Desamuduru generation

                ఈమధ్య పిల్లలు మాట్లాడే మాటలూ, పాడే పాటలూ ఉన్నాయి చూసారూ ….. ఆఖరికి నాక్కూడా : “మా కాలం లో అయితేనా?” – అని నోరు, చేతులు తిప్పుతూ మాట్లాడాలనిపిస్తుంది ఏ సూర్యకాంతం లానో, ఛాయాదేవి లానో.

ఇందాక ఆషాకిరణ్ లో చదువుల session అయిపోయి వెళ్ళిపోయే ముందు food session మొదలైంది. ఈరోజు 5 మందే వచ్చారు. మామూలుగా 10-15 మందికి తక్కువ రారు. దానితో ఒక్కోళ్ళకి ఎక్కువ quantity వచ్చింది. అరటిపళ్ళూ, papaya నూ. అయితే ఒకడు ఇంకోడి తో అంటున్నాడు –  ” ఒరేయ్, ఈరోజు ఎందుకు ఇన్ని ఇచ్చారో తెలుసా? మిగితా వాళ్ళు రాలేదు కదా…. అందుకని.” అని.  పిల్లలు బాగా తెలివిమీరి పోయారు అని మనసులో అనుకుని పైకి ఓ నవ్వు మాత్రం నవ్వాను.

రోడ్డు దాటించడానికి పిల్లలని తీసుకెళ్తూ ఉంటే ఎవరో ఒక అబ్బాయి లోపలికి వస్తున్నాడు. మా కాలేజీ విద్యార్థి. అతన్ని చూపిస్తూ మా పిల్లల్లో ఒక అబ్బాయి అన్నాడు – ” టీచర్, ఈ అబ్బాయి తో కలిసి ఎప్పుడూ ఒక అమ్మాయి ఉంటుంది. వీళ్ళిద్దరూ భలే వెరైటీ గా మాట్లాడతారు టీచర్” అని! ఇంక అప్పుడు నా మొహం చూసుంటే – టైడ్ డిటర్జెంట్ వాడు వెంటనే కెమెరా పట్టుకుని నన్ను చూపిస్తూ వ్యాఖ్యానం మొదలుపెట్టేవాడు – ” అవ్వాక్కయ్యారా?” అంటూ! ఆ అబ్బాయి ని చూడగానే నాకూ ఆ అమ్మాయే గుర్తు వస్తుంది కానీ, (;)) పిల్లలు కూడా అంత బాగా గమనించి ఉంటారని ఊహించలేదు.

ఈ మధ్య ఈ చిన్న పిల్లల బ్యాచ్ అంతా మరీ తెలివి మీరి పోతున్నారు అసలు! బంధువుల ఇళ్ళలో పిల్లలనూ, ఇక్కడ వీళ్ళనూ చూస్తూ ఉంటే ఈ విషయం బాగా తెలుస్తోంది.

Advertisements
Published in: on March 6, 2007 at 1:31 pm  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/06/desamuduru-generation/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

 1. అన్ని చోట్లా పిల్లలు అలాగే ఉన్నారండి…

 2. మీ ఆషాకిరణ్ లో పిల్లలు కూసింత బెట్టరు , మా బంధువుల పిల్లలు , పక్కింటి పిల్లల మాటాలు వింటుంటే ఒక్కోసారి భయం వేస్తుంది !!

 3. పిల్లలు హైపర్ ఏక్టివ్ గా తయారవుతున్నరీమధ్య. దీనికి తోడు సకలరహస్యాలూ పిల్లలకి సైతం అర్ధమయ్యేలా నూరిపోస్తున్న సినిమాలు, టి.వి. కార్యక్రమాలు.

  కాలాలతో నిమిత్తం లేకుండా పిల్లలకి ఉండే మౌలిక లక్షణం హిపోక్రసీ (చెప్పేది ఒకటి చేసేది ఒకటి) ని తట్టుకోలేకపోవడం. ఇప్పటి పిల్లలకి కాసింత లాజికల్ థింకింగ్ ఎక్కువ కావడం వల్ల పెద్దలు జాగ్రత్తగా ఉండక తప్పదు.

  నీతి కథలు చెప్పే తల్లులు, రామాయణం, మహాభారతం విడమర్చి చెప్పే తాతలు, తాతమ్మల స్థానే వెకిలి వేషాల పోగో చానళ్ళు తయారయ్యాయి ఇప్పుడు.
  పిల్లలు తప్పు చేస్తుంటే మందలించడం అటుంచి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించే తీరిక తగ్గిపోతోంది ఈ నాటి తల్లితండ్రులలో.

  చదువుకున్న వాళ్ళలోనే ఇలా ఉంటే పేదలు, అభాగ్యులు, విచ్చలవిడితనం మూర్తిభవించే వారి సంతానం ఏ మాత్రం గొప్పగా ఉంటుంది?. కాబట్టి ఆషాకిరణ్ లాంటి స్కూళ్ళల్లో పిల్లలకి ఎథిక్స్, మోరల్ వేల్యూస్ ప్రత్యేకించి నూరిపోస్తూ ఉండాలి. పిల్లల్లో దేశముదురుతనం పెరిగిన మాట వాస్తవమే. అయితే వాళ్ళు మునుపటి కన్నా మనం నేర్పేది మరింత వేగంగా నేర్చుకోగలుగుతున్నారన్నదీ నిజమే. శాంతి మేడం మరియు మీలాం టిటీచరమ్మల పుణ్యమా అని అషాకిరణ్ పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకి చేరగలరని ఆశ పడ్తున్నాను.

  కృష్ణ

  హైదరాబాద్ మహానగరం


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: