The wonder called Mathematics

“Mathematics rox” అని ఈ మధ్య కాలం లో అనిపించినంతగా ఎప్పుడూ అనిపించలేదు నాకు. దానికి మొదటి కారణం Artificial Neural Networks అయితే, రెండో కారణం – ఏ రిసర్చి పేపరు చూసినా దానికి గర్వకారణం లా కనిపించే Mathematical equations. ఇలా దాన్ని తలుచుకుని తలుచుకుని, అబ్బుర పడి, పడి – ఇక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా.

అసలు గణితం లేని ఏ engineering విభాగాన్నైనా ఊహించగలమా? అక్కడిదాకా ఎందుకు – “గణితం” అంటూ చెప్పుకోకపోయినా అది ఉపయోగించని రోజు ఉందా మన జీవితాల్లో? గణితం శాస్త్రవేత్తకైనా, ఇంజినీరుకన్నా, సామాన్యుడికైనా అవసరమే. ఎటొచ్చీ దాక్టర్ల సంగతే నాకు తెలీడం లేదు. ఎంత వరకు mathematics ఉపయోగాన్ని వాళ్ళు గుర్తిస్తారు అన్నది. అంటే వాళ్ళ instruments తయారీ కి Mathematics అవసరం కాని, వాళ్ళు direct గా ఉపయోగించరు అనుకుంటా. గణితం అన్నది ఒకటి లేకపోతే మనము ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు ఉండేవి కావేమో. అసలు నేనీ బ్లాగు రాయడానికి దిక్కేదీ అప్పుడు? 🙂 ఒక్క సారి ఊహించుకోవడానికి ప్రయత్నించాను గణిత రహిత జీవితాన్ని. ప్చ్. లాభం లేదు! ఇది వరలో ఇంత ఖచ్చితంగా చెప్పలేకపోయేదాన్ని Mathematics rox అని. నేనసలు అదొక ప్రత్యేకమైన branch గా చూశా కానీ దాని కొమ్మలు అన్ని చోట్లా విస్తరించాయి అన్న విషయం అర్థం చేసుకోలేకపోయాను.

ఈ మధ్య నా నోటు పుస్తకాల నిండా – “O mathematics!”, “Mathemagic or Mathematics?”, “Math!!!”, “Think Math!” వంటి అక్షరాలే కనబడుతున్నాయి నాకు. అంటే క్లాసు లో తోచక నేనే రాస్తున్నా అనుకోండి. ఈ గణిత శాస్త్రవేత్తలు ఒక్కోళ్ళకి దండేసి దండం పెట్టాలనిపిస్తోంది. అసలు దేవుళ్ళేమో కాని, మన జీవితాలకు వీళ్ళే అసలు దేవుళ్ళేమో అనిపిస్తున్నారు ఈ క్షణం లో!! Probability, Linear Algebra, Statistics, Numerical Methods, Calculus, Trigonometry… ఎన్నని చెప్పాలి – ఒకటా? రెండా? ఎన్ని శాఖలు. ఎన్ని diverse ఉపయోగాలు. ఎటొచ్చీ నాకు అర్థం కానిది ఒకటే – చిన్నప్పటి నుండి చదువుకున్న ప్రతి Mathematic concept నూ ఎక్కడో అక్కడ ఉపయోగిస్తున్నాను -Technical గా కొన్ని, జీవితం లో కొన్ని,కాని – Mathematics is God అని తెలుసుకోవడానికి ఇన్నాళ్ళు పట్టిందేమిటా అని. 🙂

PS: At Random … I posted whatver I am feeling right now, as I look at those notebooks …. where, the letters – “Mathematics” appear in bold and boxed…almost in everyclass, with even the dates marked!

Published in: on March 30, 2007 at 5:46 pm  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/30/the-wonder-called-mathematics/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. ఐన్‌స్టీన్ అసలు కేవలం గణిత శాస్త్ర్రవేత్త మాత్రమే. అయినా భౌతిక శాస్త్రంలో అద్భుతాలు కనిపెట్టాడు. అవన్నీ కేవలం పెన్నూ పేపరుతో మాత్రమే…అదీ గణితమంటే…

  మన పూర్వీకులు కనిపెట్టిన ఖగోళ విషయాలన్నీ గణితం వల్లనే..ఒక్క లాబు లేదు. టెలిస్కోప్ అంతకంటే లేదు.

 2. http://www.malaysia-today.net/blog2006/reports.php?itemid=2136

  though we call our numbering system as arabic.. arabs & other islamic societies call it as indian numerals.

  Our guys are still lethargic in updating books and go by old british written books.

  Have you looked into the history of indian mathematicians?

 3. అవును సుధాకర్‌ గారు, మనవాళ్ళు ఎటువంటి పరికరాలూ లేకుండా ఆ రోజులనుండీ సూర్య,చంద్ర గ్రహణా సమయాలను ఎలా లెక్కిస్తున్నారబ్బా అని ఆలోచించినప్పుడల్లా గణిత గణనాధుని ముందు మోకరిల్లాలనిపిస్తుంది.

 4. సౌమ్య గారు, నిజంగా గణితం లేని జీవితాన్ని మనం ఊహించలేం. మీరు అన్నారు కదా డాక్టర్‌లకు ఇది ఎలా ఉపయోగపడుతుందా అని. పేషెంట్లకు ఇచ్చే మందు డోసుల విషయంలో ఆ ఉపయోగం ఉంటుంది కదా! ( ఇప్పుడైతే రాబట్టుకునే బిల్లు విషయంలో అనుకోండి.) నన్ను ఎప్పటినుండో ఓ విషయం వెంటాడుతుంది. మనవాళ్ళు జ్యోతిష్యాన్ని ఎందుకు అశాస్త్రీయమంటారో తెలియడంలేదు. probability, statastics కి గణితంలో ఎంత ప్రాముఖ్యం ఉందో అందరికీ తెలిసిందే. probabiliy లో అయితే ఏ విషయాన్నీ 100 శాతం నిర్ధారించలేం కదా! మనవాళ్ళు పూర్వకాలం నుండీ మన జీవన గమనాన్ని, ఆయా స్థాన,కాల (గ్రహ గమన) పరిస్తితులబట్టి విశ్లేషించి పొందుపరిచింది ఏ కోవకి చెందుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి జీవన గమనం ఇలా ఉండొచ్చు(ఖచ్చితంగా నూరు శాతం కాకపోయచ్చు) అని చెబితే అశాస్త్రీయమవుతుందా? ఏదన్నా అంటే ఒక కధని చెబుతారు తర్కంతో. ఒక జ్యోతిష్యుడిని ఒక రాజు అడుగుతాడంట నీ జాతకం ప్రకారం నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావని. వాడు ఇంకా చాలా రోజులు బ్రతుకుతానని చెబుతాడంట. వెంటనే ఆ రాజు కత్తి తీసి ఆ జ్యోతిష్యుడి మెడనరికి చంపేస్తాడంట. ఇది చెప్పి జ్యోతిష్యం తప్పుకాదా అని ప్రశ్నిస్తారు!
  – నాకున్న జ్ఞాన పరిధిలో ఇది రాస్తున్నాను. చదివి వదిలెయ్యండి అంతే. 🙂

 5. Hey .. My thoughts went in similar lines.. when I put my fingers on my keyboard.. when I tried making paper flowers.. when I put rangoli on floor.. everything.. maths..
  Really Mathematics Rox…

 6. Boy this it the best darn post I ever read on the internet ! I am a biiiig time math geek.
  I like Mathematics so much that I am ashamed of it.
  And people laugh when I say “If I were to be born, take just one course and die, it would be Linear Algebra”.

  Though I do not write “Mathematics Rocks” in my notebooks. For me it is not something cool, but it is like love, its sooooooo beautiful.

  Your post makes me NOT repent the fact that I did only Maths in my MS instead of focusing on Technology and Job. Even though it rendered me jobless.

  Thanks a lot.
  PS: తెలుగులో వ్రాసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: