నిష్కృతి

 నిష్కృతి శరత్ బాబు రాసిన నవలల్లో ఒకటి. ఇది కూడా 50 పేజీల చిన్న నవల కావడం తో చదవడానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఇది కూడా మరీ అంత బాలేదు కానీ, బడిదీది మీద కథనం బాగుంది. ఈ నవల ఆధారంగానే తెలుగు లో “తోడికోడళ్ళు” అన్న సినిమా వచ్చింది. కానీ, సినిమా కి నవల కి చాలా తేడా ఉంది కథలో. అందుకనే సినిమా బాగా వచ్చింది.

      తెలుగు లో రాసిన ఈ టపా చదివేది తెలుగువాళ్ళే కనుక కథ గురించి చెప్పనక్కరలేదు అనుకుంటా…. అంత పాపులర్ సినిమా కదా మరి తోడికోడళ్ళు! నా సందేహమల్లా – కథాంశం జీవితానికి దగ్గరగా ఉన్నా కూడా, ఎందుకు ఈ నవల అంత ఆసక్తికరంగా అనిపించలేదా అనే. నవల్లో బాగా రాసిన భాగాల్లో నాకు సిద్ధేశ్వరి, నయనతార,శైల లు కనబళ్ళా. కన్నాంబ,సూర్యకాంతం,సావిత్రులే కనిపించారు. గిరీషుడు ఎలా ఉంటాడో నాకు తెలీదు కానీ, ఆ పాత్ర వచ్చినప్పుడల్లా, ఎస్వీ రంగారావే కనిపించాడు.

       పుస్తకం ఆద్యంతమూ సహజంగా, ఆకర్షణీయంగా నే ఉంది. కానీ, చివరకు వచ్చేసరికే ఆ ఆసక్తి పోయింది…. ముగింపు ఏమాత్రం బాలేదు. హడావుడిగా ముగించినట్లు అనిపించింది. బహుశా సినిమా చూసాక పుస్తకం చదివినందువల్ల కావొచ్చు. 

Advertisements
Published in: on December 6, 2006 at 1:48 pm  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/12/06/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. aa navala neanu cadavaleadu kaani aa movie antea naaku istam.bahusaa nati natula adbhuta natana valla anukumtaa…..aa cinema baagundi navala nachakapoavadaaniki kaaranam

 2. సౌమ్య గారూ,
  సాలెగూడు సంచారంలో మీ జాబుల తీగ ఇప్పుడే కాలికి తగిలింది. అడావుడిగా చేతికి దొరికినవి గబగబా చదివాను. అన్నిటికీ కలిపి ఇక్కడే ఓ ముక్క రాస్తున్నాను.
  మీకు పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ మంచి టేస్టుంది. చక్కగా విశ్లేషించి రాసే శక్తుంది. చాలా సంతోషం.
  సినిమా పారడీజో నా all time favs లో ఒకటి.
  నిష్కృతి నవల చదవలేదు కానీ తోడికోడళ్ళు సినిమా ఈ మధ్యనే (నాలుగైదు నెలల కింద) చూశాను. చాలా అసహ్యం వేసింది. ఆ సినిమాలో పాటలు తప్ప పాత్రలూ, కథనం, చెప్పిన సందేశం ఏవీ నచ్చలేదు నాకు. మీ బ్లాగు చదివాక మీరు చూసిందీ ఆ సినిమాయేనా అని డౌటొచ్చింది.
  సీతారామశాస్త్రి కథల గురించి – మీరు చాలా మంచిగా రాశారింకా. అతను పేరున్న సినీ కవి కాకపోతే ఆ పుస్తకాన్నీ అందులో కథల్నీ ఎవరూ పట్టించుకునే వారు కారు. చెత్త అనను కానీ మంచి కథలు మాత్రం కావు.
  కొకు, నవీన్ పుస్తకాల టపాలు ఇంకా చదవాలి.
  శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు చదివారా? వీలైతే చూడండి.
  ఇప్పటికింతే.

 3. miiru kotta toadikodallu cinema chusi vuntaru.adi anta baagodu @kotta paali

  mii vivaranaki[personal mes ki] dhanyavaadalu.@soumya

 4. No, no, I saw the SVR/Kannamba, Relangi/Suryakantam, ANR/Savitri starrer, that was based loosely on Nishkruti novel.
  Two really beautiful scenes are a) kite flying song and b) dasara celebration song. Other songs are good too. The movie was crap, IMHO.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: