on Dravid and BOSS

పొదున్న ఈనాడు చదువుతూ ఉంటే రెండు ఆసక్తి కరమైన విషయాకు తెలిసాయి. రెండూ నాకు చాలా ఆనందం కలిగించిన విషయాలు. అందుకే ఇక్కడ పంచుకుంటున్నా:

1. మన ద్రావిడ్ 10000 పరుగులు దాటడం అందులో ఒకటి. ద్రావిడ్ 1996 లో ప్రపంచకప్ ముగియగానే భారత జట్టు లోకి వచ్చినట్లు గుర్తు నాకు. మొదటి సారి ద్రావిడ్ సెలెక్ట్ అయిన రోజు నుంచే ద్రావిడ్ అంటే ఇష్టం నాకు! సరిగా ఆడని తొలి రోజుల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆడతాడు – ద్రావిడ్ ఎంతైనా మంచి ఆటగాడు – అన్న అభిప్రాయం లోనే ఉండేదాన్ని! మొదట ద్రావిడ్ టీము లోకి వచ్చాడు అన్న వార్త చదివి, ద్రావిడ్ అన్న మనిషి గురించి తొలుత విన్నది అప్పుడే అయినా కూడా ఎందుకో అభిమానినయ్యాను. ఆ విధంగా నేను ద్రావిడ్ కి తొలితరం అభిమానిని 🙂

ఏమైనా నా అభిమాన ద్రావిడ్ 10000 పరుగులు వండేల్లో చెయ్యడం నాకు చాలా ఆనందం గా ఉంది. మనిషంతా ఓపిక ద్రావిడ్ కి. inspiring personality మన ద్రావిడ్ ఇలాగే ఇంకా ఎన్నో మైలురాళ్ళను చేరాలని ఆశిస్తూ …

2. ఈనాడు లోని ఈ-నాడు లొ BOSS గురించి రాసారు. Bharat Operating Systems Solutions.  C-DAC, Chennai వారిది. మన భారతీయుల ఆపరేటింగ్ సిస్టం. మన కోసం, మన వాళ్ళు చేసింది. ఇది పబ్లిక్ కోసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచుస్తూ ఉంటా ఇంక నేను! చాలా ఆనందం కలిగింది ఈ వార్త చదివాక. ఈ ప్రాడక్టు ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ,  ఇది విండోస్, మాక్ అంతటి పాపులర్ కావాలని, భారతీయ భాషల్లో లభ్యం అన్నారు కనుక, ఇది – “సామాన్యుడి” కి ఓ మంచి Tool కావాలని, మనసారా ఆశిస్తున్నాను…..

Advertisements
Published in: on February 15, 2007 at 3:20 am  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/02/15/on-dravid-and-boss/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. సీ డాకా?

    వారి తెలుగు ఫాంటులే ఇంతవరకూ ఎలా వాడాలో జనాలకు అర్తము కాక చస్తున్నారు
    విండోసు, మాక్ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఆపరేటింగు సిస్టము తయారు చేస్తే ఈ సీ డాక్ వారు మాత్రం ప్రజల డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇలా అప్పుడప్పుడు యక్ష్ యల్ షీట్లు నింపడానికి జనాల మీదకు ప్రాజెక్టులు వదులుతుంటారేమో!

  2. బాగా చెప్పారు. సీ డాక్ వారు చేసినవి అంటేనే భయంగా ఉంటుంది, వారి సపోర్టు ఇక సరే సరి. ఏ సపోర్టూ లేని OS ఇంకా నయం. గానీ చేస్తున్న ఈ పని మాత్రం నాకున్న చిరకాల వాంఛ. దేశమంతటా అన్ని రాష్ట్రాలు , విశ్వవిద్యాలయాలు ఒకే OS ని వాడాలి. అది ఒక మంచి OS కావాలి. NIC వారు తయారు చేసిన కొన్ని వెబ్ సైట్లు చూస్తే ఏడుపొస్తుంది. 12 ఏళ్ళు వయస్సు ఉన్న HTML డిజైనర్లు కూడా ఇంకా బాగా చేస్తారు. ఒకొక్క సైటు కు ఒకొక్క లాగిన్. ప్రజల సొమ్ము తగలపెడుతున్నారు. దీనికి తోడు పనికిరాని ప్రొఫెసర్లు వీరికి గౌరవ సలహాదారులు. వారికి బాగా వచ్చిన యునిక్స్ తప్పితే ఇంకేమి కనబడదు. వినబడదు. జనాల మీద రుద్దెయ్యటమే. అందువల్లనే సామాన్య జనాలకు వారు చేసినది ఏది కూడా అందదు. వారు రాస్తారు, ప్రధాని చేతుల మీద విడుదల అవుతుంది. చెత్త బుట్ట చేరుతుంది.

  3. మీరేదైన గవర్నమెంటు ఆఫీసులో కి వెళ్ళి చూడండి, NIC వాళ్ళ నిర్వాకము.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: