Where teachers fear students

ఆ మధ్య ఓ రోజు శాంతి మేడమో ఎవరో ఒక పిల్లాడికి బండి లో అమ్మే పానీపూరీలు అవీ ఇవీ అన్నీ తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారంట. అప్పుడు నేను లేను. నా స్నేహితురాలు ఉంది. ఆ మాట వినగానే ఆ పిల్లాడు వెంటనే నా స్నేహితురాలిని చూపించి – “ఈ టీచర్ కూడా తింటుంది అక్కడ” – అని accusative Tone లో చెప్పాడట! కాసేపటికి నేను వెళ్ళాను. నా స్నేహితురాలు నాతో ఇది అంతా చెప్పింది. ఇద్దరికీ నవ్వు వచ్చింది. నేను ఏదో ఒకటి అనాలని వాడిని పిలిచి – “నువ్వెప్పుడు చూసావు రా?” అని అడిగా. ” ఆ రోజు నువ్వు కూడా ఉన్నావ్ టీచర్ అక్కడ” – అన్నాడు. ఇంక చూడాలి నా మొహాన్ని! నేను, నా నేస్తం ఇద్దరం చాలా నవ్వుకున్నాం. దెబ్బకి చాలా రోజుల దాకా నేను ఆ బండి జోలికి పోలేదు. మొన్నో రోజు ఓ ఫ్రెండు బలవంతం మీద వెళ్ళా. అదీ చుట్టుపక్కల చూసుకుని!

ఇంకో స్నేహితుడి అనుభవం: అతడికి సిగరెట్ అలవాటుంది. ఉన్నట్లుండి ఓ రోజు ఆషాకిరణ్ లో ఒక అమ్మాయి ని చూసి షాక్ తిన్నట్లు మొహం పెట్టాడు. ఎందుకని అడిగితే అసలు సంగతి చెప్పాడు. ఇతను సిగరెట్లు కొనే బండి ఆ అమ్మాయి నాన్నదంట! దానితో అన్నాడు – ” ఇంక నుంచి వేరే ఏదో బండి వెదుక్కోవాల్సిందే!” అని 🙂

ఆ మధ్య ఓ రోజు పిల్లలతో అవుట్ చేసుకునే ఆట ఆడుతూ అత్యుత్సాహం లో జారి పడ్డాను. అనుకోకుండా తరువాతి రోజు కూడా స్కూలు కి నేనే వెళ్ళాను. దెబ్బలు కనిపిస్తే ప్రశ్నలతో చంపేస్తారని ఫుల్-షర్టు వేసుకుని వెళ్ళాను. “ఏం టీచర్, చలేస్తోందా నీకు ఈ టైము కి?” “ఏం టీచర్, మళ్ళీ ఆడతావా మాతో?” (ఒకరిద్దరి ముసి ముసి నవ్వులు), “టీచర్, నిన్న దెబ్బ ఎక్కువ తగిలిందా టీచర్?” – concern. “టీచర్, నొప్పిగా ఉందా టీచర్?” – మరో సారి concern : ఇలా రకరకాల ప్రశ్నలతో దాడి చేసారు నా మీద 🙂 కొన్ని ప్రశ్నలకు కాస్త embarassing గానూ, కొన్నింటికి వీళ్ళ శ్రద్ధ కు ఆనందంగానూ ఉండింది. కానీ, ఇంకో సారి ఫీట్లు చేసేటప్పుడు, అదీ వీళ్ళతో చేసేటప్పుడు కాస్త జాగ్రత్త గా ఉండాలి అని అర్థమైంది. లేకుంటే book అయినట్లే ఇంక. leg-pulling మొదలైంది అంటే ఆగదు – ఎక్కడైనా.. ఎవరినీ వదలకుండా satires వేసే నేను వాళ్ళ ప్రశ్నలకు మూగదాన్ని అయ్యాను!

టీచర్లకు పిల్లలే కాదు. పిల్లలకి టీచర్లు కూడా భయపడతారు! 🙂

Advertisements
Published in: on March 3, 2007 at 3:11 am  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/03/where-teachers-fear-students/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. అబ్బా..పడీ పడీ నవ్వుకున్నానండి.ఇలాంటి అనుభవాలు నాకూ అయ్యాయి.

  2. ఎక్కడ దొరికారండీ బాబు..అందరూ ఐటమ్ పిల్లల్లా వున్నారు 🙂 అంతా TV మహత్యం అనుకుంటా

  3. You can use this experience to teach about playing safely. What would happen if some one fell down from the stairs? Or if you were following them to stop playing dangerously and hurt yourself? Let them think about it. Accidents do happen when playing. So, play in a way and where the effect of such accidents would not be so dangerous.

    Just an idea.

    lalitha.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: