Management lessons from AshaKiran kids

నాకీమధ్య ఓ సందేహం వచ్చింది. పిల్లలకి చదువు చెప్పే సమయం లో కాస్త కఠినంగానే వ్యవహరించాలేమో అని. ఇదివరలో అంత తెలిసేది కాదు కానీ, ఇప్పుడు బాగా తెలుస్తోంది ఈ విషయం. ఓ రెణ్ణెళ్ళ క్రితం వరకు పిల్లలు బానే ఉండేవారు. గొడవ చేయకు అంటే చాలా మటుకు ఆపేవారు. చెట్లు ఎక్కకు, పడతావు అంటే వినేవారే ఎక్కువ…ఇంకా పైకి ఎక్కేవారికన్నా : అప్పట్లో.

కొత్త సంవత్సరం మొదలయ్యాక వీరి ఆగడాలు బాగా ఎక్కువైపోయినట్లు నాకు అనుమానం. మెట్లు లేని మేడ పైకి గోడ లోని కన్నాల సాయం తో ఎక్కే ప్రయత్నాలు చేయడం ఒకటి – ఎంత risky పనో ఎంత చెప్పినా అర్థం కాలేదు. తరువాత కొన్నాళ్ళకు ఆ బిల్డింగ్ వాచ్మెన్ కి భయపడో ఏమో మరి మానేశారనుకోండి. అది వేరే విషయం. ఒకళ్ళనొకళ్ళు పరుష పదజాలం తో దూషించుకోవడం, మరీ విపరీతంగా కొట్టుకోవడం, సందు చిక్కితే పిలిచినా వినిపించుకోకుండా చెట్లు ఎక్కడం, కొమ్మలు తెంపేయడం – ఇవి Latest developments. పిల్లలతో మెత్తగా ఉంటూనే  వారికి మంచి చెప్పొచ్చు అని అనుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళు. కానీ, మొన్న మా AK స్కూలు అమ్మాయి లలిత తన స్నేహితురాలు సంధ్య తో : “ఆ టీచర్ ఊరికే అట్ల చెబుతుంది అంతే. ఏమీ అనదు లే” అని నా గురించి నా ముందే చెబుతూంటే అనిపించింది – నేను మరీ మెతగ్గా వ్యవహరిస్తున్నానేమో వీరితో అని.

బెదిరింపు ఒక మార్గం. ఇలా చేస్తే ఫలానా వారికి చెప్తాను అని. మొన్నో రోజు నేను ఎవరికో ఫోను చేస్తూ ఉంటే వీళ్ళకి కాస్త భయం, భక్తి ఉన్న సత్య సార్ కి చేస్తున్నా ఏమో అనుకుని పిల్లలందరూ సైలెంటైపోయారు. కాసేపు ప్రశాంతత అలుముకుంది. అందరూ కూర్చుని ఇచ్చిన చిన్న చిన్న exercises చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా నాకే ఉద్ధేశ్యం లేకున్నా కూడా బెదిరించినట్లైంది.

కాస్త గట్టిగా చెప్పడం చాలా అవసరం అని అర్థం కావడానికి ఇన్నాళ్ళు పట్టింది నాకు, బెదిరింపు సంగతి అటు పక్కన పెడితే. మెతగ్గా ఉంటే ఎవరూ వినరు. నీ మాట అవతలి వాళ్ళని చేరాలంటే “aggressive గా ఉండు అనుకుంటూ management principle ఒకటి కనిపెట్టాను 🙂 ప్రథమ యత్నం గా – “చూడు బాబూ, గొడవ చెయ్యడానికే అయితే ఇక్కడకు రాకు. నువ్వు వెళ్ళిపోయినా నేను ఏమీ అనను. ఎవరికీ ఫిర్యాదు చెయ్యను. వెళ్ళు. రెపట్నుంచి రాకు” -బాగా నస పెడుతున్న ఒకడికి చెప్పి చూసాను. కాస్త ఫలితం ఉండింది. అక్కడికీ గట్టిగా చెప్పలేకపోయాను. చిన్నపిల్లల్లే అన్న soft-corner తో.

అయినా స్కూల్లో టీచర్లలా కర్రలు పట్టుకుని చెబితే గానీ వినరో ఏం కథో ఈ పిల్లలు. ఆ మధ్య “మీ స్కూల్ లో కూడా ఇలాగే చేస్తావా రా?” అని ఒకడిని అడిగితే “ఇట్లెందుకు చేస్తా? సారు కొడతాడు” అని జవాబిచ్చాడు!!!!! అంటే కొట్టము-తిట్టము కాబట్టి మాతో ఏమన్నా చేయొచ్చు అన్నమాట! కాస్త 2,3 ఏళ్ళుగా వస్తున్న లిని, సత్య లాంటి వాలంటీర్లకు పిల్లలు కాస్త భయపడతారు. అలవాటు కాబట్టి ఊరుకుంటారో! 4,5 నెలలు గా వస్తున్న నాబోటి వారికి వాళ్ళు ఇంకా అంత అలవాటు పడకపోవడం మాట వినకపోవడానికి ఓ కారణం కావొచ్చు. ఏది ఏమైనా  నేను ఇంత మంది అధ్యాపకుల మధ్య ఏ బీస్కూలూ చెప్పలేనన్ని మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకుంటున్నా. అది మాత్రం నిజం!

Advertisements
Published in: on March 2, 2007 at 3:58 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/02/management-lessons-from-ashakiran-kids/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. “ఆ టీచర్ ఊరికే అట్ల చెబుతుంది అంతే. ఏమీ అనదు లే” ఇది విజులవలైజ్ చేసుకుని మీ మొహంలో రంగులు ఎలా మారాయో అనుకుంటే తెగ నవ్వొస్తుంది 🙂 ఎంజాయ్ చేస్తున్నారండీ మీరు 🙂

  కొంత బెదిరింపు మాత్రం పిల్లలకు తప్పని సరి, అది వారి మంచికే కదా…

  కాళ్లు, చేతులు విరిగితే మనుషులు గానీ, జంతువులు గానీ ఎన్ని కష్టాలు పడతాయో వాళ్ల చేతే ఒక సారి ఇంటరాక్టివ్ గా చెప్పించి చూడండి. బుర్రకు పని చెప్పి వాళ్లు చేసేది తప్పని వాళ్లే తెలుసుకుంటారు.

 2. నేను మా అబ్బాయిని తిట్టకుండా,కొట్టకుండా పెంచుదామని చాలా అనుకునేదాన్ని.కానీ ఇప్పుడు కఠినం గానే వుండాల్సివస్తుంది.మీరు కూడా ఆ పిల్లలతో అలా వుండడం తప్పదేమో?మీ ఆశాకిరణ్ విషయాలు నాకు చాలా ఇంట్రెస్ట్ గా వుంటున్నాయి.చాలా మంచి పనులు చేస్తున్నారు.

 3. చాలా గొప్పపని చేస్తున్నారు. మంచి విషయాలు నేర్చుకుంటున్నారు. పిల్లలు మీ మాట వినలేదనే విసుగులో ఒక క్షణకాలంపాటైనా విచక్షణకోల్పోయి అనాలోచితంగా ప్రవర్తించే సందర్భం రాకుండాచూసుకోగలరని ఆశిస్తున్నాను. గోడ ఎక్కి కిందపడితే ఏమౌతుందోననే పెద్దల ఆందోళనను పిల్లలు గ్రహించేలా చేయగలిగితే మళ్లీ ఆ పని చేయరేమో. జారి పడటానికున్న ఆస్కారాలు, పడితే ఏదైనా విరిగితే జరిగే పరిణామాలు, ఆ సాహసం చేయడంవల్ల తమ మిత్రులలో తమకు వచ్చే false recognition ఎంత ప్రమాదకరమైనదో అర్థమయేలా సావధానంగా చెప్పవచ్చేమో మనం. దూరంగా ఉండి మాటలు చెబుతున్న నాకంటే ప్రత్యక్షంగా చూస్తున్న మీరే ఈ సాధ్యాసాధ్యాలను నిర్ణయించగలరు.

 4. 🙂 You learn new things everyday with kids. Or you look at same things differently when you are with kids.

  Well, there’s no compromise when it comes to safety. You have to be firm about some limits.

  The thing that strikes me first is that these children need a way to let their energy out positively. They need a safe place and safe games to play. This is something the management or whoever is responsible has to seriouly look into.

  For the volunteers:
  1. Set clear rules about things that are off limits. Come up with consequences that you could follow through consistently. It could be a simple reward or a simple punishment, like not having a story time or something that they look forward to, for the day. Then, follow that though. (Easier said than done, but the reward is their respect for you and a consequent sustained good behavior.)
  2. When kids fight, simplest (not so simple in practice) thing is what is called a “time out”. Separate them. If the fight is over an object, take it away from them. Let them know they have to be quiet for a few minutes in their own specified places. You could give them a boring task to do if they are fidgety, to keep them occupied but not interestingly enough. After time out, get them together and ask them or suggest what they could do to better handle the situation next time.
  Hope it helps.

 5. నా పిల్లలతో నాకూ ఈ అనుమానం అప్పుడప్పుడూ వస్తుంటుంది. నేను చాలా సరళంగా వుంటాను. మా ఆవిడ కొంచం కఠినంగా వుంటుంది. “దేవుడికైనా దెబ్బే గురువు” అన్నది ఆమె సూత్రమైతే, “ప్రేమే అన్నిటినీ జయిస్తుంది” అన్నది నా పాలసీ. అయితే నేను ఇంట్లో వుంటే పిల్లలు ఆమె మాట కూడా వినరు. అప్పుడు చీవాట్లు నాకు పడతాయి. అప్పుడప్పుడూ నాకూ మరీ ప్రేమగా వుండటం వాళ్ళని క్రమశిక్షణలో వుంచదేమొ అనిపిస్తుంది.
  కానీ ఒక్కోసారి మా ఆవిడ భయం చేయించలేని పనులు నా ప్రేమ చేయిస్తుంది. నువ్వలా చేస్తే తప్ప నేను మాట్లాడను అంటే మా అమ్మాయికి ఎంత భయమో! దేన్నైనా భరిస్తుంది కానీ నేను మాట్లాడనంటే మాత్రం భరించలేదు.
  అయితే మరి దండన కంటే ప్రేమే గొప్పదా? ఏమో!
  –ప్రసాద్
  http://blog.charasala.com

 6. పిల్లల చేత పన్లు చేయించడం ఒక కళ అనుకుంటా. అది కూడా ఆ పిల్లల మనస్తత్వాల మీద ఆధారపడి వుంటుంది. కొంత మంది చెప్పగానే వింటారు ఇంకొంతమంది కాస్త విశదీకరిస్తే వింటారు ఇంకొంత మంది విమానం మోత చూస్తే కానీ దారికి రారు. ఒక్కటి మాత్రం నిజం మెత్త గా చెబితే పనులు జరగవు.

 7. ప్రసాద్ గారి పద్ధతి చాలా సార్లు అద్భుతంగా పని చేస్తుంది. అయితే కాస్త జాగ్రత్తగా చెయ్యాలి. లేక పోతే అమ్మ దెయ్యంలా, నాన్న రెక్కలున్న ఏంజిల్ లా స్థిరపడిపోతారు. నా చిన్నతనంలో అయితే ఎంతో ముద్దుగా చూసినా కొన్ని విషయాలలో దండన కూడా వుండేది. అప్పుడు అన్నింటికీ ఏమనని అమ్మ, నాన్న ఈ ఒక్క విషయంలో రివర్సు అవుతున్నరంటే, ఇది చెయ్యకూడదేమో అని డౌటు వచ్చి మానేసినవి చాలా వున్నాయి. మరీ చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి, భవిష్యత్తు గురించి బెంగపడి కొట్టే తల్లి తండ్రులూ వున్నారు.ఆ సందర్భాలలో పిల్లలు పూర్తిగా వారి నుంచి మానసికంగా దూరమవ్వటమో, లేదా తిరగబడి పాడయిపోవటమో జరుగుతుంది. పిల్లలతో కూడా తల్లితండ్రులు ప్రవర్తించటం ఒక Art of War. 🙂 కాసేపు వాళ్లని నెగ్గనిచ్చి, ఆనక మన మాటే వారి పనిగా మార్చికోవచ్చు.

 8. మంచిపని చేసినప్పుడు మెచ్చుకోవడం చెడ్డపని చేస్తే తిట్టడం/కొట్టడం లేకపోతే ప్రభుత్వాలు కూడా నడవవు.ఎల్లప్పుడూ కొట్టాలని కాదు.మెచ్చుకోవడంలోను తిట్టడంలోను కూడా కొన్ని పద్ధతులున్నాయనుకుంటా.

  1. మన మెచ్చుకోళ్ళు మందలింపులు మాటల రూపంలోనే ఉండాలని నియమం లేదు.చాలా సందర్భాల్లో ఒక చిరునవ్వు లేదా ఒక బొమ ముడిపాటు లేదా ఒక గంభీరమైన సంజ్ఞ సరిపోతుంది.

  2. మాటల్లో మెచ్చుకున్నప్పుడు Good మంచిపని చేశావు అనాలి. “నువ్వెప్పుడూ ఇలాగే చేస్తూంటావు” లాంటి వ్యాఖ్యలకి దూరంగా ఉండాలి.

  ఇలాంటివే చాలా ఉన్నాయి. అవన్నీ రాస్తూ పోతే అదో టపా సైజుకి పెరుగుతుందని నా భయం.

 9. మీ పోస్టు చదివితే ఒక పంచతంత్రం కథ గుర్తుకు వచ్చింది. జనాల్ని విపరీతంగా కాటేసి చంపేస్తున్న ఒక పాముకు నారద ముని కనిపించి మనుష్యుల్ని కాటేయడం పాపం అనేసి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తరువాత నారదుడు వచ్చి చూస్తే..అ పాము బక్క చిక్కి శుష్కించిపోయి ఉంటుంది. దానితో చిన్న పిల్లలు ఆడుకొంటూ ఉంటారు. నారదుడు ఇదేమిటని అడిగితే..”మీరే కద మహర్షీ మనుష్యుల్ని కాటెయ్యొద్దనారు” అని అంటుంది. అప్పుడు నారదుడు చెబుతాడు ..”నేను కప్పల్ని తినొద్దన్నాను కానీ బుసకొట్టొద్దన్నానా?” అని


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: