on a violin concert

కుమరేశ్ – గణేష్ : వయొలిన్ ద్వయం ప్రదర్శన అని మా కాలేజీ పండుగ ఫెలిసిటీ సందర్భంగా చెబితే “ఓహో” అనుకున్నాను. great అని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఈ విషయం నాకు తెలియడానికి కొన్నాళ్ళ ముందు నేను వారి “నవరస” అన్న 9 పాటల ఆల్బం విని ఉన్నాను. చాలా బాగుండింది. ఇక ఆ రోజు రాత్రి వాళ్ళు వస్తున్నారని ఎప్పుడూ మెల్లిగా తినే నా స్నేహితురాలు షాహెదా ని కూడా తొందరపెట్టి షో జరిగే చోటికి వెళ్ళిపోయాను. కాసేపు పట్టింది – వాయిద్యాలు అవన్నీ చూసుకుని, సౌండ్ సరి చేసుకుని వారు షో మొదలుపెట్టే సరికి. అక్కడ మొదలైంది – అసలు కథ.

వారి విశ్వరూపం ఇది అని మాటల్లో చెప్పలేనంత అధ్బుతంగా ఉండింది. పండితులనూ, వినికిడి వల్ల అబ్బిన ఙానమే కానీ, స్వర ఙానం లేని నా లాంటి వాళ్ళనూ సమానంగా వాయులీన సాగరం లో ఓలలాడించింది. ఇద్దరి గురించి షో నుంచి వచ్చేసాక చదువుతూ ఉంటే ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి. ఈ ద్వయం మొదటి ప్రదర్శన ఇచ్చేనాటికి వారి వయసులు 5,7. సంవత్సరం -1972. చిన్నతను 10 ఏళ్ళవాడు అయ్యేసరికి 100 ప్రదర్శనలు ఇచ్చేసారట!! టీనేజీ కి వచ్చేసరికి హేమాహేమీలతో కలిసి ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారట. వీళ్ళ జీవితమంతా వాయులీనమయం అనిపించింది. వీరి ట్రూపు లో ఉన్న గిటారిస్టు ని “India’s only carnatic playing bass guitarist అని పరిచయం చేసారు. మృదంగం వాయించిన ఆయన పేరు ఏమిటో తెలీదు కానీ, ఒక స్టేజి లో ఆయన వాయించిన తీరు మంత్ర ముగ్ధుల్ని చేసేలా ఉంది ప్రేక్షకులని.

నాలుగేళ్ళ నా BE జీవితం లో నేను కాలేజీ లో ఫెస్ట్ సమయం లో జరిగిన ఒక్క నైట్ కీ వెళ్ళలేదు. నిన్న దీనికి ఎలా వెళ్ళానో తెలీదు కానీ, వెళ్ళకుంటే నిజంగా చాలా పోగొట్టుకునేదాన్ని. నిద్ర వస్తోంది కానీ వెళ్ళాలనిపించలేదు హాస్టల్ కి. ఒక్క సారి మాత్రం మాయలో పడాలనిపించింది. హాస్టల్కని లేస్తే మాయ నుంచి బయటకు వస్తానేమో అని ఈ ఒక్క సారికీ మాయలో మునుగుదామనే నిశ్చయించుకుని, చివరిదాకా కూర్చున్నా. వీరు మొదలుపెట్టింది నేను ఇదివరకు విన్న ఆల్బం “నవరస” లో నాకు బాగా నచ్చిన పాట – “అధ్బుత”. ఆ క్షణం నుంచి ఎక్కడా ఆగలేదు వీరి ప్రవాహం. వయొలిన్ తో ఇన్ని రకాల విన్యాసాలు చేయొచ్చు అన్న విషయం నాకు ఇంతవరకూ తెలీదు. ఒక క్షణం లో స్లో గా సాగినట్లనిపిస్తుంది మరో క్షణం లో వాయువేగం తో కదులుతాయి ఆ చేతులు .. వయోలిన్ పై. మధ్య మధ్య న చిరునవ్వులు … ఆ ఇద్దరి మధ్య. నాకైతే ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి వాయించినట్లు అనిపించింది. ఇది జరిగి రెండు వారాలు పైనే అయినట్లు ఉంది. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకుండా ఉన్నాను నిజానికి.

మీరు నవరస వినలేదా ? తప్పక వినండి. మిగితా ఆల్బంస్ నేను పూర్తిగా వినలేదు. కానీ, ఒకటీ అరా పాటలు విన్నా అంతే. కాబట్టి వాటిని గురించి వ్యాఖ్యానించలేను. ఇవి కాక మా కాలేజీ కోసం ప్రత్యేకంగా “రాగం తన్యాసి…” అంటూ వెన్నెలకంటి గారు రాసిన పాటను పాడుతూ వయొలిన్ ప్రదర్శన ఇచ్చారు. అందులో కూడా కొన్ని బిట్స్ నిజంగా అమోఘం. Total gaa this violin duo rocked … and they will keep rocking forever!

Advertisements
Published in: on March 10, 2007 at 3:43 am  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/10/on-a-violin-concert/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. చాలా బాగా రాసారు .. నాకు మీ బ్లాగ్ ని మెచ్చుకోవాలని లేదు .. కాని తప్పడం లేదు..
    నాకు మీరు IIIT కాబట్టి చాలా అసూయ గా ఉంది . అలా అని మా కళాశాల ని తక్కువగా అంచనా వెస్తే పొరపాటే .. నెను IIT Madras …కాని సరిగ్గ వినియొగించుకోలేదు .. చాలా courses fail అయ్యాను .. 😦
    అయినా ఇవన్ని మీకు ఎందుకు చెప్తున్నానో .. అర్థం కావడం లెదు.సరెలె ..leave it ..
    best of luck ..
    bye


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: