Aditya 369, Veturi and Suryakantam

నిన్న మధ్యాహ్నం సాయంత్రం ఇవ్వాల్సిన డెమో గురించి ఖంగారు పడుతూ ఉంటే – అది గురువారానికి వాయిదా పడింది అని తెలిసింది. దాంతో ఎగిరి గంతేయకపోయినా అంత ఆనందించి ఇటు computer ముందుకి వచ్చేసా. వచ్చాక .. సినిమా చూద్దాం అనిపించింది. వెంటనే ఈ పీసీ పై ఆదిత్య 369 ఉండడం తో మొదలుపెట్టేసా. మంచి సినిమా. సింగీతం శ్రీనివాస రావు గారు తీసారట – నాకు ఇప్పటివరకూ తెలీదు. ఈ ఐడియా మన వాళ్ళకి ఎలా వచ్చిందబ్బా? మనవాళ్ళు ఇంత formula వ్యతిరేకంగా ఆలోచించరే అనుకునేదాన్ని. తీసింది సింగీతం గారు అని తెలియగానే సందేహం క్లియర్ అయిపోయింది 🙂

తరుణ్ ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఏమనుకుంటాడో – ” కాలం అక్కడే ఆగిపోయినా బాగుండేది అనుకుని ఉంటాడు గ్యారంటీ గా”. 😉 మ్యూజియం లో బొమ్మలకు రాత్రి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో …. పొద్దున్న వచ్చి వెళ్ళిన పర్యాటకుల మీద మనకు మల్లే కామెంట్లేసుకుంటాయా? మ్యూజియం లో ఓ రాత్రి గడిపితే ఎలా ఉంటుంది? – సాలార్ జంగ్ మ్యూజియం వెళ్ళినప్పుడల్లా నాకు ఇదే సందేహం … చిన్నప్పుడి నుంచీ “టైం మెషీన్” లో వెళ్ళాలన్న వెర్రి కోరిక నాకు. ఇలాంటి ఊహల్లో చాలా వాటికి ఈ సినిమా లో ద్రుశ్య రూపం వచ్చింది. అందుకే ఇది నాకు మంచి entertainer అనిపిస్తుంది.

రాత్రి వేటూరి గారి – “కొమ్మ కొమ్మకో సన్నాయి” చదువుతూ ఉన్నా. భలే ఆసక్తికరంగా రాసారు…. ఎవరో అన్నట్లు – అక్షరాల వెంట కళ్ళను పరుగెత్తించింది. సినిమా వాళ్ళ గురించిన కథల మీద ఉన్న ఆసక్తి వల్ల కావొచ్చు … ఈ వ్యాసాలు నాకు నచ్చాయి. సరిగమలు లో “స్వరరాగ గంగా ప్రవాహమే” పాట గురించిన Explanation చదివి ఒక విధమైన Excitement కి లోనయాను. చిన్నప్పటి నుంచి వింటున్నా ఈ పాట ను. ఆఖరికి ఆన్లైన్ లో తెలుగు డౌన్లోడ్ కి దొరక్కపోతే మలయాళం పాట డౌన్లోడ్ చేసుకుని వింటున్నా ఇప్పుడైతే. ఈ పాట లో ఏదో ఉంది. భాష తెలీకున్నా మలయాళం పాటని కూడా నేను enjoy చేసాను. ఈ పాట కి సంబందించిన వ్యాసం చదివాక, ఆ వాక్యాల అర్థం తెలుసుకున్నాక అందులోని తత్వం కాస్త అర్థమైంది…. నిన్న రాత్రి.

నిన్న అలా వేటూరి గారి వ్యాసాలు కొన్ని చదివాను. దాదాపు చదివినవి అన్నీ నచ్చాయి. ఆయన శైలి నచ్చేసింది కొన్ని చోట్ల ……. ఇంతకీ ఆ వ్యాసాల్లో ఆయనకు బాగా పరిచయమున్న ఒక్క నటీమణి గురించో .. లేక ఒక్క గాయనీ మణి గురించైనా లేకపోవడం నాకు నిరాశ కలిగించింది. నేను Feminist ని కాను. కానీ అలా చదువుతూ పోయే సరికి నేను ఎవరిగురించో కనిపించాలని ఆశించి ఉండవచ్చు.

రావి కొండల్రావు గారి హ్యూమరథం-2 లో అనుకుంటా … సూర్యకాంతం గారి మీద వ్యాసం ఉండింది …. అది మరీ అంత అధ్బుతం గా అనిపించకపోయినా ఆరోజు నేను దాన్ని ఎగబడి చదివాను. ఇంకెక్కడా ఆమె గురించి వ్యాసాలు కనబడక.ఆవిడ మీద ఆన్లైన్ సమాచారం ఉంటే చెప్పగలరు ……….. ఆఫ్లైన్ ఉంటే కూడా చెప్పండి… దొరికితే చదువుతాను.

Advertisements
Published in: on November 28, 2006 at 4:06 am  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/11/28/aditya-369-veturi-and-suryakantam/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. చిన్నప్పుడు ఎవరైనా నా హబీలేంటని అడిగితే నేను చెప్పే లిస్టులో పుస్తకపఠనం ఉండేది. అప్పుడు బాగా చదివేవాణ్ణి కూడా. తర్వాత నా చదువు ఒక వాణిజ్యంగా పరిగణింపబడ్డాక సిలబస్ కాక మరేపుస్తకం నా చేతిలో కనబడ్డా మా జూ. కాలేజీ పంతుళ్లు నాకు హెచ్చరికలు జారీచేసేవారు. ఆ తర్వాత కొంతకాలానికి నా హాబీల లిస్ట్‌నుండి పుస్తకపఠనం తొలగించా. కనీసం ఇప్పుడైనా మళ్లీ మొదలెట్టాలనిపిస్తోంది మీ బ్లాగుచూస్తే. ఆమధ్య ఎ.ఆర్.రెహమాన్ గురించి వేటూరి ‘హాసం’లో రాసిన ‘కొమ్మకొమ్మకోసన్నాయి’ వ్యాసం చదివినపుడు ఆ పుస్తకం గురించి తెలిసింది. కానీ అప్పటికి నా priorities వేరే.

  2. nenu kuda kommakommakoa sannayiki viiraabhimaanini.

  3. come on sowmya research chesesi aditya 369 lo unnalanti time machine ni kanipettu. naakkoda piccha istham aa cinema ante – daanlo time machine start ayye scene lo inka nenu unnatle imagine cheskoni gantulesindi gurthosthondi.

    pothe, swaraganga pravahame paata http://www.ramaneeya.com lo manchi quality undhi. try that. ee paina comment rasina renaare neeku parichayam aa.. chalaa baagundi ayana blog.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: