Gaayam(2006)

నేను ఓ నాలుగైదు నెల్ల క్రితం మా LAN లో గాయం అన్న ఓ పాటల ఫోల్డర్ ఉంటే పాత గాయమేమో అని డౌన్లోడ్ చేసాను. కానీ, తరువాత వినడం మొదలుపెట్టాక తెలిసింది ఇది కొత్త సినిమా అని. సరే, చేసేదేమీ లేక విన్నాను. బానే ఉన్నాయి. అక్కడినుండి అప్పుడో సారీ, ఇప్పుడో సారీ వింటూనే ఉన్నాను. కానీ, గత 4 రోజులుగా అందులోని ఒక పాట నన్ను వెంటాడటం మొదలుపెట్టింది. మొదటైతే పాట లోని పదాలు గుర్తు రాలేదు. కానీ, సీరియస్ గా ల్యాబ్ లో పని చేసుకుంటున్నంత సేపూ వెనక నుండి ఎవరో ఆ పాట హం చేస్తున్నట్లు అనిపించింది. నాకు తెలీకుండానే నేను రోజంతా దాన్ని తలుచుకుంటూనే ఉన్నాను. రూం కి రాగానే ఆ పాట వినడం మొదలుపెట్టా. ఇప్పుడు ఈ టపా రాస్తూ కూడా ఆ పాటలు వింటూనే ఉన్నా. అవేం పెద్ద exceptional గా లేవు. నిజానికి కొన్నింటిలో sagam-western అయిన పాటలు ఉన్నాయి. ఆ mix సరిగా అవ్వక బాగా రాలేదు అవి. అవి కాకుండా మిగితా పాటలు బాగున్నాయి.

నన్ను వెంటాడే పాట – “ఏమైందో గుండెల్లో ఏమో ఉరికే తేనెల వాగులు .. ” – బాగా catchy గా ఉంది ఈ పాట. ఇది కాక ఇంకో పాట అసలు పాట మొదలేంటో గుర్తు లేదు కానీ, “దూరం తెలియని దారుల్లోనా నిన్నే వెదికానే…” అన్న బిట్ చాలా బాగుంది. నిన్ననే తెలిసింది దీని సంగీతం yuvan sankar raja అని. నాకెందుకో illayaraja కుటుంబం నుండి వచ్చిన సినిమా పాటలన్నీ చాలా వరకు నచ్చుతాయి. అది ఆయనవి అయినా, వాళ్ళ కొడుకులవి అయినా. ఇంతకీ, ఈ సినిమా డబ్బింగ్ సినిమా అని నా అనుమానం. ఆన్లైన్ లో నటవర్గం పేర్లు చూసా. ఎక్కడా విన్నట్లు అనిపించలేదు.  అందుకే డబ్బింగ్ ఏమో అని అనుమానం వచ్చింది. ఈ సినిమా lyrics కోసం చాలా ప్రయత్నించా కానీ, దొరకలేదు. కొన్ని చోట్ల పదాలు గుర్తించడం కష్టంగా ఉంది. సంగీతం లో పదాలు మాయమౌతున్నాయో, లేక డబ్బింగ్ ఎఫెక్టో ఇంకా తెలీదు. మీకెవరికైనా ఈ సినిమా lyrics కనిపిస్తే ఇక్కడ ఓ కామెంటెయ్యండి please.

మొత్తానికైతె వినదగ్గది. మంచి పాటలు ఉన్నాయి. ఈ రెండు కాక మిగితా పాటలు కూడా బాగున్నాయి.

Advertisements
Published in: on March 15, 2007 at 4:23 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/15/gaayam2006/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. అవునండి ఇది డబ్బింగ్ సినిమానే.పాటలు బాగుంటాయి గానీ సినిమా బాగోలేదు.ఆ సినిమాలో వుండాల్సిన పాటలు కాదివి.
  సినిమా చాలా పిచ్చి పిచ్చిగా వుంటుందిలెండి.ఆ కధ ఇక్కడ రాద్దామని ప్రయత్నించాను గానీ రాయలేకపోయాను.అందులో ఆ రిలేషన్ లు అలా వుంటాయి. దర్శకుడు కధ ఎలా తయారుచేసాడో కంఫ్యూస్ అవ్వకుండా ఎలా తీసాడో ఆ దేవుడికే తెలియాలి.

 2. Track6.mp3 “aade paade iide mari manade” .. lo oka english bit vastundi .. adhi dhoom2 lo kuda vastundi

  naaku aa paata kavali em cheyamantav 😀

 3. ఆ పాటల గురుంచి బాగానె చెప్పారు అలాగే అవి నెట్లొ ఎక్కడ నుచి దిగుమతి చెసుకొవచ్హొ కొంచం చెపుతారా Sowmya గారు.

  దిలీప్.

 4. కంటి పాప రెప్పలెక్క ఉండ తరమా
  కన్ను చూడ తరమా
  గుండెకోత మండుతుంటే ఆపతరమా
  గుండె ఆగ తరమా
  కలవరం మిగిలి బ్రతుకుట నా తరమా
  కనికరం కలిగి కరుణింప నీ తరమా హే …
  దూరం తెలియని దారుల్లోన నిన్నె వెతికానే
  తీరం తేలియని నావను నేనై నీకై వేచానే
  భారం తెలియక బాధే పడుతూ శ్వాసను తీసానే
  వేదన మరువక వేకువలోనే ఆశగా చూశానే …
  దూరం తెలియని దారుల్లోన నిన్నె వెతికానే
  తీరం తేలియని నావను నేనై నీకై వేచానే
  భారం తెలియక బాధే పడుతూ శ్వాసను తీసానే
  వేదన మరువక వేకువలోనే ఆశగా చూశానే …
  ఓహ్ .ఓహొహొహ్ …ఓహ్ …
  ఓహ్ .ఓహొహొహ్ …ఓహ్ …
  ఓహ్ .ఓహొహొహ్ …ఓహ్ …
  ఓహ్ .ఓహొహొహ్ …ఓహ్ …
  నువ్వులేని లోకమంటె నాకు తెలుసా నువ్వు నమ్మగలవా
  గుండె నిండా నిను నింపుకుంటే అంత అలుసా
  నువ్వు చెప్పగలవా …
  కనులెదుటే …నీవే
  కనుమూస్తే … నీవే
  అణువణువూ …నీవే
  అపురూపం …నీవే
  దూరం తెలియని దారుల్లోన నిన్నె వెతికానే
  తీరం తేలియని నావను నేనై నీకై వేచానే
  భారం తెలియక బాధే పడుతూ శ్వాసను తీసానే
  వేదన మరువక వేకువలోనే ఆశగా చూశానే …
  దూరం తెలియని దారుల్లోన నిన్నె వెతికానే
  తీరం తేలియని నావను నేనై నీకై వేచానే
  భారం తెలియక బాధే పడుతూ శ్వాసను తీసానే
  వేదన మరువక వేకువలోనే ఆశగా చూశానే …
  ఓహ్ .ఓహొహొహ్ …ఓహ్ …
  ఓహ్ .ఓహొహొహ్ …ఓహ్ …
  ఓహ్ .ఓహొహొహ్ …ఓహ్ …
  ఓహ్ .ఓహొహొహ్ …ఓహ్ …


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: