Badi didi

“బడిదీదీ” – బెంగాలి రచయిత, భారతీయ సాహిత్యం లో చిరకాలం నిలిచిపోయేంత స్థాయి కలిగిన వాడూ అయిన శరత్ చంద్ర చటోపాధ్యాయ అనబడు శరత్ బాబు నవల. “బాటసారి” సినిమా గా తీయబడింది తెలుగులో. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం లో. నేను మొదటి శరత్ నవల చదివి 2 ఏళ్ళు అయింది అనుకుంటా. ఈరోజు మధ్యాహ్నం చదివిన ఈ బడిదీదీ 5 వ నవల. గత అనుభవాలతో శరత్ రచనా శైలి మీద ఏర్పరుచుకున్న అభిప్రాయాలకు తగినట్లే ఉంది ఈ నవల.

కథాంశం విషయానికొస్తే సురేన్ బాబు కథానాయకుడు. పరాన్న జీవిలా బ్రతకడానికి అలవాటు పడిపోయిన వాడు. అస్తమానం ఎవరో ఒకరు పనులు చేసిపెట్టడానికి ఉన్నందుకో ఏమో గానీ … తన పనులేవీతాను చేసుకోలేడు. కాస్త పరధ్యానం కూడా ఎక్కువే. ఒకానొక సంధర్భం లో ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. మన కథ కు మొదలు అక్కడ.

అలా కలకత్తా నగరం చేరి అక్కద వ్రజ బాబు గారి ఇంట్లో వాళ్ళ చిన్నమ్మాయి ప్రమీల కి చదువు చెప్పే పనికి కుదురుతాడు. ప్రమీల అక్కే బడిదీది గా అందరిచేతా పిలువబడు మాధవి. పెళ్ళి అయిన కొన్నాళ్ళకే వితంతువై పుట్టింటి కి వచ్చి ఒక విధమైన స్తబ్దత లోనూ, disorder లోనూ ఉన్న పుట్టింటి లో తన నేర్పరితనం తో, మంచి తనం తో మళ్ళీ వెలుగులు నింపిన అమ్మాయి. ఈ అమ్మాయి కి బాధ్యతలు తీసుకోవడం జీవితం లో ఓ భాగం.

ఆ ఇంట్లో అన్నీ ఆమె చేతుల మీదుగానే. మేష్టారు కూడా తెలీకుండానే ఆమె ద్వరానే తన పనులు చేయించుకుంటాడు. అతను అసమర్థుడు అని ఎరిగిన మాధవి తాను కూడా ఏమీ అనుకోక పనులు జరిపిస్తూంటుంది. వీరు ఇద్దరి మధ్య ఒకరికొకరికి మాటల పరిచయం పెద్దగా లేకున్నా కూడా ఇద్దరి మధ్య ఓ అవ్యక్తమైన అనుబంధం అభివృద్ధి చెందుతుంది. స్నేహమూ కాదు, ప్రేమా కాదు. అదో అనుభూతి…అంతే.

సరే .. ఒకానొక సందర్భం లో సురేన్ ఆ ఇల్లు వదిలి వచ్చేసి ఓ ప్రమాదానికి గురౌతాడు. ఆ సమయం లో సురేన్ తండ్రి అతన్ని వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోతాడు. సురేన్ కి పెళ్ళి అవుతుంది. మాధవి సురేన్ అలా అర్థాంతరంగా వెళ్ళిపోవడాన్ని హర్షించలేకపోతుంది. 5 ఏళ్ళు గడుస్తాయి. సురేన్ ఇప్పుడు జమిందారు సురేన్. స్వతాహాగా మంచి వాడే అయినా కూడా తన అసమర్థత ని ఆసరా గా తీసుకున్న తన కింద పని చేసే వాళ్ళ వల్ల సురేన్ కి మహా క్రూరమైన జమిందారు అన్న పేరు వస్తుంది.

మధవి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన భూమిని సురేన్ మనిషి కి లంచం ఇచ్చి కాజేస్తాడు దానిపై కన్నేసిన చటర్జీ. మాధవి కి జమిందారు ఎవరో తెలిసినా, తాను చూసిన సురేన్, ఇతనూ ఒకరు కారు – సురేన్ లో ఈ మార్పు చూడలేను అన్నట్లు తిరుగు ప్రయాణమౌతుంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్న సురేన్ విషయం గ్రహించి – బడిదీది కోసం పర్గెత్తుతూ వచ్చి పడిపోతాడు. బడిదీది ఒడిలో  తలవాల్చడం తో కథ ముగుస్తుంది.

45 పేజీలున్న నవల…చిన్నది. మొత్తానికి, నాకంతగా నచ్చలేదు. శరత్ నవలల్లో నాకు రెండు రకాల వి కనిపించాయి. పాత్రల చిత్రణ లో  ఈ రెండు రకాల్లోనూ పెద్ద తేడా లేదు కానీ, పుస్తకం ఆద్యంతమూ చదివించే తరహా లో ఐతే  ఉండవు ఈ రెండో రకం వి. బడిదీది ఈ రెండో రకం ది, నా అభిప్రాయం లో. ఈ నవల కాస్త పెద్దది అయి ఉంటే బోరు కొట్టేసేది అనడం లో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం లోనే నేను కాస్త ఆశ్చర్యానికి గురైయాను….. Pather Dabi   లాంటి నవలనూ, బడిదీది లాంటి నవలను ఒకే శరత్ ఎలా రాసాడా అని 🙂

Advertisements
Published in: on December 5, 2006 at 4:04 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/12/05/badi-didi/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. happens le .. nuvvu raasina kathalu kooda anni okelaaga untaaya cheppu [:p]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: