Wiki Jindabad!

వికీ నాకు కాస్త భిన్నమైన విధానం లో ఉపయోగపడింది. వికీ కి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అనుకోకుండా ఉండలేకపోయా నేను 🙂 మామూలుగా అందరూ వికీ ఎందుకు ఉపయోగిస్తారు? ఙానసముపార్జనకో, సందేహనివృత్తికో అని అంటారా? అక్కడే నేను కొత్త దారిని కనిపెట్టినది. అంటే – కొత్తదేం కాదు : నాకు కొత్తది. అంతే.

నా NLP course project లో భాగంగా Machine Learning పద్ధతులు ఉప్దయోగించాల్సి వచ్చింది. దానికి మరి మన కంప్యూటరు కి కాస్త Training ఇవ్వాలి కదా .. అందుకు దేటా కావాల్సి వచ్చింది. ఇదంతా గందరగోళంగా ఉందనుకుంటా – కాస్త విడమర్చి చెప్తా ఉండండి. Machine Learning అన్న పేరు బట్టి కాస్త అర్థమయ్యే ఉంటుంది కదా : అంటే కంప్యూటర్ కి పాఠాలు చెప్పడం. దానికి Training ఇవ్వడం. అలా ఇస్తే అది కొన్ని టెక్కునిక్కులు ఉపయోగించి ఙానం సంపాదిస్తుంది. కంప్యూటర్ కి తెలివి తేటలు ఆపాదించే విధానాల్లో ఇదీ ఒకటి అని అర్థం చేసుకుందాం ఇప్పటికి.

విషయానికొస్తే నా ప్రాజెక్టు లో ఇలా ట్రైన్ చెయ్యడానికి చాలా మంది వ్యక్తులకు సంబందించిన – వ్యక్తిగత,ఆర్థిక,విద్యా సంబంధమైన మరియు ఇతర వ్యవహారాల గురించిన సమాచారం కావాల్సి వచ్చింది. ఎలా రా దేవుడా అనుకుంటూ ఉండగా వికీ తట్టింది ఆలొచనల్లో. వెంటనే వికీ పై మెరుపు దాడి చేసాను. List of Billionaires అని ఓ పెద్ద లిస్టూ, List of Enterpreneurs అని మరో పెద్ద లిస్టూ కనిపించి, నా పనిని పూర్తి చేసాయి. 😉

ఇక్కడ విషయం ఏమిటి అంటే – నేనెంత mechanical గా వికీ పేజీలను తిరగేస్తూ కావాల్సిన వాక్యాలు కాపీ-పేస్టు చేసుకున్నా కూడా, చాలా విషయాలు నా దృష్టి లో పడ్డాయి. కోడాక్ పుట్టుకా, ఈస్ట్మాన్ చిన్న తనమూ, ఒకప్పుడు డిస్నీ లోంచి తొలగింపబడిన John Lasseter ఇప్పుడు డిస్నీ-పిక్సార్ విలీనం తరువాత పెద్ద పదవి కి రావడమూ, The Difference Between God and Larry Ellison : అని జీవిత చరిత్ర రాసుకున్న ఒరాకిల్ అధినేత గురించీ, మెక్డొనాల్డ్స్ పుట్టుక గురించీ, అండ్రూ కార్నెగీ జీవితం లోని కొన్ని విచిత్రాలు, ఓటిస్ లిఫ్టు కంపెనీ స్థాపకుడు ఓటిస్ కథా, ఒకటా..రెండా … ఎన్నని చెప్పను? 🙂

ఎందరివో జీవితాల దారుల వెంట కళ్ళకు గంతలు కట్టుకుని నడిచిన భావన కలిగింది. ఎన్నో విషయాల గురించి అప్పుడోటీ ఇప్పుడోటీ అక్కడోటీ ఇక్కడోటీ ఎన్నెన్నో కబుర్లు చెప్పింది వికీ – ఓ పక్క నా పని ని జరిపిస్తూనే. తెలుకునీ, తెలుకోక – సగం సగమే విన్నా కూడా మంచి అనుభవమే. స్వామి కార్యమూ, స్వకార్యమూ – రెంటినీ వికీ భుజానేసుకుంది. వికీ జిందాబాద్!! 🙂

Advertisements
Published in: on November 29, 2006 at 12:13 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/11/29/wiki-multi-purpose/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. very good.

  2. bavundi mee alochana …


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: