Drukkonaalu – Naveen

ఒక తెలుగు పుస్తకం గురించి బ్లాగి 3 నెల్లు దాటింది. ఇప్పుడీ టపా రాసే ముందు చూస్తూ ఉంటే తెలిసింది. పరీక్షల సీసన్ లో పక్క దారి పట్టాలని అనిపించినంతగా ఇంకెప్పుడూ అనిపించదు అనుకుంటా 🙂 ఫలితమే ఈ నవల నిన్న చదవడమూ, ఈ రోజు దీన్ని గురించి ఇక్కడ రాయడమూ. “దృక్కోణాలు” – నవీన్ రాసిన నవల. పేరు చెబుతూనే ఉంది – దేని గురించో. ఒకానొక సంఘటన ను ఎనిమిది మంది వేర్వేరు వ్యక్తుల దృక్కోణాల నుంచి చెప్పడమే దీని లోని కథ అంతా. అందుకనే నాకైతే నవల చదువుతున్నట్లు కూడా అనిపించలేదు. ఏదో రిపోర్టు చదువుతున్నట్లు అనిపించింది. ఇదో తరహా శైలి ఏమో రచనలో. ఇంతకీ ఇది 50 లలో వచ్చిన Rashomon సినిమా తరహా కథనం. తనకు తెలిసిన ఓ సంఘటనపై నలుగురూ నాలుగు రకాల విశ్లేషణలు చేయడం తో ఈ రాషోమన్ సినిమా లా నవల రాసే ఆలోచన వచ్చింది అని నవీన్ ముందు మాట లో చెప్పుకున్నారు.

కథ పరంగా అంటే, ఒకానొక డాక్టర్ తన పేషంటు పై అత్యాచారానికి పాల్పడ్డాడు అన్నది కేసు. దాని పై ఆ కేసు కి సంబంధించి కాస్త విషయాలు తెలిసిన వారిగా భావించే ఎనిమిది మంది ఇచ్చిన స్టేట్మెంట్లు మనకు చూపారు. అంతకు మించి ఒక ముక్క ఎక్కువ లేదు. తక్కువ లేదు. ఇది బహుశా నవీన్ శైలి ఏమో. తటస్థంగా as-a-matter-of-fact అన్నట్లు విషయం చెప్పేసి పుస్తకం మూయించేయడం. ఆలోచించడం మనవంతు అనుకుంటా. ఈ నవల్లో చెప్పుకోదగ్గ్ విశేషాలు అంటే – పాత్రోచితంగా మారిన భాష. మరోటి – ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలు కలిపేసి, తమ ప్రయోజనాలు చూసుకుని ఎన్ని రకాలుగా చెప్పగలరు అన్నది – చాలా బాగా చూపారు. చిన్నప్పుడు దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షల్లో “చరిత్ర చిత్రణ” అంటూ ఓ ప్రశ్న కచ్చితంగా ఉండేది. అంటే – ఫలానా నవల్లో ఫలానా పాత్ర తీరు ఏలా ఉంటుంది అన్నది మనం విశ్లేషించి రాయాలి అన్నమాట. ఈ నవలకి అయితే ఆ సమస్యే ఉండదు. ఉన్న 8 పాత్రలూ తమ చరిత్ర చిత్రణ తామే చేసుకుంటున్నాయి 🙂

ఒక్క ముక్క లో చెప్పాలంటే – చదవొచ్చు. ఒకే విషయాన్ని ఎనిమిది మంది ఎలా చెబుతారో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటే చదవండి. మళ్ళీ పదజాలం పరమ డీసెంట్ గానే ఉండాలి అనుకుంటే మాత్రం చదవకండి. ఎందుకంటే ఆ ఎనిమిది పాత్రల బ్యాక్ గ్రౌండు, మనస్తత్వం వీటిని బట్టి అవి వాడే భాష మారుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అదోలా అనిపించినా అనిపించవచ్చు. అవి అలాగే చదివి భరించగలము అంటే – ప్రొసీడ్!

ఈ నవల తో పాటే ఇందులో “సుజిత” అన్న పెద్ద కథ జత చేసారు. ఇందులో అయితే కథ కంటే అస్తమానం అనవసరమైన డైలాగులే ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. మొదట మా అమ్మ కి తీసుకెళ్ళి ఇద్దాం అనుకున్నా ఏదో ఓ తెలుగు పుస్తకం కదా అని. ఈ కథ చూశాక డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. చెప్పదలుచుకున్న విషయం బానే ఉంది కానీ – చదవడానికి ఇబ్బందిగా అనిపించింది. పోయి పోయి ఇలాంటి ఓ పుస్తకం పట్టుకెళ్ళి మా అమ్మ కి ఇచ్చే సాహసం నేను చేయలేను. 🙂

Advertisements
Published in: on April 11, 2007 at 4:34 am  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/04/11/drukkonaalu-naveen/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. “తటస్థంగా as-a-matter-of-fact అన్నట్లు విషయం చెప్పేసి… ”
    ఎందు కంటే ఎనిమిది మంది అభిప్రాయాలు అప్పటికే ఉన్నాయి, ఈయన కాస్తా అతటస్థంగా వ్రాస్తే తొమ్మిది అవుతాయని 🙂

    మీ స్పూర్తితో నేను కూడా తెలుగులోనే ఎక్కువ బ్లాగాలని నిర్ణయించి, ఒక టపా కూడా వేసాను.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: