The story-telling effect

                    కథలంటే చాలా వరకు అందరికీ ఇష్టం గానే ఉంటుంది. పిల్లలకైతే మరీనూ. మొన్న ఓ రోజు నాకు ఈ విషయం మరో సారి అవగతమైంది. ఆషాకిరణ్ లో ఆ రోజు పిల్లలచేత చేయించాల్సిన exercises ఏమీ లేవు. దానితో కొన్ని కథల పుస్తకాలు ఉంటే వాటిని చదివించడం మొదలుపెట్టాము. పిల్లలు కూడా పెద్దగా లేరు. ఐదుగురే ఉన్నారు అనుకుంటా. వీరిలో ఒకడికి తెలుగు అక్షరాలు గుర్తు పట్టడమే తెలుసు కానీ, పదాలు చదవడం రాదు. చిన్నవాడు. కాబట్టి మొదట నేనేమో – “మీరు చదవండి. స్పష్టంగా చదవండి. ఎలాగంటే మీరు చదువుతూంటే ఈ అబ్బాయి కి అర్థం కావాలి” అని చెప్పాను మిగితా వారికి. వాళ్ళకి కూడా reading practice ఉంటుంది కదా అని. అయితే అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. 🙂 వాళ్ళకూ చదవడం సరిగా రాదు. అలవాటు కూడా లేదు అనుకుంటా. ఇది వరలో చాలా సార్లు ఇలాంటి పుస్తకాలు చదివించాము కానీ, ఇక్కడ తప్ప వాళ్ళు ఆ తరహా readings చేయరో ఏమో కానీ, ఇంకా సమయం పడుతుంది వారు స్పష్టంగా చదవడానికి అని మాత్రం అర్థం అయింది.

సరే …. విషయానికొస్తే, వీళ్ళు ఇలా చదవడం తో ఆ చిన్న వాడికి ఆసక్తి పోయింది. అసహనం పెరిగింది. చివరకి – “నువ్వు చదవొచ్చు కద మేడం?” అన్నాడు. దానితో పెద్ద పిల్లలను ఇంకో వాలంటీరు చూస్తూ ఉంటే నేను వీడికి కథ చెప్పడానికి ఉపక్రమించాను. “కథ చదవొద్దు మేడం” – ముందే ultimatum ఇచ్చేసాడు. నాకు కథలు ఇంత చిన్న పిల్లలకి చెప్పడం …… ఇదే మొదలు అనుకుంటా. కొన్నాళ్ళ క్రితం నా చిన్న cousinsకి చెప్పినట్లు ఉన్నా కానీ, అప్పుడు నేనూ చిన్నదాన్నే. సరే, కథ చెప్పడం మొదలుపెట్టాను. ఐదు నిముషాల్లో మిగితా నలుగురు పిల్లలూ చుట్టూ చేరిపోయారు. వీడు చిన్న పిల్లవాడు కదా అని నేను కాస్త expressions ఇచ్చి చెప్పాను. దానితో ఆసక్తి కరంగా అనిపించినట్లు ఉంది. కథ అర్థం అయింది చివరికి. కథలోని హాస్యాన్ని వారు అర్థం చేసుకుని నవ్వుకున్నారు కూడా.

ఈ ఉదంతం లో నేను గమనించింది ఏమిటంటే – బాగా అల్లరి పిల్లలు, చెప్పిన మాట వినని వారు అని ముద్ర పడ్డ వాళ్ళు కూడా కథ చెబుతూంటే నోరుమూసుకుని, గొడవ చేయకుండా వినడం. అందరూ ఈ కథ వింటూ ఉండడం తో మరో వాలంటీరు కూడా ఓ పుస్తకం తీసి కథలు చదవడం మొదలుపెట్టాడు 🙂 ఇదంతా తరువాత నా స్నేహితురాలికి చెబుతూ ఉంటే – తను కూడా అనింది. “కథలు బాగున్నాయి. మొన్నామధ్య నేనూ వాళ్ళతో కథలు చదవడం మొదలుపెట్టా” అని. “కథా మహిమ!” అనుకున్నా. మొత్తానికైతే పిల్లల్ని ఊరుకోబెట్టే అస్త్రం ఇది. చిన్నప్పుడు కథ చెప్పమని జనాలను వేధించేదాన్ని నేను. ఇప్పటికీ కథలంటే చెవికోసుకుంటాను అనుకోండి. అది గుర్తు వచ్చింది ఎందుకో గానీ! 🙂

Advertisements
Published in: on March 15, 2007 at 4:07 am  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/15/the-story-telling-effect/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. మానవ్, దీప్తిలకు వాళ్ళ బాల్యంలో, నేను, Kenneth Anderson – Man Eating Tigers of Kumaon కథలు చెపుతోంటే చెవులు నిక్కబొడుచుకొని, ఉత్కంఠతో వినే వారు.ఆ తరువాత రోజు కథ చెప్పే సమయానికి వాళ్ళ స్నేహితులు కూడా వచ్చేవారు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: