K.M.Radhakrishnan

ఆ మధ్య మనసు పలికే మౌన రాగం అన్న సినిమా వచ్చింది. పాటలు బావుంటాయి అని ఎవరో చెప్పగా విన్నాను. ఇన్నాళ్ళకు నాకు ఆడియో దొరికింది మా కాలేజీ లో ఎవరో షేర్ లో పెడితే. విన్నాక బావున్నాయే అనుకున్నాను. రెండు మూడు సార్లు విన్నాను. అన్ని పాటలూ నచ్చినట్లే అనిపించాయి. అయితే పాటలన్నింటిలోనూ ఏదో familiarity కనిపించింది. ఏమిటి అన్నది మొదట అర్థం కాలేదు. తరువాత ఎందుకో కాస్త గోదావరి, ఆనంద్ సినిమాల సంగీతానికి, దీనికి బాగా పోలిక ఉందేమో అనిపించింది. ముఖ్యంగా – ” రామా సీతా …… ” పాట వింటున్నంత సేపు నాకు గోదావరి సినిమా పాటలు వింటున్నట్లే అనిపించింది. బహుశా గాయనీ గాయకుల గొంతుకలేమో లే అనుకున్నా. కాసేపటికి అస్తమానం ఆ గోదావరి పాటలే గుర్తుకు రావడం మొదలుపెట్టాయి. అలాగని ఒకటే ట్యూన్లు అని కాదు. ఏదో పోలిక ఉంది. ఏమిటో చెప్పలేక పోయా. బహుశా ఇది కూడా K.M.Radhakrishnan సంగీత దర్శకత్వం లో వచ్చింది ఏమో అనుకున్నాను. అక్కడికి ఆ విషయం వదిలేసా. వదిలేసా అనుకున్నా.

మళ్ళీ పాటలు వినడం మొదలుపెట్టాక మళ్ళీ అదే సందేహం. సరే ఇంక మనసాగక గూగుల్ లో వెదికాను. ఇవి రాధాక్రిష్ణన్ పాటలే అని అర్థమయింది. అప్పటికి మనసు శాంతించింది. ప్రశాంతంగా అనిపించింది. 🙂 అన్ని పాటలూ అలాగే ఉనాయని నేను అనను కానీ, “రామ సీతా” పాట ముఖ్యంగా : ఇది విన్న వారు ఎవరైనా వెంటనే ఇది గోదావరి సినిమా సంగీత దర్శకుడిది అని చెప్పేస్తారు అని నా నమ్మకం. ఇంకా మరో పాట “స్టెప్పు వెయ్యరా…” అన్న దానిలో మధ్యలో – “నింగినే తాకరా…ఎగిరిపో గువ్వ లాగా…. ” ఆ భాగం లో నాకు గోదావరి లో “మనసా గెలుపు నీదేరా” పాట గుర్తు వచ్చింది. “రామా సీత…” పాట మొదట్లో కాస్త ఆనంద్ లాగా అనిపించినా తరువాత నాకు గోదావరి చాలా సార్లు గుర్తు వచ్చింది. “ఆ ఆలాపనా….. ” పాట కూడా మళ్ళీ…….. ఎందుకో గానీ…. “మనసా వాచా..” అన్న గోదావరి పాట తరహా లో అనిపించింది మొదట్లో. కాసేపటికి ఇది దానికంటే స్లో గా ఉంది అనిపించింది.

ఈయన కి కొన్ని రాగాలు అంటే బాగా ఇష్టమేమో అనిపించింది. కొన్ని పాటలు వింటే ఇంత ఈజీగా కనుక్కోవచ్చా ఈయన శైలి ని ! – అనుకున్నాను. “కొత్త పెళ్ళి కూతురు….” – పాట కాస్త ఏ పోలికా లేకుండా ప్రశాంతంగా విన్నాను. “స్టెప్పు వెయ్యరా….” పాట కూడా బానే విన్నా మధ్యలో మనసా గెలుపు నీదేరా గుర్తు వచ్చేదాకా. “నింగి నేలలకు కాదా కల్యాణం” – పాట ఒక్కటి కాస్త ఈయన శైలికి భిన్నంగా అనిపించింది. ఈ మూడు సినిమాల్లో నేను విన్న పాటల్ని బట్టి. ఈయన “కాంచనమాల, కేబుల్ టీవీ” సినిమాకి కూడా సంగీత దర్శకుడని విన్నాను. దాని పాటలు నేను వినలేదు కాబట్టి no comments. “తెలుసుకో జీవితం…” పాట కూడా మళ్ళీ “మనసా గెలుపు నీదేరా…” తరహాలోనే అనిపించింది.

ఇంతకీ మరీ ఓ 10 పాటలు వినేసరికి 11వ పాటను అలా క్లాసిఫై చేసేయగల్గడం నాకంత నచ్చలేదు. 😦 వైవిధ్యం ఉండాలేమో అని నా అభిప్రాయం. కనుక్కున్న ఆనందం విన్నవాళ్ళలో కలగాలన్నా కూడా సుమారుగా కొన్ని పాటలు విన్నాకే కనుక్కొనగలిగేలా ఉండాలి. ఇప్పుడీ పాటలు మూడో సినిమా కాబట్టే నచ్చాయేమో అని నా అనుమానం. ఇంకో 4,5 సినిమాల తరువాత కూడా నాకు పాటలు వింటున్నంతసేపూ గోదావరో, ఆనందో గుర్తు వచ్చాయంటే తరువాత వచ్చే 6వ సినిమా పాటలు మాత్రం ఇంక నచ్చడం కష్టం అని ఖచ్చితంగా చెప్పగలను.

P.S.: K.M.Radhakrishnan అభిమానులకు – నేను రాసింది విమర్శ కాదు. concern అని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాకు శాస్త్రీయ సంగీతం పరిచయం లేదు. వింటాను. అంతే. కాబట్టి ఇది సగటు listener అభిప్రాయం. విమర్శ కాదు.

Published in: on March 8, 2007 at 9:07 am  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/08/kmradhakrishnan/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. manaki, CHINA vallu, japan vallu anta oke laga kanipistaru.
  vallaki indians anta oke laga kanipistaru.
  meru cheppedi alane undi.
  meru general ga elanti patalu vintaru ?
  -Sravan

 2. You’re spot on. K M Radhakrishanan’s later songs all have Anand hang-over written in bold letters. Godavari reminded me of Anand. I haven’t heard Manasupalike.., but heard from a friend that the tunes sound familiar.

 3. రాధాకృష్నన్ శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా సినిమా సంగీతం చేస్తున్న కొద్దిమందిలో ఒకడు. కొన్ని రాగాలు ఎక్కువగా వాడతారు కానీ మీరన్నట్టు ఇంకోన్ని పాటలు చెయ్యనియ్యండి. its too early to make a judgement.

  అన్నట్టు “నింగి నేలకి…” అన్నపాట కూడా శాస్త్రీయ సంగీతం ఆధారమైనదే. హంసానంది రాగంలో ఉంది. సాగర సంగమంలో వేదం అణువణువున…, ఇంకా హాయి హాయిగా ఆమని సాగే… ఈ రాగంలో ఉన్న కొన్ని పాటలు.

 4. […] ఓ సారి ఈ బ్లాగులోనే ఓ టపా రాసాను ఇక్కడ.  అప్పుడు అక్కడ రాసిన మాటలు  గుర్తు […]

 5. I want to remain ananymous.
  Radhakrishnan’s knowledge in CM is not so good its very limited….so is why his tracks are repetitive…I know him personally and I also took his interview for a TV channel…Sriran, inka KR meeda asalu vadileyandi….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: