Santhi madam Jindabad

        శాంతి మేడం IIIT లో ఒక Maths అధ్యాపకురాలు అని మాత్రమే తెలుసు నాకు ఇక్కడ చేరిన కొత్తల్లో. క్రమంగా నేను ఆషాకిరణ్ కు వెళ్ళడం మొదలుపెట్టాక ఆవిడ ఎంత ఓపిగ్గా పిల్లలకు పాఠాలు చెబుతారో చూస్తూ చూస్తూ ఆమెని నాకు తెలీకుండానే అభిమానించడం మొదలుపెట్టాను. గత వారం ఆమె ఏదో పని మీద సెలవు పై వెళ్ళారు. అప్పుడు గానీ తెలిసి రాలేదు నాకు అసలు కథ.
       ఆవిడ తో పాటు చాలా మంది వాలంటీర్లకు ఏవో పనులు ఉండడం తో ఈ వారం లో shortage వచ్చింది. దానితో నేను  మామూలు లా వారానికి ఓ రోజు కాకుండా వీలైనన్ని రోజులు వెళ్ళాలి అనుకుని అలాగే వెళ్ళడం మొదలుపెట్టాను. రెండో రోజే తెలిసొచ్చింది. పగలు మన పనులు చేసుకుంటూ,  సాయంత్రం నాలుగు కాగానే ఇంకో మేడం ఇంటికి వెళ్ళి, ఆరోజు చేయాల్సినవి ఏంటో కనుక్కుని, ఎవరికి ఏ exercises ఇవ్వాలో తెలుసుకొని ఆ రోజు పొరపాటున వాలంటీర్ల కొరత ఉంటే … multi-tasking చేస్తూ విజయవ్నతంగా స్కూలు ముగించి మళ్ళీ ఈ పిల్లల పేపర్లన్నీ పట్టుకెళ్ళి ఆ మేడం కి ఇచ్చి ఆ రోజుటి స్కూలు గురించి snippets చెప్పడం నేను అనుకున్నంత తేలిక కాదని.

     అనుకున్నట్లు గానే వారం లో అన్ని రోజులూ వెళ్ళాను. వెళ్ళాక గానీ తెలీలేదు శాంతి మేడం కి ఎంత ఓపికో. నేనేం గొప్ప ఓపికున్న మనిషిని కాదు.  కోపం కొడా కాస్త ఎక్కువే. అయినా కూడా ఈ పిల్లల మధ్య కొపగించుకోలేదు … లేదా అలా ఉండడానికే ప్రయత్నించాను.  ఆ ప్రయత్నం లొ ఈ వారం నాకు మిగిల్చిన మధురానుభూతుల్ని పక్కన పెడితే – శాంతి మేడం నా  దృష్టి లో ఓ గొప్ప లెవెల్ కి ఎదిగిపోయారు ఈ వారం అనుభవం తో. నిన్న నా 5వ consecutive day to AK.  నేను ఉండలేకపోయాను. చాలా కష్టపడినట్లూ, ఈరోజుకి ఇంత మంది పిల్లల్ని manage చేయలేను అన్నట్లూ అనిపించింది. కాస్త విశ్రాంతిగా కూర్చుందాం అనుకున్నా…        

      ఈ మధ్య కాలం లో విపరీతంగా పెరిగిపోయిన కోర్స్ వర్కే దీనికి కారణం. రోజులో ఆ పనికి తప్ప దేనికీ సమయం లేని ఈ రోజుల్లో రోజుకి 2.5 గంటలు AK మీద invest చెయ్యడం కష్టమే కద మరి. నాకు నాలుగు రోజులకే ఇలా అనిపించింది అంటే – ఆవిడ నాకు తెలిసీ రోజూ వస్తారు. ఇల్లు, పిల్లలు, కాలేజీ ఇలా సవా లక్ష పనులు ఉన్న ఆమె పరిస్థితి లో నేను గనుక ఉండి ఉంటే – పారిపోయి ఉండేదాన్ని. 🙂

       శాంతి మేడం కి అసలు చిరాకు రాదు అనుకుంటా. 🙂 అప్పుడప్పుడూ కాస్త … చాలా కాస్త కోపం ఐతే చూసాను. పిల్లలు విపరీతమైన అల్లరి చేసినప్పుడు అది కూడా. ఓ నేస్తం తో జరిపిన సంభాషణ వల్ల నేను 24 గంటల్లో నేను చెయ్యడానికి ఎన్ని పనులు ఉన్నాయో తెలుసుకుని … టైం లేదు అన్న మాటని నా డిక్షనరీ నుంచి తొలగిద్దామని అనుకున్నాక ఈ AK వారం జరిగింది. శాంతి మేడం ని చూసాక దానికి ప్రత్యక్ష రూపం అనిపించింది. శాంతి గారు జిందాబాద్ 🙂
    

Advertisements
Published in: on December 23, 2006 at 12:18 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/12/23/santhi-madam-jindabad/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. nijam gane aavida chala great andi.anni panulu ceastuu kuudaa peruku taggattu saamtam gaa vumdadam aneadi nijam ga goppa vishayam


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: