CricketWorldCup : India Vs Bangladesh

       నా బ్లాగు లో ఓ కొత్త శీర్షిక ఈరోజు నుండి కొన్ని రోజుల దాకా. ప్రపంచ కప్ జ్వరం నన్నూ తాకుతుందని ఊహించలేదు కానీ, తాకింది. ఫలితమే – ఈ టపా. క్రికెట్ అంటే ఇష్టమే …కానీ, పూర్తి మ్యాచ్ చూడడం కంటే అనాలసిస్ లనే ఎక్కూవగా చదువుతూ ఉంటా …పేపర్లలో. highlights చూసేదాన్ని ఒకప్పుడు. ఈ మధ్య కాలం లో అసలు ఎవరు ఆడుతున్నారు, ఎవరు లేదో కూడా పట్టించుకోవడం లేదు నేను అసలు. అయితే నిన్న ఎందుకో గానీ, భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ చూడాలని అనిపించింది. చాన్నాళ్ళకు ఒక మ్యాచ్ చూసాను. పూర్తిగా చూడక పోయినా కూడా బాగానే చూసాను. పొద్దున్న post-mortem reports చూస్తూ ఉంటే నా బ్లాగు లో ప్రపంచకప్ గురించి రాద్దాం అనిపించింది.

      నిన్న బంగ్లాదేశ్ చాలా బాగా ఆడింది అని చెప్పగలను. పేపర్లో మ్యాచ్ ముందు రాసిన వ్యాసాలు చూసి బంగ్లా ఒకప్పటి బంగ్లా కాదు, డేవ్ వాట్మోర్ శిక్షణ లో ఆరితేరింది అని విన్నాను. కానీ, ఇంతలా అనుకోలేదు. కళ్ళు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు. ఇంకా తొలి ఓవెర్లు బౌలింగ్ చేసిన బౌలర్లు ఇద్దరూ చాలా బాగా చేసారు.  వికెట్లు తీయకపోయినా కూడా నాకు రసేల్ బౌలింగ్ చాలా నచ్చింది. తరువాత ముస్తఫా ది. నేనింకా బంగ్లాదేశ్ అంటే “పిల్ల టీం” అన్న భావన లోనే ఉన్నా నిన్నటి దాకా.  ఇంక ఉండను.

      నాకు అష్రఫుల్ మినహా ఇంకెవరిమీదా పెద్దగా నమ్మకం లేదు ఇదివరలో. ఇక్కడ నుంచీ ఈ టీం బౌలింగ్ మీదా, ఫీల్డింగ్ మీద చాలా నమ్మకం ఉంటుంది అనుకుంటా నాకు :)బంగ్లా ధోని మీద కూడానూ. మొత్తానికైతే నాకు బంగ్లా జట్టు చాలా నచ్చింది నిన్నటి ఆట తో.  నేను మళ్ళీ సెలవు వచ్చి ఇంటికి వస్తే తప్ప ఇంకో ప్రపంచకప్ మ్యాచ్ చూడను. కానీ,  బంగ్లా ఆట ఉంటే మాత్రం ఓ సారి TV Lounge లోకి తొంగి చూసి వెళతానేమో. అంతలా ఆకర్షించింది ఈ జట్టు నన్ను.

       అటు పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్ తో దీనికంటే గొప్ప అనుభవం రుచి చూసింది. నేనా మ్యాచ్ చూడలేదు😦 కానీ, ఐర్లాండ్ కి hats-off. ఈ ప్రపంచకప్ జరిగినన్ని రోజులు నాకు తెలిసిన ప్రపంచకప్ విషయాల గురించి బ్లాగుతాను.🙂 నేను follow అయిన మొదటి కప్ 1996 wills world cup.  అంతకు ముందు వాటి గురించి నేను చదివిన ఆసక్తి కరమైన విషయాలు కూడా పంచుకుంటాను. 

కొసమెరుపు: భారత్ మొదటిసారి ప్రపంచకప్ గెలిచే నాటికి నేను పుట్టనే లేదు. ఈ సారి కప్ గెలుస్తుందేమో అనుకున్నా కానీ,రెండో రౌండు కే దిక్కు లేదేమో అని అనుమానం గా ఉంది!

Published in: on March 18, 2007 at 4:28 am  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/18/cricketworldcup-india-vs-bangladesh/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. “చాన్నాళ్ళకు ఒక మ్యాచ్ చూసాను. ”

    ఇందుకా ఇండియా ఓడింది?🙂

    –ప్రసాద్
    http://blog.charasala.com


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: