If music is a religion, S.Janaki is a goddess

ఇంకో నాలుగైదు రోజుల దాకా బ్లాగుల జోలికి పోకూడదు అనుకున్నా, పరీక్షల టైం అని. కానీ, ఈరోజు పేపర్ చూసాక ఇంక బ్లాగు రాయకుండా ఉండలేకపోతున్నా. జానకి గారి గొంతు play back లో మొదటిసారి వినిపించి ఈరోజుతో 50 ఏళ్ళంట. నాకు ఆమె పాట విననిదే రోజు గడవదు. ఓ అభిమాని వైపు నుంచి ఈ వ్యాసం …. జానకి గారి గళం కాలాతీతంగా నిలిచిపోవాలని, ఆవిడ పాటలు తరాలు మారినా వినిపిస్తూనే ఉండాలని కోరుకుంటూ….

ఇంతకీ ప్రత్యేకంగా జానకి గారికే సొంతమైన ఒకానొక కళ – పాత్రకి తగినట్లు గొంతుక మార్చడం. ఇదిగో – ఇదే నన్ను జానకి గారికి వీరాభిమానిని చేసింది. చిన్నప్పుడు మా ఇంట్లో – “గోపాల కృష్ణుడు” అని ఒక ప్రైవేట్ పాటల ఆల్బం కేసెట్ ఉండేది జానకి గారిది. అందులో మొదటి పాట – “మల్లె పూల హారమెయ్యవే, ఒయమ్మా నన్ను…..” – అంటూ కృష్ణుడు, యషోద ల మధ్య సంభాషణ లా సాగుతుంది. అందులోని రెండు గొంతుకలు జానకి గారివే! ఓ సారి చిన్ని కృష్ణుడిలా, మరో క్షణం లో యషోద లా ఆమె పాడిన తీరు ఆ పాట మొదట విని ఓ 10 ఏళ్ళ పైనే అయినా కూడా ఇప్పటికి ఆ పాట తలుచుకుంటే అదేదో వర్ణించలేని అనుభూతికి లోను చేస్తోంది. జానకి గారికి కృష్ణుడి మీద ఎంత అభిమానమో తెలుసుకోవడానికి ఇదొక్క పాట వింటే చాలు. పాటలో యశోద గా పాడుతున్నప్పుడు ఆమె ఎంతో తన్మయత్వం తో పాడింది అనిపిస్తుంది నాకు. దీని తరువాత ఎన్నో కృష్ణుని పాటలు ఆవిడ పాడగా విన్నాను. వీళ్ళ అబ్బాయి పేరు కూడా మురళీ కృష్ణ అట. 🙂 janaki.jpg

“సప్తపది” సినిమా లో – గోవుల్లు తెల్లన పాట లో కూడా చిన్న పిల్ల గొంతు వినిపిస్తుంది మళ్ళీ. అద్భుతం అనిపిస్తుంది జానకి గారిని తలుచుకుంటే. స్వాతి ముత్యం సినిమా లో – “చిన్నారి పొన్నారి కిట్టయ్య..” పాట లో జానకి గారి గొంతు చివరిలో పిల్లాడి గొంతులా వినిపిస్తుంది మళ్ళీ. ఈ పాట లో ఆ పిల్లాడికి గొంతుక SPB ది అనుకుంటా. కానీ, పాట ముగిసే సమయానికి ఆ పిల్లాడు అనే చివరి మాట మాత్రం జానకి గారి గొంతు. ఏదో గుర్తు రావడం లేదు. ఆ మధ్య ఒక నెట్ స్నేహితునితో ఈ విషయం లో చర్చ జరిగింది… అందుకని ఈ విషయం బాగా గుర్తు ఉండిపోయింది.

ఒకటా రెండా – ఎన్నని చెప్పాలి జానకి గారి మాయలోకి నన్ను లాగేసిన పాటల గురించి? “ఆకాశం ఏనాటిదో” – నిరీక్షణ సినిమా లో ఈ పాట నాకు నచ్చి దక్షినాది భాషలే తెలియని నా నేస్తానికి వినిపిస్తే భాషే రాని ఆమె నాకీ సినిమా పాటలన్నీ కావాలి అని అడగడం గురించి చెప్పనా? నాకు తెలియని మలయాళం పాటలు కూడా కేవలం అవి జానకి గారి పాటలు అన్న కారణం తో పదే పదే విన్న విషయం చెప్పనా? “నగువా, నయనా….” అంటూ “పల్లవి అనుపల్లవి” కన్నడ సినిమా లో పాడిన పాట విని ఇప్పుడీ పాట కి అర్థం ఏమిటి ?? ఎవర్నడగాలి? అని ప్రశ్నించుకున్న రోజు గురించి చెప్పనా? జానకి పాడిన ఒకానొక Tyaagaraja Kritis కేసెట్ విని తరువాత కొన్నాళ్ళు ఇంట్లో ఉన్న పాత కేసెట్ డబ్బాల్లో క్లాసికల్ పాటల కోసం పిచ్చిగా search చేసిన విషయం చెప్పనా? శాస్త్రీయ సంగీతం ఇంత బాగుంటుందా అని నేను మొదటి సారి అనుకున్నది జానకి గారి – “దయ రాదా దాశరథీ..” (పదాలు ఇవే అనుకుంటున్నా) పాట విన్నాకే. “సఖి” తెలుగు సినిమా లో “సెప్టెంబర్ మాసం” పాటను జానకి గారే పాడారని తెలిసిన రోజు “ఈ గొంతుకకి ఎప్పుడూ యవ్వనమా ఏం?” అని ఆశ్చర్యపడిన వైనం చెప్పనా? ఆకలి రాజ్యం సినిమా లో – “కన్నె పిల్లవని…” పాటలు ఇటీవలి 2,3 ఏళ్ళ కాలం లో ఏదో సభ లో SPB తో కలిసి అదే ఊపు లో, అదే జోరు లో పాడి మరో సారి నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన వైనం చెప్పనా? “సెంథూర పూవే…” అంటూ తమిళంలో, “సిరిమల్లె పూవా” అంటూ తెలుగులో ఎన్ని సార్లు “పదహారేళ్ళ వయసు” లోని ఈ పాట విన్నానో లెక్కలేదు..ఇప్పటికి ఆ పాట వినగానే నేనూ – “16 ఏళ్ళ వయసు” అమ్మాయిలా feel అయ్యేంత లా trance లోకి తీసుకువెళ్ళే magic ఉంది ఆమె గొంతు లో అని చెప్పనా? “సితార” లో వెన్నెల్లో గోదారి అందం … పాట మరోటి. హీరోయిన్ మనస్థితి తెలుసుకోవాలంటే ఈ పాట లోనే అంటా ప్రతిధ్వనించేసారు జానకి గారు. ఇక వీడియో చూడకుండా విన్నా కూడా సన్నివేశం ఊహించొచ్చు. 🙂 దీనికి national award కూడా వచ్చింది. “తేవర్ మగన్” తమిళ సినిమా లో పాడిన – “inji idippazagha..” పాట కి మరో జాతీయ అవార్డు. ఇదే “క్షత్రియ పుత్రుడు” సినిమా. తెలుగు లో ఈ పాట – “సన్నజాజి పడక…” అనుకుంటూ వస్తుంది అనుకుంటా. ఈ సినిమా ని చెన్నై లో బాగా చిన్నప్పుడు అదేదో థియేటర్ లో తమిళం లోనే చూసినట్లు గుర్తు. అందులో వచ్చిన ఒకేఒక తెలుగు డైలాగు కి – “అయ్, తెలుగు తెలుగు” అని ముర్సిపోవడం కూడా గుర్తు.

ఏదో ఒకటో రెండో పాటలు నచ్చితే చెప్పుకోవచ్చు కానీ … 50 ఏళ్ళ పాటల జీవితం లో జానకి పాటల గురించి ఎంతని చెప్పను నేను? ఏ రసం పలికినా అది జానకి గొంతులో నుంచి వస్తే అది శ్రవణానందమే. Romantic పాటల్ని కూడా జానకి గారైతే ఒక ease తో పాడతారు. ఆమె గొంతులోని మాయే నన్ను తెలీని భాషల పాటలను కూడా download చేసుకుని మరీ వినేలా చేస్తోంది. జానకి గారు classical songs అధ్బుతంగా పాడతారు. అన్నట్లు – ఓ ఒక statistic. She has sung about 20,000 songs in her career, in almost all languages in South India as well as in Hindi, Sinhalese, Bengali, Oriya, English, Sanskrit, Konkani, Tulu, Saurashtra, Baduga, Japanese and German! German, Japanese, Baduga… భాషల్లో పాడటం కూడానా!!. ఎంతని రాయను? రాస్తే ఈ ఒక్క టపా లో ఆమె గొప్పతనాన్ని చెప్పేయగలన్న అతి విశ్వాసం నాకు లేదు. ఈ కాసిని పదాల్లో మొత్తం చెప్పేసెయ్యాలన్న అత్యాశా లేదు.

సంగీతం సాగరమైతే జానకి ఎప్పటికి ఎగుస్తూనే ఉండే అల. పాట ఒక మతం అయితే జానకి అందులో ఒక దేవత. కాదనగలరా ఎవరన్నా? నేను polytheist ని. దేవతలు, దేవుళ్ళు చాలానే ఉన్నారు నా ప్రపంచం లో 🙂 జానకి గారు జిందాబాద్!!

Advertisements
Published in: on April 4, 2007 at 4:05 am  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/04/04/if-music-is-a-religion-sjanaki-is-a-goddess/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. మీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది. సంగీతమతంలో అధిదేవత “రసం”. జానకిని కావాలంటే high Priestess అనుకోండి 🙂
  మీరు విన్న త్యాగరాజ కీర్తన “దయరానీ దయరానీ”.
  అదే కేసెట్లో ఈమె పాడిన “తలచినంతనే నా తనువేమో” కూడా చాలా బావుంటుంది.
  పదహారేళ్ళ వయసులో తెలుగు పాట “సిరిమల్లె పూవా” (సిందూరప్పూవే తమిళాంలో).
  పి.బి.శ్రీనివాస్ గారితో కలిసి పాడిన మల్లిఖార్జున సుప్రభాతం కూడా బాగుంటుంది.
  అఫ్కోర్సు, నా దృష్టిలో ఆవిడ కెరీర్ హైలైట్ “నీ లీల పాడెద దేవా!”

 2. నాకు జానకి గారంటే తెలిసింది “గోవుల్లు తెల్లన” అన్న పాట దగ్గరినుండి.సప్త పదిలో పాట రేడియో లో వింటున్నప్పుడు అమ్మ చెప్పారు చిన్నపిల్లాడి లా పాడింది కూడా ఆమే అని.అప్పటి వరకూ నేను నటులే పాడుతారనుకునేదానిని.ఆ తరువాత ఘంటశాల గారు వెంకటేస్వర మహత్యం సినిమాలో ఒక పాటలో నటించారని చెప్పారు ఆ పాట వింటుంటే.అలా నాకు తెలిసిన మొదటి గాయని జానకి గారు. తరువాత ఘంటశాల వారు.

 3. సౌమ్య గారూ, మీ పోస్టులు చాల బాగుంటున్నాయి… కాలేజీ లో ఒక సారి తెలుగు బ్లాగు ఎలా రాయాలి అని అడిగాను గుర్తుందా? నా తెలుగు బ్లాగింగ్ కి మీరే స్ఫూర్తి.. 🙂

 4. 17 బాషలు, 16000 పాటలు – ఎన్నో, ఎన్నెన్నో హిట్ పాటలు – నీ లీల పాడెద దేవా – మేఘమా దేహమా!

 5. I would not dare go into the telugu entries. I’d take for ever to finish even one.

  Just came by to say hi, and thanks 🙂

 6. నేను జానకిగారి పాటలు ఎప్పుడూ విటూనేవుంటాగాని, ఆమె పాడారని తెలియదు.
  తెలుగు పాటలు ఎంత బాగుంటాయంటే, ఆ ఘనతను ఎప్పుడు భాషకు, పాట వ్రాసిన వారికే జతచేరుస్తూంటాను.
  మీరు వ్రాసింది చదివాక పాడిన వారికి కూడా కృతజ్ఞుడనైవుంటా..

 7. చాలా బాగుంది. నిజమో కాదో గానీ నా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పినట్టు గుర్తు, “జానకి” గారు పాడుతున్నప్పుడు ఏపాటైనా సరే మొఖం లో భావాలు కనిపించకుండా పాడతారని, అలా పాడే వాళ్ళు చిత్ర పరిశ్రమ లో ఇంక ఎవరూ లేరని. మొన్న Maa-TV లో జానకి గారి సన్మానం live చూపించారు, అందులో జానకి గారు పాడిన పాటలు విన్నారా? fantastic, simply fantastic. నేను program మొదట లో miss అయ్యాను.

 8. My “Paadaabhi Vandanam” to Smt. Janaki garu…!
  Really she is an angel/melodious queen… in her own singing style.

  Mostly I prefer to listen her songs solo or duets with another great melodious singer with sri. Sri.SPB garu. particularly teen age songs apart from others songs are like a flow of honey…!

  Long live Smt. Janaki garu & Sri. SPB garu.

  Regards.

  R. Udayakumar.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: