Vanijayaram,Vennelakanti & Andhraprabha

నా మెంటర్ తో మీటింగ్ ఉందని వెళితే ఆయన ఓ అరగంట తరువాత వస్తారని చెప్పారు. అందుకని, కాసేపు పేపర్లు తిరగేద్దామని లైబ్రరీ కి వెళ్ళాను. అక్కడ ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం కనబడ్డది. ఇందులో అప్పుడప్పుడూ ఆసక్తి కరమైన వ్యాసాలు కనబడ్డం చేత ఈసారి ఎముందో అని చూసా. కొన్ని విషయాలు తెలిసాయి.

ఈరోజు మన సినీ రచయిత వెన్నెలకంటి గారిదీ, ప్రముఖ గాయని, మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న వాణీ జయరాం గారిది పుట్టిన రోజట. ఆ వ్యాసం వెన్నెలకంటి గారి మీద స్పెషల్ వ్యాసం. ఆయన జీవితం గురించి రాసారు. అంటే – చిన్నప్పుడు అమ్మ పాడుకున్న పాటల ద్వారా సాహితీ పరిచయం కలిగి, చిన్న వయసు లోనే కవిత్వం మొదలుపెట్టి, తరువాత బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సినిమాల్లో స్థిరపడేదాకా.

డబ్బింగ్ సినిమాలకు ఎన్నింటికో నేను వెన్నెలకంటి పేరు చూసా – మాటలు,పాటలు సెక్షన్ లో. అయితే, నాకు ఇష్టమైన పాటల్లో ఒకటైన – “మాటరాని మౌనమిది: పాటను రాసింది ఈయనే అని ఇప్పటివరకూ తెలీదు నాకు 🙂 దీన్ని ఏదో అలంకారం అంటారంట. ఒక లైను లోని ఆఖరి పదం తో రెండో లైను మొదలుపెట్టడం…. “మాట రాని మౌనమిది..మౌనవీణ గాన మిది…. ” అలా అన్నమాట. ముక్తగ్రస్తాలంకారం అనో ఏదో రాసి ఉండింది. గుర్తు రావడం లేదు పేరు 😦 2500 పాటలు రాసారంట ఈయన. నాకు నచ్చిన మరో పాటలో “సరిగమలు మారినా…మధురిమలు మారునా?” అన్నది ఈయనేనట (బృందావనం సినిమా లో). ఈయన పాటలకీ, వెన్నెల అన్న పదానికి సంబంధం ఆసక్తికరం.

ఇక వాణీ జయరాం గారి పుట్టిన రోజు కూడా అట. “కొండా కోనల్లో, లోయల్లో..” పాట గుర్తు వస్తుంది నాకు ఆమె పేరు వింటే..ఎందుకో గానీ. మా అమ్మ ఇదివరలొ “బొలరే పపీ హరా” అని ఓ పాట హం చేస్తూ ఉండేది. ఆ పాట నిజం పాట అనుకోలేదు నేనెప్పుడూ. ఏదో మా అమ్మ కనిపెట్టింది అనుకున్నా…. కొన్నాళ్ళ క్రితం వాని జయరాం గాత్రం లో వినేవరకూ 🙂

మొత్తానికి ఈ రెండూ చెప్పి ఈ విషయాలు చెప్పిన “ప్రభ” ను తలుచుకోకపోవడం అన్యాయం అవుతుంది. చిన్నప్పుడు పేపర్ అంటే “ఆంధ్ర ప్రభ” నే నాకు. మా ఇంట్లో అదే వచ్చేది “హిందూ” కాకుండా. 4వ తరగతి లో ఉన్నప్పుడు చిన్నపిల్లల సెక్షన్ లో ఓ వ్యాసం నాకు నచ్చి వాళ్ళకి ఓ కార్డు ముక్క రాస్తే దాన్ని వేసుకున్నారు కూడా…. 🙂 కాస్త పెద్దయ్యాక వీరి వారపత్రిక లోనే ఓ వీర కాపీ కథ వేసేసరికి ఉత్తరం రాసాను. అప్పుడు సాక్షాత్తూ ఎడిటర్ గారే జవాబు రాసారు – “ధన్యవాదాలు” తెలుపుతూ…. (కాపీ విషయం చెప్పినందుకు). ఆ ఉత్తరం భద్రంగా దాచుకున్నా….. 5 ఏళ్ళు అయింది అది వచ్చి. 4వ తరగతి అప్పటి ప్రభ పుస్తకం దాచుకోలేదు అనుకుంటా… 🙂

ప్రభ ప్రభ తగ్గడానికి కారణాలేంటొ నాకు తెలీదు. అప్పట్లో ప్రభ మానేసి మా ఇంట్లో ఈనాడు ఎందుకు మొదలుపెట్టారో కూడా తెలీదు కానీ, ప్రభ పాఠకులు ఎక్కువమంది లేరు అని మాత్రం అర్థమౌతోంది. Anyways, Happy Bday Vennelakanti RajeswaraPrasad gaaru and Vani Jayaram gaaru! మన ఆంధ్ర ప్రభ ఇలాగే మంచి వ్యాసాలు వేస్తూ ఉండాలని ఆశిస్తూ…….

Advertisements
Published in: on November 30, 2006 at 8:21 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/11/30/vanijayaramvennelakanti-andhraprabha/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. vennelakanti manchi pratibha unna kavi. ayinaa raavalasina anta peru raaledu anipistundi. veturi, atreya ante iiyanaki chaalaa ishtam ani chadivaanu ekkado.

  aasaktikaramaina vyaasam. baagundi!

 2. naaku chinnapudu em paper vocchedo gurthuledu kaani.. ee madya intlo ento eenadu meeda revolution chesesi andhra jyoti theppisthunnaru.

 3. నాకు తెలుగు లొ రాయడం వొచ్చేసిందొచ్!! లేఖిని సూపర్.

 4. మీ బ్లాగు చాలా బాగుందండి సౌమ్యగారు (ఫైర్ఫాక్సలో కూడా 🙂
  మీ తెలుగు చాలా బాగుంది. నేను అలా రాయగలగడానికి చంపగలను.
  (I can kill to be able to write like that – అను దానికి తెలుగు అనువాదం, చూసారా నా తెలుగు ఎంత వీకో 🙂
  మీ బ్లాగుకు సబ్స్క్రైబ్ (సబ్ స్క్ రైబ్) చేయడానికి లంకె తెలుపగలరు.
  అప్పటి వరకు బుక్-మార్క్ చేసుకుంటా..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: