Mark penny and Language study

విదేశీయులకు మన భాషలపై ఆసక్తి మనకంటే ఎక్కువేమో అని నా అనుమానం. సి.పి.బ్రౌన్, థామస్ మన్రో వంటి వారి గురించి పుస్తకాల్లో చదివాను. జె.పి.గ్విన్ తెలుగు నిఘంటువు ఉంది ఆన్లైన్ లో. ఈరోజు ఈనాడు లో Mark Penny గురించి చదివాను. ఈయన గోండు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడట. కుటుంబసమేతంగా స్థిరపడ్డాడట ఆ భాష మాట్లాడే ప్రాంతాల్లోనే. గోండు భాష లో పుస్తక రచన కూడానూ. ఆయన రాక తరువాత గోండులలో అక్షరాస్యత కూడా పెరిగిందట ఆ ప్రాంతాల్లో. అంతరించిపోతున్న భాషలకి జీవం పోయడానికి Newzealand లోని Summer institute of linguistics కృషి చేస్తోంది. అందులో భాగం గా పెన్నీ ఈ భాష ఎంచుకుని ఇక్కడికి వచ్చారట.

మొన్న నా స్నేహితురాలు, linguistics లో PG చేసిన ఒక అమ్మాయి తో ఇదే విషయం మీద చర్చ జరిగింది. తను కూడా ఇలాంటిదే ఏదో సంస్థ పేరు చెప్పింది. బహుశా ఇదే కూడా కావొచ్చు. ఆరోజు మేమిద్దరం అనుకున్నాం. ఈ ఉద్యోగాలు, ఈ జీవితం బోర్ కానీ, మనం కూడా చెరో భాష ఎంచుకుని ఆ ప్రాంతాలకు వెళదాం. ప్రకృతి ఒళ్ళోనూ ఉండొచ్చు, interesting గానూ ఉంటుంది, అని. 🙂 నాకు నువ్వు linguistics ని తెలుసుకోవడానికి సాయపడు. నేను భాష బాగా నేర్చుకోవడమే కాకుండా నీకు adminstrative పనులు కూడా చేసి పెడతా అని కూడా అన్నాను. 🙂 మేమిద్దరం సరదాకే అనుకున్నా కూడా సీరియస్ విషయమే.

మన భాషలను నేర్చుకోవడానికి వేరే దేశాలనుంచి కూడా వస్తున్నారు. మన పరిసరాల్లో అంతరించిపోతున్న భాషల కోసం మనం చేయగలిగేది ఏమన్నా ఉందా? ఒక Summer vacation లో చేయగలిగేది ఏమన్నా ఉంటే నేను చేస్తా. ఇంతకీ అదీ కథ. Hats off to Mr Penny. Hats of to all those people like Mr Penny.
దీనికి సంబంధించిన అసలు వ్యాసం, ఈనాడు లో వచ్చినది…ఇక్కడ చూడొచ్చు.

Published in: on February 16, 2007 at 3:57 am  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/02/16/mark-penny-and-language-study/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. నన్ను కూడా చేర్చుకోండి…

 2. నేనూ ఇందాకే ఈ వార్త ఈనాడులో చదివి ఆశ్చర్యపడ్డాను. తెల్లవాడు పూనుకుంటే తప్ప మనకు మన భాషాభివృద్ది పట్టదు.
  నేను ఇదే “Summer institute of linguistics” గురించి “ఒక దళారీ పశ్చాత్తాపం”లో నెగటివ్‌గా వుంది. వీరు అభివృద్ది పేరుతో గిరిజనుల్లో మంచిపేరు తెచ్చుకొని ఆ తర్వాత పాశ్చాత్య కంపెనీలు అక్కడ ఆయిల్ తవ్వకాలకు ప్రజల అభిప్రాయాన్ని అనుకూలంగా మారుస్తారని. ఆన్నిచోట్లా ఇది నిజం కాకపోవచ్చు కానీ పెద్ద ఆయిల్ కంపెనీలు (exon, mobil) లాంటివి ఈ సంస్థకు భారీ విరాళాలు ఇస్తాయట!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. పాపం మార్క్ పెన్నీ గారి కృషిని అనుమానించడం అంత బాగోదు కానీ SIL కు అయితే అంత మంచి పేరేం లేదు. ఆయనకు ఆ సంస్థ ఉద్దేశ్యాలు అర్ధమై చేస్తున్నారో లేక నిజమైన స్పూర్తితో చేస్తున్నారో చెప్పటం కొంచెం కష్టమే…

  సమ్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ గురించి ఇక్కడ చదవచ్చు
  http://en.wikipedia.org/wiki/SIL_International

 4. Don’t despise me but, may I point out that Gond is believed to be language of Australoid family? Anyway, let me join you in congratulating him..

 5. “may I point out that Gond is believed to be language of Australoid family?”
  Do you mean to say that “Gond people are Australoid”?
  Because to the best of my knowledge, Gondi language is definitely Dravidian.
  And the indigenious people of India were chiefly Australoid, then the Aryans came.
  But the topic is so flimsy and less researched that it is not worth discussing.

  Good blog
  ——–
  Raises issues like
  1) Valueing Indian languages
  2) Valueing tribal Indians
  3) Evagelists promoting languages or Christianity?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: