datta

 ఆ మధ్య మూడు రోజుల్లో మూడు శరత్ నవల్లు చదివా. ఇది మూడోది వాటిలో. సమయాభావం వల్ల అప్పుడు బ్లాగలేక ఇప్పుడు బ్లాగుతున్నా….. .🙂 ఇది చదువుతూండగానే మొదటి 10 పేజీలు అయ్యే సరికే అర్థం అయింది – “వాగ్దానం” సినిమా అని…..అలాగని పుస్తకాన్నే సినిమా గా తీసారని కాదు. మూల కథ దత్త నవల. కానీ, సినిమా కథ లో కొన్ని మార్పులు ఉన్నాయి అనుకుంటా… అది వాగ్దానం సినిమా అని అయితే గుర్తించా కానీ, ఆ సినిమా నే నాకు సరిగా గుర్తు లేదు కనుక ఎక్కడెక్కడ మార్చారో చెప్పలేను. ఆచార్య ఆత్రేయ దర్శకత్వం వహించారు అని మాత్రం తెలుసు.

కథ – ముగ్గురు స్నేహితులుంటారు. ఒకాయనకు కూతురు (విజయ) ఇంకా ఇద్దరికి ఒక్కో కొడుకూ. విజయ తండ్రి చనిపోతూ, విజయ బాధ్యత ను తన స్నేహితుడు రాసబిహారీ కీ, అతని కొడుకు విలాస్ కీ అప్పజెప్పుతాడు. చనిపోతూ ఇంకో స్నేహితుడు, తన దగ్గర అప్పు చేసి తీర్చకుండానే చనిపోయిన జగదీశ్ బాబు కొడుకు దగ్గర్నుండి ఆస్థి లాక్కోకుండా ఉండడానికి ప్రయత్నించమనీ చెప్తాడు. జగదీశ్ బాబు కొడుకు నరేంద్రుడు విదేశాల్లో మెడిసిన్ చదివిన వాడు.

తనకొడుక్కీ, విజయ కీ పెళ్ళిచేసి పెత్తనం చెలాయించాలన్నది రాసబిహారీ ఆశయం. విజయ నరేంద్రుని కలిసే వరకూ ఈ పెళ్ళి కి సుముఖత ఉన్నా లేకున్నా విముఖత అయితే చూపదు. కానీ, నరేంద్రుని పరిచయం ఆమెలో కాస్త మార్పు తెస్తుంది. అసలు ఆ పరిచయమే విచిత్రంగా ఉంటుంది. వాళ్ళిద్దరి పెళ్ళి తో నవల ముగుస్తుంది. అయితే పరిచయానికి, పెళ్ళి కి మధ్యలో వాళ్ళలోని అంతః భావాల కు అక్షరరూపమే ఈ నవల అని చెప్పొచ్చు.

ఈ నవల శైలి ప్రధానంగా feeling లే ఆలంబన గా సాగింది అనిపించింది. అయితే ఆ భావాలు అవి అన్నీ కూడా చాలా చక్కగా, చదువరులు కూడా అనుభవించేలా రాసారు. మనసు, మనోభావాలే ప్రధానంగా సాగుతుంది కథ. ఆత్రేయ గారు దర్శకత్వం వహించడానికి దీన్ని ఎన్నుకున్నారంటే ఆశ్చర్యం లేదు… మనసు కవి కదా…

పర్వాలేదనిపించే నవల. కానీ ఆ మనోభావాల వర్ణన మాత్రం అద్భుతం.

Published in: on December 18, 2006 at 2:37 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/12/18/datta/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. Vagdhanam cinema ante relangi oka burra katha vinipistadu . Karunasri Jandhyala Papayya sastri/ Sri sri rasina oka padyam vinipistadu .. aa cinema nenaa?

  2. దాదాపు పూర్తిగా శ్రీశ్రీయే రాసిన ఈ “హరికథ” లో చివరి కంద పద్యం పోతనది, అంతకు ముందుది కరుణశ్రీది.

  3. Oops harikatha kada burra katha anesa😀

  4. Nuvvu Halley madri english lo blog chesstava ??? if so send a mail to me ! i cant understand 1 bit of what u have written !!

  5. Namaskaaram. Have you read any of adavi bapiraju’s novels?? Enjoyed reading your blogs…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: