Natural Language Processing: What it can mean to society

ఎప్పుడో ఈ టపా రాస్తా అనుకున్నా కానీ, ఇంత త్వరగా రాస్తా అనుకోలేదు. రాత్రి నా స్నేహితురాలితో జరిగిన ఓ చిన్న సంభాషణ నా చేత ఇప్పుడు ఈ టపా రాయిస్తోంది.

NLP అని పిలవబడు Natural Language Processing కి ఉపయోగం సామాన్యుడు కంప్యూటర్ వాడటం మొదలుపెట్టాకే అన్నది ఓ వాదన. ఓ NLP విధ్యార్థిని గా నా వాదన Technology ని సామాన్యుడి వద్దకు చేర్చడానికే NLP వంటివన్నీ అన్నది. NLP వల్ల ఉన్న సమాజానికి జరిగే ఉపయోగాలను ఏకరువు పెట్టడం నా అభిమతం కాదు. నేను వాటిని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భవిష్యత్ చిత్రం లో NLP Applications ఎంత ఉపయోగకరమో ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్త ఆవిష్కరణ లు చెబుతున్నాయి. NLP నా ఉద్దేశ్యం లో ఓ గొప్ప కల. అది నిజమవ్వడం ఎంత వరకు జరుగుతుందో చెప్పలేను కానీ, ఇది, దీని శాఖలు మనిషి జీవితం పై మంచి ప్రభావమే చూపగలవు.

మీరు ఓ కొత్త చోటికి వెళ్ళారు. మీకు అక్కడి భాష రాదు. ఏం మాట్లాడాలో  తెలీదు. ఆ ఊళ్ళో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అనుకుందాం. (ఛా! అలా కూడా ఉంటుందా? అనకండి. నా ఇంకో స్నేహితురాలు ఆ మధ్య ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఈ అనుభవం కూడా అయింది. ఇంగ్లీషు రాని వాళ్ళతో). NLP enabled society ఉంటే – అక్కడున్న reception system మీకు కావాల్సిన సమాచారం మీకు కావాల్సిన భాష లోకి అనువదించి చొపుతుంది. ఇంకాస్త ఊహిస్తే – మీ వద్ద ఉన్న Speech system ఆ సమాచారాన్ని చదివి కూడా వినిపిస్తుంది. ఎదుటి మనిషి తో మీరు చెప్పాల్సిన విషయాన్ని మీరు మీ speech machine కి ఇస్తే అది దాన్ని అతని భాష లోకి అనువదించి అతనికి తన “మాటల్లో” చెబుతుంది. ఇలా కామన్ భాష లేని ఇద్దరి మధ్య కూడా సంభాషణ నడవొచ్చు!!!!!

మీకు ఫలానా అంశం మీద కాస్త సమాచారం కావాలి. అది చూస్తే ఆంగ్ల భాష లో ఉన్న ఆర్టికిల్స్ లో లేదు. మీకా వేరే భాష రాదు. గూగులేమో మీరు ఆంగ్లం లో రాసిన ప్రశ్న కు ఆంగ్లం లో ఉన్న పేజీలనే ఇచ్చిందాయే. ఏం చేస్తారు? Multi-lingual search ఉంటే వేరే భాష ల పేజీలు కూడా వస్తాయి. మీక్కావలసిన సమాచారం దొరుకుతుంది. మీరు కోరుకున్న భాష లోకి అనువదించుకుని చదవొచ్చు కూడా. ఇలాంటిది ఒకటి ఉంటే బాగుండు అని ఎవరన్నా ఎక్కడన్నా అనుకోలేదూ? నేను సరిగా articulate చెయ్యలేకపోయుండొచ్చు కానీ, information exploded ప్రపంచం లో బ్రతుకుతున్న మనకు ఇలాంటి ఓ సాంకేతికత అవసరం అంతా ఇంతా కాదు.

నాకో పేద్ద అసైన్మెంటు ఉంది. ఓ 20 పేజీల వ్యాసం చదివి దాని గురించి ఓ 100 లైనులు రాయాలి. నాకా ఓపిక లేదు. హాయిగా కంప్యూటర్ కి ఈ వ్యాసాన్ని ఇస్తే అది నాకు దాన్ని summarise చేసి ఇస్తే ఎంత బాగుంతుంది? – నేనైతే ఎన్నో సార్లు అనుకున్నాను. నాకు తెలిసీ చాలా మంది అనుకునే ఉంటారు. ఎవరన్నా చేసిపెడితే బాగుండు అని. 😉

ఒకానొక సైటు చూస్తున్నారు మీరు…. దేనికోసమో. ఎవరో ఎక్కడో ఓ గూగుల్ సమూహం తరహా దానిలో మీకు కావాల్సిన విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని తెలిసింది. కానీ వాళ్ళు ఏ పోర్త్యుగీసు లోనూ ఏ రష్యన్ లోనో చర్చించుకుంటున్నారు. మీకేమో రాదు. అక్కడ ఒక page translator ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది గ్యారంటీ గా. అప్పుడు మీకు ఆ పేజీపై ఒక select list, పక్కనే translate to this language అన్న బటను కనిపిస్తే ఎలా ఉంటుంది? గంపెడు ఆశ గుండెల్లోంచి తన్నుకు రాదూ??

ఇక అసలు పైవన్నీ కాక నాకు ఈ క్షణం లో నా స్నేహితురాలు NLP ఎందుకు అన్న నా ప్రశ్నకు కొద్ది క్షణాల క్రితం ఇచ్చిన అద్భుతమైన జవాబు ఇక్కడ రాయాలనిపిస్తోంది. NLP ద్వారా మనం natural language ని model చేయగలిగితే మన గురించి, మన మనసు, మెదడు ఎలా పనిచేస్తాయో అన్న విషయం గురించి చాలా తెలుసుకోవచ్చు – ఈ ఒక కారణం చాలదా నీకు? అని ఎదురు ప్రశ్నించింది.

పొద్దున్న NLP-Applications క్లాసు లో ఒక చిన్న ఆంగ్ల వాక్యం: Mohan broke the window అన్న దాన్ని యాంత్రికంగా హిందీ లోకి తర్జూమా చేయాలంటే అందులో ఎన్ని implications ఉన్నాయో అన్న విషయం చక్కగా, కళ్ళకు కట్టినట్లు అర్థమైంది. ఈ చిన్న చిన్న వాక్యాలకే చేయలేని స్థితిలో ఉన్నాము మనం. అంటే ఈ రంగం లో చేయాల్సింది ఎంత ఉందో తెలుస్తూనే ఉంది.

చివరాఖరిగా – NLP rox!. నేనేం గొప్ప researcher ని కాదు. తడబడుతూ నడక నేర్చుకుంటునాను NLP-applications రిసర్చి అనబడు మహా సాగరం లో.  అయినా NLP కోసం నేను జీవితాంతం పని చెయ్యమన్నా చేస్తాను. ప్రస్తుతం NLP కి ప్రాణం పెట్టే దశలో ఉన్నాను నేను. అంతటి ఆకర్షణ ఉంది ఈ రంగం లో. నా జీవితకాలం లో పైన చెప్పిన కలలన్నీ తీరుతాయా అనది అనుమానమే. అయినా నేను నిరుత్సాహపడను. ఆశ నాకు జీవం. NLP అన్న మూడక్షరాలు చేయగలిగిన పనులపై ఉన్న నమ్మకం తో చెబుతున్నా ఇది. నాకు తెలుగెలా వచ్చింది? ఈ ప్రశ్న మీరెవరన్నా వేసుకున్నారా? జవాబు కరెక్టుగా NLP ఎపుడో ఒకప్పుడు చెప్పగలదు అని నా నమ్మకం. మీరేమంటారు?

Advertisements
Published in: on March 1, 2007 at 5:36 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/03/01/natural-language-processing-what-it-can-mean-to-society/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. Sowmya gaaru:

  NLP gurunchi chala baaga chepparu.. Nenu ippudu Czech Republic lo vunnanu.. rojuki enno sarlu anukuntu vuntamu vallaki english vasthe bagundu ani.

  Prapancham lo asadyamannadi emi ledu.. edo oka meerannadi jarigi teeruthundanai anipistundi.

 2. Great article !!

  “NLP ద్వారా మనం natural language ని model చేయగలిగితే మన గురించి, మన మనసు, మెదడు ఎలా పనిచేస్తాయో అన్న విషయం గురించి చాలా తెలుసుకోవచ్చు”

  ఈ వాక్యం పూర్తిగా అర్ధం కాలేదు , మన బాడీనే NLP మోడల్ గా మారిస్తే మన లంగ్వేజ్ కి మెదడు లో ఏ ఏ భాగాలు పనిచేస్తాయి !! ఎలా ప్రాసెస్ చేస్తాయి అని అర్ధమా ??

 3. nee kalalu neraveralani aasisthunnanu!

 4. Krish gaariki

  బాడీ ని కాదు. Natural language కి మనం ఒక model తయారు చేయగలిగితే – భాష కి సంబంధించి మెదడు లో భాగాలు ఏవేవి పనిచేస్తాయో తెలుసుకోవచ్చు – అన్నది నేను చెప్పదలచుకున్నది.

 5. టెక్నాలజీని సామాన్యుడి వద్దకు చేర్చడానికే NLP లాంటివన్నీ అన్న అన్న మీ వాదనతో నేను ఏకీభవిస్తాను. కానీ ఒక NLP ఎక్సుపర్టు తన మాతృభాష తనకెలా వచ్చిందో తెలియనంతకాలం కంప్యూటరుకు ఆ భాష నేర్పలేడనే నేననుకుంటున్నాను. మన మనసు, మెదడు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి NLP కాదు. అవి తెలిస్తేనే (లేదా కనీసం ఊహించగలిగితేనే) NLP ఐనా, AI ఐనా సాధ్యమౌతాయి. ఇంకోలా చెప్పాలంటే మన మెదడెలా పనిచేస్తుందో తెలుసుకొమ్మని, మనమది తెలుసుకోగలిగితే మన ముందు తను అద్భుతాలను ఆవిష్కరింపజేస్తానని AI మనల్ని తొందరపెడుతోంది. ఏమంటారు?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: