Madhuri Dixit

నిన్న పీసీ లో “పుకార్” అన్న హిందీ సినిమా కి చెందిన “కే సరా సరా” పాట వీడియో చూస్తూ ఉన్నా. ఈ పాట చూడ్డం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రభుదేవా, మాధురీ దీక్షిత్ ఇందులో అద్భుతంగా డాన్స్ చేస్తారు. సరే, ఎప్పటి లాగే ఈరోజు కూడా ఈ పాట చూస్తూ వీరిద్దరినీ మరో సారి తలుచుకున్నా. అప్పుడు తట్టింది Madhuri Dixit ఎంత మంచి ప్రతిభ కల నటో కదా అన్న విషయం. Madhuri Days గురించి నాకంత పరిచయం లేదు కానీ, ఆమెకి నా స్కూలు రోజుల్లో ఉన్న fan-following అయితే బాగా గుర్తు ఉంది. అయినా, మాధురీ గురించి తలుచుకుంటూ ఉంటే ఈ టపా రాయాలనిపించింది …..

Madhuri Dixit చాలా మంచి నర్తకి. Kathak లో శిక్షణ పొందింది అనుకుంటా. ఈమె Dance movements లో ఉన్నంత flexibility ఇటీవలి కాలం లో ఎవరికీ లేదు అనుకుంటా. అభినయం పరంగా చూసినా ఆమె మంచి నటి. నాట్యం తెలిసిన వాళ్ళకి నటన తేలిగ్గా అబ్బుతుంది అనుకుంటా. దేవదాస్ సినిమా లో చంద్రముఖి గా చేసిన Dance sequences కూడా చాలా బాగుంటాయి. “ఎక్ దో తీన్”, “చోళీ కే పీచే…” వంటి పాటల ద్వారా ఆమె చాలా మంది అభిమానుల్నే సంపాదించుకుంది. ఈ పాటలు ఎప్పటివో 15 ఏళ్ళ క్రితానివైనా కూడా ఇప్పటికి ఇవి టీవీ లో చూస్తే అప్పటిలా ఎంజాయ్ చేసే వారు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. Madhuri Dixit డాన్స్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. నటన పరంగా అంతగా గమనించలేదు నేను. కానీ, గమనించినంత వరకు she is a good actress too. 6 Film Fare అవార్డులను అందుకుంది కాబట్టి పబ్లిక్ మంచి నటి అని అంగీకరించినట్లే 🙂 100 డేస్ సినిమా చూడాలని ఎన్నాళ్ళు అనుకున్నానో! అనుకుని అనుకుని మర్చిపోయా కూడా! 😉

madhuri-dixit.jpg

నాకు బాగా నచ్చిన Madhuri చిత్రం “సాజన్”. అందానికి అందం, నటనకి నటన, నృత్యానికి నృత్యం … ఎందులో తక్కువ Madhuri? Hum aap ke hain koun అంత పాపులర్ సినిమా ని ఏమో నేను అసలు ఇప్పటి దాక చూడనే లేదు. కానీ, Madhuri అంటే చాలామందికి టక్కున గుర్తు వచ్చే విషయాలలో అది ఒకటి. అన్నట్లు – “గజ గామిని” అని M.F.Hussain మాధురి ని పెట్టి ఓ సినిమా నే తీసాడు కదా! “Gaja Gamini was intended as a tribute to Dixit’s talent and beauty” – అని వికీ ఉవాచ. “మై మాధురీ దీక్షిత్ బన్ నా చాహతీ హూ” అని ఒక సినిమా నే వచ్చింది అంత్రా మాలి హీరోయిన్ గా. ఇంతకంటే ఆమె popularity కి నిదర్శనం ఏం కావాలి? మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చిన ఓ వ్యాసం లో – “Best bollywood actresses ever” శీర్షికలో ఉన్న మొదటి పేరు – మాధురీ దీక్షిత్! మాధురి కి అభిమానులు దేశ విదేశాల్లోనూ ఉన్నారు.

ఎవరో అభిమాని రాసినట్లు – ఆమె వైన్ లాంటిది. వయసు పెరిగే కొద్దీ ప్రభ పెరుగుతుందే కాని తగ్గదు 🙂 మా స్కూల్ లో ఒక సార్ ఉండేవారు. ఆయనకి Madhuri Dixit అంటే చాలా ఇష్టం. అప్పట్లో మాకు పెద్ద కామెడీ గా ఉండేది ఆ విషయం. చిన్నా పెద్దా తేడా లేకుంటా ఎందరి మనసులనో దోచిన మాధురి వంటి మాధురి మరొకరు లేరేమో మన భారతీయ చిత్ర పరిశ్రమ లో. ఇటీవలే మాధురి మళ్ళీ నటించబోతోందని తెలిసింది. ఆజా నచ్లే అన్న హిందీ చిత్రం లో నట. Welcome back Madhuri!

Advertisements
Published in: on April 10, 2007 at 7:13 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/04/10/madhuri-dixit/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. Funny you should mention que sera sera song to talk about Madhuri’s talent. No doubt she is an accomplished dancer, but in that particular song Boney Kapoor apparantly decided to trash an earlier shot version because Prabhu Deva was head and shoulders above overshadowed Madhuri. So in the next approved cut they had to dumb him down at bit.

  2. మాధురి, చిరంజీవి, మైఖేల్ జాక్స్ న్ లు బీట్ తో పుట్టారు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: