Yahoo Mail memories

నిన్న ఒక వ్యాసం చదివాను – యాహూ మయిల్ unlimited storage ఇవ్వబోతోంది అన్నది దాని సారాంశం. యాహూమెయిల్ కి 10 ఏళ్ళు పూర్తవబోతున్న సందర్భంగా ఇది కానుక అట. ఈ వ్యాసం లోనే 10 ఏళ్ళ ప్రస్థానం లో కొన్ని మైలురాళ్ళను గురించి రాసారు. ఈ వ్యాసం చదువుతూ ఉంటే నాకూ యాహూమెయిల్ తో నా అనుబంధాన్ని ఓ సారి గుర్తు తెచ్చుకోవాలనిపించింది. అందుకే ఈ వ్యాసం.

నేను సృష్టించుకున్న మొదటి ఈ-మెయిల్ ఐడీ యాహూమెయిల్ ది. అప్పుడు 4 MB storage ఉండేది. అప్పుడు hotmail లో 2 MB storage మాత్రమే ఉండేది. దానితో నాకు గొప్పగా అనిపించింది 4MB అంటే. ఇప్పుడంటే delete అంటే వింతగా చూస్తారేమో కానీ, అప్పుడు స్పేస్ తక్కువ కాబట్టి మరి ఇంక డిలీట్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే సరిగా గుర్తు లేదు కాని, ఓ దశ లో .co.in వారికి 6MB, .com వారికి 4MB స్థలం ఉండేది. అప్పుడు జరిగిన ఓ సన్నివేశం ఇంకా గుర్తు ఉంది నాకు. ఎవరో ఓ పెద్ద సైజు forward పంపారు. సరిగ్గా సైజు గుర్తు లేదు కాని, వాళ్ళకి నేను ఇలా జవాబిచ్చాను – “ఇంత పెద్ద పెద్ద మెయిళ్ళు పంపితే ఎలా చెప్పు? నాకైతే 6MB కనుక పెద్ద సమస్య కాదనుకో. కాని 4MB వాళ్ళ సంగతి ఏమిటి చెప్పు?” – అని 🙂  space కోసం ఎన్ని సార్లు ఆరాటపడ్డానో! ఎక్కడ ఆ 6 MB అయిపోతుందో అని!

తరువాత తరువాత మొదట 250MB కి, ప్రస్తుతం 1GB కి పెంచేశారు అనుకోండి యాహూ వారు. అది వేరే విషయం. ఎంత జీమెయిల్ తరం అయినా కూడా నా యహూ మెయిల్ ఇప్పటికీ రోజూ వాడుతూనే ఉన్నాను. ఎందుకో, నాకు దాని UI అంటే చాలా ఇష్టం. gmail లోని features కారణంగా దాన్ని వదలడం ఎంత కష్టమో, అలాగే యాహూ మెయిల్ ని వదల్లేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి : ఒకటి – దాని UI, రెండు – నా గత జీవిత జ్ఞాపకం కనుక. ఇప్పటికీ నాకు ఆ ఫోల్డర్ల పద్ధతి అంటేనే ఇష్టం. ఎందుకోగానీ. కొత్తగా యాహూమెయిల్ బీటా వచ్చింది, కొన్నాళ్ళ క్రితం. మొదట కొన్ని రోజులు వాడాను, బాగా అనిపించింది. కాని, వెంటనే వెనక్కి, నా పాత green background theme ఉన్న యాహూ మెయిల్ (అది మొదటి నుంచీ నేను ఎంచుకున్న థీం లెండి) వచ్చేసాను. బీటా లో కొన్ని అంశాలు బాగున్నా కూడా, కొన్ని ఎంత పేలవంగా ఉన్నాయంటే – మళ్ళీ good old YahooMail UI కి రాగానే – ఎండలో తిరిగి తిరిగి ఏసీ గదిలోకి వచ్చినట్లు అనిపించింది.

చివరగా – యాహూమెయిల్ కో జై బోలో! ఇందులో inbuilt chat లేక పోవచ్చు. ఇందులో mails conversations లా స్టోర్ అవ్వక పోవచ్చు. ఇందులో ఒకే మెయిల్ కి రకరకాల లెబుళ్ళు పెట్టే స్వేచ్ఛ లేకపోవచ్చు. ఇంకా బోలెడు లేకపోవచ్చు. అయినప్పటికి – ఇది నా first-love 🙂 bond break అయినా, కొత్త పరిచయాలు వచ్చి సమయం తగ్గినా కూడా .. first love is first love!.

Advertisements
Published in: on March 29, 2007 at 3:44 am  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/29/yahoo-mail-memories/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. రెండు – నా గత జీవిత జ్ఞాపకం కనుక.

  ఇది నాకు బాగా నచ్చింది. గత జ్ఞాపకాల కొరకు నెను కుడా కొన్ని చేస్తుంటాను, అవి ఇప్పుడు చెత్తగా అనిపించిన గాని.

  Yahoo is very very slow when compared to gmail. Apart from that I don’t have any problem with yahoo.

 2. నాకు hotmail మొదటి మెయిల్. ఆ తర్వాత యాహూ. కానీ ఎందుకో యాహూ నాకంతగా నచ్చలేదు. హాట్‌మెయిలూ నచ్చలేదనుకోండి. యాహూ/హాట్‌మెయిల్తో నాకొచ్చిన పెద్ద ఇబ్బంది స్పామ్! ఎన్ని రూల్సు పెట్టినా విపరీతమైన స్పామ్. జీమెయిల్ తర్వాత ఇక నాకు వెనుదిరగాల్సిన పని లేకపోయింది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. నా మొదటి ఈ మెయిల్ usa.net లో అనుకుంట. తర్వాత దాన్ని పెయిడ్ చేసిన తరవాత హాట్‌మెయిల్ కి మారా… వరస్ట్ ఎక్స్పీరీన్స్. కానీ ఇంకేవీ ఉండేవి కాదనుకుంట, తరవాత యాహూ కి, రీడిఫ్ కీ, మారి ఇప్పుడు జీమెయిల్ లో సెటిల్ అయ్యా.

  యాహూ కూడా వాడుతుంటా. కానీ వారు ఏదో చెత్త ఇంటర్ఫేస్ తయారు చేసి ఎంతో హెవీ గా తయారు చేసారు.

  అయినా నేను అన్నిటినీ పాప్ ద్వారానే వాడతాను కాబట్టి ఫర్వాలేదు.

 4. ఏ మెయిల్ సిస్టం అయినా స్పామును ఎదుర్కోవటం అంత సులభం కాదు. ఆఖరుకు జీమైల్ కూడా..నాకూ జీమెయిల్లో రోజూ వచ్చే ఏభై మెయిల్లలో పాతిక స్పామే. అది కూడా నేను నా ఈ-మెయిల్ ఐడి ఎక్కడా ఇవ్వకుండా, బాట్లకు దొరక్కుండా వుండబట్టి 🙂

  స్పాము మీద నా పూర్తి వ్యాసం ఇక్కడ
  http://savvybytes.com/2006/04/26/yahoo-mail-beta-gmail-live-mail/

 5. Its good news to me I am useing my mail only for groups I never deleted any mail after 2005 Oct 9expect spam mails ,now my inbox is 93 % in 2GB …… and never requried to delete any mail :P)
  నాకు మొదలు krupal@netaddress.com (USA.NET) వుండెది 1996 లో అనుకోంటాను అందికాక http://www.joymail.com చాలా బాగుండెది ,కాని పాపం డబ్బులు లేక మూతపడినది తరువాత hotmail ,yahoomail పైనే నాజీవితము కాని krupal@yahoo.com,krupal@hotmail.com దొరకలేదు నాకు yahoo mail కన్నా ఇతర సర్విసులు నచ్చుతాయి

 6. Hmm.. I somehow never used yahoo after gmail came:D and actually none of them , in light of the students mailbox:D

 7. I wish to continue with yahoomail
  AV.Ramana


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: