2 Sarath Novels

ఈ మధ్య కాలం లో బ్లాగడం తగ్గిపోయింది. ఎక్కువ టైము లేదు అన్నదానికి ఇది సూచన. ఈసారి రెండు పుస్తకాల గురించి ఒకే సారి బ్లాగడానికి కారణం మాత్రం అది కాదు. ఆ పుస్తకాలు అంతగా నన్ను ఆకర్షించలేకపోవడమే కారణం. అయినా కూడా వదలకుండా చదవడానికి కారణం శరత్ ఎందుకు అంత ప్రాచుర్యం పొందాడు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం. ఆ రెండు నవలలు : చరిత్రహీనులు, భైరవి. ఎందుకో గానీ రెంటిలో ఏదీ అంత నచ్చలేదు.

“చరిత్రహీనులు” – నవల లో చదివించే గుణం ఉంది కానీ, అంత కంటే ఎక్కువ గందరగోళం కలిగించే గుణం ఉంది. ఏ పాత్ర ఎప్పుడు ఎలా మారుతుందో, ఎందుకు ఒకలా ప్రవర్తిస్తుందో చెప్పడం కష్టం. అడుగడుగునా … ఈ పాత్రల ప్రవర్తనల మర్మం అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కిరణ్ పాత్ర అద్యంతమూ ఈ తరహా confusion ని ఎన్ని సార్లు కలిగించిందో చెప్పడం కష్టం. ఇక చరిత్రహీనులు ఎంతమంది ఉన్నారో అర్థం కాలేదు. ఏమో! ఈ పాత్రల చిత్రణ అర్థం చేసుకునేంత తెలివి తేటలు లేవేమో నాకు… అది కూడా కారణం కావొచ్చు. పాఠకులను ఇంత గందరగోళానికి గురి చేయ్యడం లో ఉద్దేశ్యం ఏమిటో మరి. ఈ నవల మొత్తానికైతే నాకు వస్తువు పరంగానూ, పాత్రల చిత్రణ ల పరంగానూ, కథనం పరంగానూ – ఏ విధంగానూ నచ్చలేదు. ఏదో జరిగి నన్ను ఆకర్షిస్తుంది ఏమో అని చివరిదాకా చదివాను. అయినా ఏమీ కనబళ్ళేదు. 😦

ఇక భైరవి నవల. సుమారు గా ఉంది. కాస్త స్రద్ధ పెట్టి చదివితే మరింత బాగా అర్థం చేసుకునే దాన్ని అనుకుంటా దీన్ని. భైరవిణుల జీవితాలు, గ్రామీణ బెంగాల్ వాతావరణమూ, జమిందారీ వ్యవస్థా, మనుష్యుల మధ్య relationships ఇంకా ఎన్నో సామాజిక అంశాలు చాలా బాగా చిత్రీకరించారు. కానీ, ఇందులో కూడా కాస్త గందరగోళం కలిగించే స్వభావం ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే పాత్రల ప్రవర్తన అర్థం చేసుకోడానికి వారిలోకి పరకాయ ప్రవేశం కాస్త effort తీసుకుని చేస్తే ఈ గందరగోళం ఉండకపోవచ్చు. కానీ, అలా అంటే ఈ రచనలు సామాన్య మానవుడి కోసం కాదు అనుకోవాల్సి వస్తుంది, which is wrong, given the popularity of Sarath. సో, నా విశ్లేషణ కు అందడం లేదు అని చెప్పగలను.

మొత్తానికైతే పథేర్ దాబి చదివిన రోజు శరత్ ని ఒక ఎత్తులో ఊహించుకున్న తరువాత “శ్రీకాంత్”, కొంత వరకు “పల్లి సమాజ్” మినహా  ఏవీ అంత ఆకర్షించలేకపోయాయి. సినిమాలుగా బానే ఉన్న నవల్లు కూడా అసలుకైతే అంత నచ్చలేదు చదువుతూ ఉంటే. విచిత్రం ఏంటి అంతే నాకు నచ్చిన 3 నవల్లూ ఆంగ్ల అనువాదాలు. ఇవన్నీ తెలుగు అనువాదాలు. అనువాదం అన్న కళ గురించి చాలా ప్రశ్నలు ఉదయించాయి వరుసగా బ్.శివరామక్రిష్ణ గారి శరత్ అనువాదాలు చదువుతూ ఉంటే. అవి clarify చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నా. అవగానే నేను తెలుసుకున్న విషయాల గురించి బ్లాగుతా. ఒక్క ముక్కలో చెప్పాలంటే “పథేర్ దాబి” కలిగించిన తరహా “విప్లవ” భావాలని కానీ, “శ్రీకాంత” రేపినంత curiosity ని కానీ ఎ రెండు నవల్లూ కలిగించలేకపోయాయి. కొంతవరకూ మెలొ డ్రామా, ఇంకా గందరగోళం మాత్రం కలిగించాయి.

అన్నట్లు చెప్పడం మరిచాను – “భారతి, భైరవి” అన్న రెండు నవల్లనూ విశాలాంధ్ర వారు ఓ సంపుటి గా వేసారు. అందులో భారతి నే పథేర్ దాబి నవల.

Advertisements
Published in: on January 3, 2007 at 2:29 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/01/03/2-sarath-novels/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. సౌమ్య గారూ,

    శరత్ని నేను చదివి దాదాపు పాతిక సంవత్సరాలవుతుంది. అప్పటికి ఆయన సాహిత్యవంతా, అసంపూర్తి కథలతో సహా చదివే అవకాశం నాక్కలిగింది. ఐతే వయసు మీరిపోయి (నిజంగానేనా), తల నరసిపోయిన(నిజంగానే) ఈ వయసులో నా కప్పుడు చదివిన వన్నీ పూర్తిగా గుర్తులేవు. ఒక్క శ్రీకాంత్ తప్ప. దాన్ని ఎన్ని వందల సార్లు చదివేనో, ఇప్పటికీ మరలా, మరలా ఎన్ని సార్లు చదివుతానో! అందువలన నా ఈ కామెంట్ శరత్ అంటే వున్న పాత గుర్తుల గుడ్డి ఇష్టం వలనే కూడా అయ్యుండొచ్చు.

    ““చరిత్రహీనులు” – నవల లో చదివించే గుణం ఉంది కానీ, అంత కంటే ఎక్కువ గందరగోళం కలిగించే గుణం ఉంది. ఏ పాత్ర ఎప్పుడు ఎలా మారుతుందో, ఎందుకు ఒకలా ప్రవర్తిస్తుందో చెప్పడం కష్టం.”

    నిజ జీవితంలో మన ప్రవర్థన కూడా ప్రతి సారీ ఒక మూసలో, వొక సాధారణ లాజిక్ కీ అణుగుణంగా, ఒక లీనియర్ గణిత సమీకరణంలాగా వుండదు కదా. అర్థాంతరంగా, అద్భుతంగా (మంచి గానీ, చెడు గానీ) మారిపోయే ఖయటిక్ ప్రోసెసే కదా జీవితం.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  2. paapam artha kaaka pothe em chedda mana telivi inthe ani sardu kovadame


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: