From Haasya Jyothi : part 2

“హాస్య జ్యోతి” నుండి మరికొన్ని ఆసక్తి కరమైన వాక్యాలు, వ్యాఖ్యలూ :

” అప్పు ఇచ్చిన వాడికి అడ్రస్ ఇచ్చినట్లు”
“అచ్చు వేసిన వాటినే అడిగే దిక్కు లేదంటే ఇంకో ఎడిషన్ కి ఇంట్రో రాశాట్ట!”
“తన ప్రతి వాక్కునూ వేద వాక్కుగా చెలామణీ చేసుకోవడం ఒక్క వేదం వారికే చెల్లింది.”

ఒక ఆసక్తి కరమైన విషయం: మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి బహు భాషా పాండిత్యం పై. ఓ సారి శాస్త్రి గారు విసనకర్ర విసురుకుంటూ ఉంటే ఎవరో అడిగారట – తమకెన్ని భాషలు వచ్చండీ? అని. శాస్త్రి గారు విసనకర్ర ఒక్కో రెక్క పై ఒక్కో భాష లో సంతకం చేయడం మొదలుపెట్టారంట. కాసేపటికి విసనకర్రను వెనక్కి తిప్పాల్సి వచ్చిందంట!!!!!

కందుకూరి వీరేశలింగం గారు వ్యావహారిక భాష గురించి కంకణం కట్టుకుంటే కొక్కొండి వెంకటరత్నం గారు అందుకు వ్యతిరేకం అంట. వీరిద్దరి మధ్య జరిగిన ఓ చిన్న సన్నివేశం:
కొక్కొండి గారు ఓ నాటకం రాసి అందులో వీరి గాడు అని ఓ పాత్ర పెట్టారు. అది తనను ఉద్ధేశించిందే అని అర్థమైన వీరేశలింగం గారు తానూ ఓ నాటకం రాసారు. అందులో కొండి గాడు అనే పాత్ర కి నత్తి. పేరు చెప్పడం : కొ..కొ..క్కొండి గాడు అనేలా రాసారట!

సినారె గురించి ఓ చిన్న వ్యాఖ్య ఉంది. ఎవరన్నా అర్థం చెప్పగలరు  :
“సినారే సినిమా పాట….. బుష్ షర్టు మీద బిళ్ళ మడత”

చివరగా కాళీపట్నం రామారావు గారి పై రాసిన వ్యాఖ్య తో ఇంక ముగిస్తున్నా “హాస్య జ్యోతి” నుంచి రాసిన ఈ 2 పార్టుల విశేషాలను.

“రామారావు కాళీపట్నం
రాయడమే ఓ యఙ్నం”

Published in: on February 8, 2007 at 4:32 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/02/08/from-haasya-jyothi-part-2/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. నిజమేనండీ! సినారె పాటకి ఎవ్వరయినా అర్థం చెప్పగలరు. ఇంతకన్నా మంచి పొగడ్త దొరుకుతుందా?

  2. వీరేశలింగంగారు ఆఆఆఆసం.
    “బుష్ షర్టు మీద బిళ్ళ మడత” ?? నాకూ అర్థం కాలే.
    Looks like Telugu is back from 10th class just to humble me again.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: