Contexual Comedy

ఈరోజు ఆషాకిరణ్ లో జరిగిన ఓ తమాషా సంఘటన :

ఒక పిల్లాడికి “రిపకిణి” అని రాసి ఉన్న అక్షరాలలోంచి “పరికిణి” అన్న అర్థవంతమైన పదం తేవడం నేర్పడానికి ఏవో కొన్ని పదాలు ఇచ్చి చేయిస్తున్నాము. పైన చెప్పిన “రిపకిణి” పదం వాటిలో ఒకటి. అయితే వాడు దానిని : “కిపరిణి” అని రాసాడు. కిపరిణి అంటే ఏమిట్రా? అంటే వాడు చెప్పిన జవాబు:
“కీపర్ ఉంటాడు కద టీచర్ … కిపరిణి అంటే ఆడకీపర్ అని”
నాకు నవ్వాగలేదు వాది జవబుకి.

Published in: on February 14, 2007 at 5:55 pm  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/02/14/contexual-comedy/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

  1. తెలివైన పిల్లాడు. పరికిణి అనే పదం వాడి Ocabulary లో ఇంకా చేరలేదేమో. అందుకే వాని మెదడులో ఉన్న పదాలతో ఒకటి సృష్టించాడు. Creative fellow🙂 I like him.

  2. తెలిసిన పదాన్ని చెప్పడం ఒక ఎత్తు. పదాన్ని ఊహించగలగడం.. రానారె అన్నట్లు సృజనే!
    సాధారణ తెలివితేటలకు పై స్థాయి ఇది. మీ ఆశాకిరణ్ పిల్లల చేత మంచి అభ్యాసాలు చేయిస్తున్నారు.

  3. మన ఘటోత్కచుడు అన్నట్టు ఎవరూ కనిపెట్టకపోతే పదాలు ఎలా పుడతాయి.అయినా అలాంటి పిల్లాడు ఆ మాత్రం ఆలోచించగలిగాడంటే అది ఆశాకిరణ్ [మిలాంటివాళ్ళ]గొప్పదనమే.

  4. బావుంది, చాలా బావుంది। వెయ్యండి ఆ కుర్రవాడికి ఒక వీర తాడు

  5. నవ్వాగలేదు. “కీపరిణి” మన విక్షనరీలో చేరుద్దామా?

    –ప్రసాద్
    http://blog.charasala.com

  6. దట్స్ వాటైకాల్ క్రియేటివిటీ. ఆలోచించగలిగే జ్ఞానమే విద్య అన్నారు. అలాంటి ఆలోచనలను కలిగిస్తున్న ఆశాకిరణ్ కు అభినందనలు.

  7. :):):):):)
    నిజమే రానారె అన్నట్టు, ఇంక ఆ చిన్న మెదడుల అన్ని పెద్ద పదాలు చేరలే మరి.
    పెరుగుతున్న కొద్ది అవి ఎట్లాగో ఖరాబైతయనుకోండి !

  8. పరికిణి అంటే పైటో పావడానో సమయానికి గుర్తురాక యండమూరి అంతటివాడే తప్పులో కాలేశాడు – ఆనందోబ్రహ్మలో అనుకుంటా. అలాంటి పదం చిన్నపిల్లలకేం తెలుస్తుంది? కి(కీ)పరిణి అనే పదం ఊహించడం మాత్రం గొప్ప సృజనాత్మకతే! నేను చదివిన ఒక కథలో అద్దెగదిలో ఉంటున్న బ్రహ్మచారులు ఇంటి ఓనరు దంపతులను ఓనరుడు-ఓనరిణి అని పిలుచుకుంటే వాళ్ళు వీళ్ళను గురించి వానరులనుకుంటారు!🙂

  9. 1) ఆశాకిరణ్ కి వెబ్సైట్ ఉందా
    2) వెబ్సైట్ ని తెలుగులో ఏమంటారు
    3) వారంటీరు పనిలో ఉన్నా చిన్న చిన్న ఆనందాలేమో ఇవి
    4) వారంటీరు పనిని తెలుగులో ఏమంటారు


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: