Seetha Kalyanam

నిన్న శ్రీరామనవమి సందర్భంగా – “సీతా కల్యాణం” అనే బాపు సినిమా వేసారు ఈ-టీవీ లో. ఇది వరలో ఈ సినిమా చూసి ఉన్నా కూడా మళ్ళీ చూడాలి అనిపించింది. “ఎలాగో బాపు సినిమా కదా, బాగుంటుంది.” – అన్న భావన కూడా ఓ కారణం. సినిమా 1976 లో విడుదలైంది. జయప్రద సీత, రవి అన్న అతను రాముడు. ఇతను కాక ఇంకెవరన్నా ఉంటే సినిమా ఇంకా చూడదగ్గది గా ఉండేది ఏమో! అంత expression less గా ఉంది అతని ముఖం. అయినప్పటికి, ఈ సినిమా గురించి చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయి.

మొదట చెప్పుకోవాల్సింది script గురించి. ఎంత సరళంగా రాసారంటే ….. అంత సరళంగా రాసారు. ఎక్కడైనా, రెండు పాత్రల మధ్య జరిగే సంభాషణలు చాలా పౌరాణికాల కంటే తేలిగ్గా అర్థం అవుతాయి. పద్యాలు, శ్లోకాలు వంటి వాటిని బాపు తెరకెక్కిస్తే అర్థమైనంతగా ఇంకెవరు తెర మీద పలికించినా అర్థం కావు. నిజం. Atleast నా వరకు మాత్రం ఈ వ్యాఖ్య నిజం. ఈ సినిమాలో పద్యాలు,పాటలు రాగయుక్తంగానూ ఉంటాయి, చక్కగా అర్థం అవుతాయి కూడానూ. సంభాషణలు ఎవర్రాశారో నాకు తెలీదు కానీ, వారికి మాత్రం నిజంగా hats off.  బాపు సినిమా కనుక ముళ్ళపూడి వెంకట రమణ గారు రాసి ఉండొచ్చు అని నా ఊహ.  సందర్భోచితంగా దశావతారాల్లోని కొన్నింటిని చాలా బాగా చూపారు. చిన్న పిల్లలకి మన mythology గురించి చెప్పడానికి అయితే బాపు సినిమాలను మించిన text book ఉండదు అనుకుంటా.  ఈ సినిమా ప్రత్యేకం. సగరుడు, భగీరథుడు, గంగా నది భూమికి రావడం – ఈ కథ అంతా మరే సినిమా లోనూ చూడలేదు ఈ సినిమాలో తప్ప. ఎంత బాగా చిత్రీకరించారు ఆ ఘట్టాన్ని! నాకైతే చిన్నప్పుడు ఏదో కథల పుస్తకం లో చదివిన ఆ కథ అంతా నా కళ్ళ ముందు  కదలాడినట్లే ఉండింది!

దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దాని వల్లే ఇప్పుడీ బ్లాగు టపా రాయడం మొదలుపెట్టింది. అసలు అంతా clear గా ఉంటుంది… పియర్స్ సబ్బు లాగా. 🙂 నాకు నచ్చిన మూడో అంశం sets. Art direction ఎవరిదో మళ్ళీ తెలీదు. Sets ఎంత సహజంగా ఉన్నాయంటే అదంతా త్రేతా యుగమే అనిపించింది. ఆ జనాల వేషధారణ కూడానూ. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. కానీ చెప్పాలనిపిస్తుంది! దసరథ మహారాజు తన భార్యలతో కలిసి చిన్నప్పటి రామ, లక్ష్మణ, భరత శతృఘ్నులతో ఆడుకునే సన్నివేశం – అద్భుతంగా తీసిన సన్నివేశాల్లో ఒకటి. వామనుడు, బలి చక్రవర్తి మధ్య జరిగిన సంభాషణ ల సన్నివేశం, గంగ ని శివుడు తన కురుల్లో బందించడం – ఇవి రెండూ నాకు నచ్చిన మరో రెండు సన్నివేశాలు. గంగ భూమి మీద పరవళ్ళు తొక్కుతూ రావడం, ఓ ముని ఆశ్రమాన్ని ముంచడం … ఆయన గంగను తాగేయడం – ఇదంతా జరుగుతూండగా background లో వచ్చే పాట/వ్యాఖ్యానం – చాలా బాగుంది.  విశ్వామిత్రుడి కథ ను కూడా చదవడమే కానీ, తెరపై చూడడం ఇదే మొదటి సారి. ఇవన్నీ mythology ని మనసు కు హత్తుకునేలా చూపారు ఇందులో. కథ ను సీతా రామ కల్యాణం వరకే తీసుకున్నందుకో ఏమో ఈ విషయాలన్నీ చూపడానికి సాధ్యమైంది.  లేకుంటే ఇవన్నీ అలాగే కథల్లానే మిగిలిపోయేవి.

ఇంత బాగా తీసిన బాపు గారు హీరో పాత్ర ధారి విషయం లో ఎందుకు ఆ ఎంపిక చేసారో అర్థం కాదు. అసలా రాముణ్ణి చూస్తే – చూడాలనిపించదు! ఒక్కొక్క నటుడి/నటి గురించి ఇప్పటి దాకా నేను చెప్పలేదు. ఎందుకంటే నాకక్కడ పాత్రలే కనిపించాయి. నటులు కారు. అది వారి లోని నటనా కౌశల్యమో, తీసిన విధానం లోని గొప్పదనమో, లేక రామాయణం ఎవరితో తీసినా అంతే్ నో – నాకు తెలీదు. మొత్తానికి చూడదగ్గ సినిమా. మీరు చూసారా? లేకుంటే చూడండి. మీరు చూసినా, చూడకున్నా, మీ పిల్లలకి మాత్రం ఖచ్చితంగా చూపించండి. 🙂

అన్నట్లు బాపు గారికి రాముడు అంటే చాలా అభిమానం అనుకుంటా. యెస్.జానకి గారికి కృష్ణుడి లా! 🙂

Advertisements
Published in: on March 28, 2007 at 6:46 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/28/seetha-kalyanam/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. […] సినిమా చూడాలి. అసలుకే బాపు గారు సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం లో పద్యాలు అవీ తీసిన […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: