర్యమనిపించింది” !!

  Christopher Nolan ఏ రోజైతే ఈ సినిమా లో టెస్లా గారి పాత్ర గురించి ప్రకటించాడో అప్పటి నుంచీ ఇది రిలీజ్ అయ్యే వరకూ కళ్ళు కాయలు కాసే దాకా ఎదురు చూసి , మొదటి రోజు టెస్లా గురూ గారిని స్క్రీన్ మీద చూసి త్రుప్తి పడ్డా !!

  అసలు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరడానికి కొంత వరకూ టెస్లా గారే … గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవర్ బార్న్ !!

  http://sambhavami.blogspot.com

 3. ఈ రోజు మీటపా చూస్తుంటే డైరీ చదువుతున్నట్టు వుంది.
  దోర్ సినిమా మధ్యలో కొద్దిగా బోర్ అనిపించినా చివరి దాకా చూడగలిగాను.నాకు నచ్చింది.
  ఊరిలో బాగా ఎంజోయ్ చెయ్యండి మరి

 4. 3 పుస్తకాలు, 6 సినిమాలుగా సాగిపోతుంది మీ జీవితం. PhD నా??

  దోర్ కాదు డోర్. అది ఒ అద్భుతమైన మళయాళి సినిమా రీమేక్.
  సినిమా పేరు “పెరుమఱక్కాలం” అంటే “పెనువర్షాకాలం” . తప్పక చూడండి.
  కేరళలో వర్షం back drop గా తీసారు. ఐనా మళయాళి అందమే వేరు.
  మీరా జాస్మిన్ నటన కూడా చాలా బాగుంటుంది.

  “ఇదంతా పురోగమనమా? తిరోగమనమా?” మీ శ్రేయస్సుకోరి చెబుతున్నా, ఇటు వైపు రావద్దు. నాకు పని లేక ఈమధ్య అలాంటి విషయాలు అలోచించిచించి, టెక్నాలజి మీద స్వల్ప విరక్తి పుట్టి, ఉద్యోగం మీద ఆశక్తి పోయింది. అలాంటి ఆలోచనలను కవులకు, తత్వవేత్తలకు వదిలేద్దాం.

  happy holidays. ఇంటి కాడ అందరిని అడిగినట్టు చెప్పండి. just kidding 🙂

 5. “ఇదంతా పురోగమనమా? తిరోగమనమా?” మీ శ్రేయస్సుకోరి చెబుతున్నా, ఇటు వైపు రావద్దు. నాకు పని లేక ఈమధ్య అలాంటి విషయాలు అలోచించిచించి, టెక్నాలజి మీద స్వల్ప విరక్తి పుట్టి, ఉద్యోగం మీద ఆశక్తి పోయింది. అలాంటి ఆలోచనలను కవులకు, తత్వవేత్తలకు వదిలేద్దాం.

  Well said rakesh…If you want to be a philosopher, think about these issues. But the path of self enquiry is anything but smooth If you are very self conscious of what you are doing and thinking, you will be bewildered and become self doubtful and nihilistic.
  So better leave these things to poets and philosophers as rakesh says and romance the technology just the way you are doing. But the forbidden fruit is always tempting, is n’t it?
  thinking about it, any self reflecting, sensitive and expressive person is something of a poet and phuilosopher…
  Enjoy your holidays! Make the best use of your time!

 6. Meeru title telugu lo pettaru.. any special reason???

  Happy holidays.:)

 7. hi sowmya gaaru…

  baagundani.. meeru pettina title loonee enthoo nigoodartham undandi baabu… baagaa saripoyyindi mee blog mail ki..

  annatu aduguthunnanani eemanukookandi .. meeru Phd chesthunnaaraa..

  meeru B’lor loonee unattunaaru.. Blor kisuswagatham..
  baagaa e’joy cheesi vellandi.. have a nice trip


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: