Mystery which originated in Mystery quiz

      కాలేజీ technical fest లో భాగంగా electronics quiz ఒకటి mystery అని పెట్టారు. ఇప్పుడు నా కార్యకలాపాలు కంప్యూటర్ సైన్స్ లో అయినా కూడా ఒకప్పుడు BE రోజుల్లో electronics విద్యార్థిని ని కావడం తో ఆసక్తి కలిగింది. ఎంత వరకు నాకు గుర్తు  ఉందో పరీక్షించుకుందాం అనుకున్నా. ప్రశ్నలు 20 ఉన్నాయి. 15 దాకా ప్రశ్నలు non-problems. క్లూ లు ఇచ్చి శాస్త్రవేత్త ను కనుక్కొమ్మనో, సర్క్యూట్ ఇచ్చి ఏది తప్పో కనుక్కొమ్మని, సర్క్యూట్లను గుర్తించమని, Theorems గురించి ఇలా ఉన్నాయి.

      చివర 5,6 ప్రశ్నలు typical circuit problems with diodes, transistors etc. గురించి. మొదటి పదిహేను  ఏదో ఒకలా చేయగలిగాను. నాకసలేం గుర్తు లేకపోయినా కూడా, అష్ట కష్టాలు పడి,  గుర్తున్న కాసిని విషయాల సహయంతో గూగుల్ లో ప్రశ్నలు అల్లుకుని…😉 15 పూర్తిచేసా. నాకు wheat stone bridge అన్న పేరు గుర్తు రావడానికి 10 నిముషాలు పట్టింది. Wein bridge oscillator గుర్తు రావడానికి 20 నిముషాలు పట్టింది. ప్రతీదీ పరిచయమున్నది గానే అనిపించింది. కానీ …. పూర్తిగా గుర్తు రాలేదు. కొందరిని చూస్తే ఎక్కడో చూసినట్లు ఉంటుంది కానీ… ఎక్కడో గుర్తు రాదు. అలాగే ఉండింది నా పరిస్థితి🙂

     15 ప్రశ్నలు అయ్యేసరికి నా మీద నాకే విసుగేసింది. నాలుగేళ్ళు చదివిన చదువు మరీ ఇంతలా మరిచిపోయానేంటా అని. ఇక circuit problems మొదలై ఒకటి మొదలెట్టే సరికి చిరాకే కాదు,  బద్దకం కూడా వచ్చేసింది. “ఆ ఇప్పుడు ఎవరు చేస్తార్లే!” అనుకున్నా. ఊగిసలాటల మధ్య చివరికి 15 ప్రశ్నలు మాత్రమే రాసి  submit చేసాను. పెద్ద కష్టమైన క్విజ్ ఏమీ కాదది.  సో ప్రస్తుతం చదువుతున్న వారు కాస్త ఓపిక ఉంటే 20 ప్రశ్నలకి రాసేయగలరు.
 
      ఈ అనుభవం అంతా అయ్యాక ఇప్పటికి ఓ 10 సార్లన్నా అనుకుని ఉంటాను – నాకు డిగ్రీ ఇచ్చిన కోర్సుని ఇంత తేలిగ్గా ఎలా మరిచిపోయాను అని! క్విజ్ పేరు mystery అని వాళ్ళు ఎందుకు పెట్టారో కానీ నాకో పెద్ద mystery ప్రశ్న వేసింది ఈ అనుభవం!😉
      

Published in: on February 17, 2007 at 3:13 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/02/17/mystery-which-originated-in-mystery-quiz/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. Wein bridge Oscillator, wheat stone bridge. Hmmm…
    ఈ పేర్లు నేనూ ఎక్కడో విన్నాగాని ఏమీ గుర్తుకు రావట్లేదు.
    మొన్నే ECE లో ఎంఎస్ కూడా పూర్తి అయింది.

    ఒకప్పుడు లెఁబ్లు చితక్కోట్టి, ఇప్పుడేమీ గుర్తుకు రాకపోవడం వింతగా అని పించినా…
    ఎవరో అన్నట్టు టెక్నికల్ డీటెయిల్స్ కంటే ఓ ఇంజనీరు ఆలోచించే విధానం నేర్చుకోవడం ముఖ్యం … అది తలచుకోని నేను కూడా తృప్తి పడుతున్నా…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: