Adoption issues -Today’s eenaadu news item

ఈరోజు ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ లో ఒక వార్తా కథనం ఉంది. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం ఓ తల్లి పేదరికం లో తనకు పుట్టిన బిడ్డను అమ్మేసిందట. ఆ బిడ్డ జర్మనీ లో ఓ దంపతుల బిడ్డగా పెరుగుతూ, ఇప్పుడు తన మూలాలు తెలుసుకోవాలనే కోరిక తో తన “తల్లిదండ్రుల్ని” అడిగి, విసిగించి మొత్తానికి కనుక్కుంది ఆ అమ్మాయి. తన మూలాలు ఇక్కడ అని. కొన్నాళ్ళకి తల్లి ఆనవాళ్ళు కనుక్కుంది. అప్పటినుండి ఉత్తరాలు నడిచాయి వీళ్ళ మధ్య కొన్నాళ్ళు. అమ్మాయి కి ఇండియా వచ్చి తల్లి ని చూడాలన్న కోరిక పుట్టింది.

“దీంతో ఒక్కసారిగా కన్నపేగుపాశం నిద్రలేచింది. కూతురిని పోషించే స్థాయిలో లేకున్నా ఆమెను వదులుకోకూరాదని ఆ మాతృమూర్తి నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంలో ఫాతిమాకు నగరంలోని ఓ మహిళా మండలి అధ్యక్షురాలు గీత అండగా నిలిచి ఆమె తరపున పోరాటానికి సిద్ధమయ్యారు.” 

– దీని గురించే నా సందేహం. లీగల్ గా ఈ దత్తత కేసుల్లో ఆ అవకాశం ఉంటుందా? మానవత్వం తో ఆలోచించినా కూడా నాకు ఇది సబబు గా అనిపించడం లేదు. ఒక సారి దత్తత ఇచ్చాక మళ్ళీ వదులుకోకూడని నిర్ణయించుకుంటే ఎలా? అవతలి పక్షం వారి సంగతేం కావాలి? తల్లి ప్రేమ ను ఎవరూ కాదనలేరు. కానీ, అవతల వైపు పెంచిన ప్రేమో మరి? 15 ఏళ్ళు పెంచారే! వారి మీదా ఈ పోరాటం?

కన్న కూతుర్ని చూడాలి అనుకోవడం లో తప్పేం లేదు. కానీ, ఓ సారి దత్తత కు పంపాక ఇన్నాళ్ళకు మళ్ళీ తన దగ్గరే ఉంచేసుకోవలి అనిపించడం కాస్త అత్యాశ లా అనిపిస్తోంది నాకు. pure materialistic angle లో చూసినా కూడా నాకిది అత్యాశ లానే ఉంది. more human angle లో చూసినా అలాగే ఉంది. అసలు ఇది ఒక ఎత్తు.


“కన్నబిడ్డను తనకో సారి చూపాలని, స్వీయ పోషణ కోసం తాను దత్తతనిచ్చిన వ్యక్తుల నుంచి కాస్త ఆర్థిక సహకారం అందించాలని కోరింది”

– ఇది మరో ఎత్తు! ఇది నాకు మరీ అన్యాయంగా తోస్తుంది. ఆ బిడ్డ ను దత్తత తీసుకున్నందుకు ఇన్నాళ్ళ తరువాత ఆ జర్మన్ దంపతులు ఈ తల్లి కి ఆర్థిక సహకారం అందించాలా?? వారంతట వారుగా అందిస్తే పర్వాలేదు కానీ, ఇది అంతా న్యాయపోరాటాల ద్వారా ఈమె సాధించాలనుకోవడం, దానికి మహిళా మండలి వారు సహాయం చేయడం నాకు వింతగానే ఉంది. తల్లీ కూతుళ్ళ మధ్య అనురాగానికి వారధి గా ఉండటం లో తప్పు లేదు. కానీ, అన్యాయంగా ఆ పెంపుడు తల్లిదండ్రులపై కేసు వెయ్యడం మాత్రం నాకెందుకు సబబుగా తోచడం లేదు. ఈ ఆర్థిక సహాయం విషయం అయితే మరీనూ! 23 న కోర్టు లో ఈ కేసు వాయిదా ఉందంట. చూడాలి ఏమౌతుందో!

దత్తత కేసుల్లో ఇలాంటి విషయాలు మామూలే ఏమో. ఆ పిల్లలు కొన్నాళ్ళకు మూలాలు వెదుక్కుంటూ ఇక్కడికి రావడం. కానీ, వాళ్ళను తమతో ఉండిపొమ్మనడం – అంత practical గా అనిపించడం లేదు. ఇంక వారి పెంపుడు తల్లిదండ్రుల నుంచి ఇప్పుడు ఆర్థిక సహాయం ఆశించడం అయితే నాకు బ్లాక్ మెయిల్ లాగే ఉంది! 😦

Advertisements
Published in: on March 7, 2007 at 3:39 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/07/adoption-issues-todays-eenaadu-news-item/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. నా అభిప్రాయమైతే, పెంచిన తల్లితండ్రులకే హక్కు ఉంది. కావాలంటే ఆ పాపకి తనకి జన్మనిచ్చిన తల్లిని చూడాలనిపించినప్పుడల్లా అనుమతించవచ్చు. కానీ పెంచిన తల్లితండ్రుల నుంచి డబ్బు ఆశించడం చాలా తప్పు. కోర్టు తీర్పు పెంచిన వాళ్ళకి న్యాయం చేకూరుస్తుందనుకుంటున్నాను.

  2. నేను మీ వాదనతో ఏకీభవిస్తాను. ఈ మధ్యన కొరియా న్యూస్ పేపర్లో ఇలాంటి వార్తే వేసారు. ఇక్కడ కొరియా వాళ్ళు కూడా చాలామంది పిల్లల్ని పెంచుకోలేక విదేశీయులకి దత్తతనిచ్చేసారు. అలాంటి ఒకమ్మాయి ఈమధ్యన తన కన్న తల్లిదండ్రులని చూడడానికి వచ్చింది. వాళ్ళు ఏడ్చిరాగాలు పెట్టారు. తమతో ఉండిపొమ్మన్నారు. ఆ అమ్మాయి మాత్రం నేను నా తల్లిదండ్రులని చూడ్డానికొచ్చాను. అంతే. నన్ను పెంచినవాళ్ళదగ్గరే ఉంటానని చెప్పి వెళ్ళిపోయింది. కష్టంలో తమ బిడ్డని కొనుక్కొని ఆర్ధిక సహాయం చేసి, తమ బిడ్డకొక మంచి జీవితాన్నిచ్చిన వాళ్ళని కోర్టుకులాగడమంటే, ఏరుదాటాక తెప్పతగలెయ్యడమే.

  3. ఇక్కడ హక్కులేమి చెల్లవండి చందు గారు. అలాంటి హక్కులు చట్ట ప్రకారం లేవు కూడా. ఏ పిల్లలకూ నా తల్లి తండ్రులు నన్ను పెంచటం లేదని అడిగే హక్కు ఉందని నేనకోవటం లేదు. ఇక్కడ పెంచిన తల్లి తండ్రులకే కాక మాతృ ప్రేమ అనే భావనే అన్యాయానికి గురి అవుతుంది. కని పారేసిన ప్రతి జీవి తల్లి అయిపోదు కదా.

    ఇప్పటికి ఆ అమ్మాయి మేజర్ అయివుంటే ఈ కేసు కోర్టులో అస్సలు నిలబడదు. విదేశీయుకు కదా బాగా డాలర్లు గుంజుకోవచ్చని ఎవరో సలహా ఇచ్చి వుంటారు ఆ “కనవలసి వచ్చిన” తల్లికి. ఇంకా కాసేపు ఆగండి..ఇందులో మైనారటి రొచ్చు కూడా మొదలవుతుంది. దీనకి ప్రత్యేకంగా రంగంలోనికి దిగే ఎంపీలు, ఎమ్మెల్యేలు వున్నారు హైదరాబాదులో.

  4. మీరన్నది నిజం సౌమ్య గారు.ఇదేమి న్యాయం.ఈ సంఘాలు ఇలాంటి వాల్లకి కూడా అండగా నిలబడతాయా?డబ్బులు ఇమ్మని అడగడం మరీ అన్యాయం.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: