మూడు నవలల మీద టపా….

ఓ 15 రోజుల క్రితం లైబ్రరీ లో Hercule Poirot మిస్టరీ నవలలు 3 కలిసిన ఓ పేద్ద పుస్తకం తీసుకున్నా. Hercule Poirot అంటే Agatha Christie రాసే నవలల్లో ఓ డిటెక్తివ్ పాత్ర. క్రిస్టీ అంటే ఓ 4 ఏళ్ళ క్రితం ఆమె నవలలు చదవడం మొదలుపెట్టిన కొత్తల్లో ఉన్నటువంటి అభిమానం ఇప్పుడు లేకపోయినా … మధ్యలో కలిగినంతటి ద్వేషం కూడా లేదు ఇప్పుడు. అందుకే 3 నవలలు ఏకబిగిన చదివే సాహసానికి పూనుకున్నా. 🙂

మొదటిది : Murder on the links అంట. 1923 నవల. బానే ఉంది కథ. చదవొచ్చు. కాకుంటే ఈ కథలో అంత పట్టు లేదు ఏమో అనిపించింది. అక్కడోసారీ ఇక్కడోసారీ మనలో – ఏం జరుగుతుంది తర్వాత? అన్న కుతూహలం రేకెత్తిస్తుందే కానీ… మొత్తంగా ఇది ఎందుకో బానే ఉన్నా కూడా నచ్చలేదు అంతగా…. నాలో డిటెక్టివ్ నవలల పాఠకురాలు 4 ఏళ్ళ నాటి అంత ఆక్టివ్ గా లేదు ఏమో అనిపించింది…. 🙂

రెండోది :  The Mystery of the Blue Train అన్న 1928 నవల. దాని మీద ఈ కథ లో పెద్ద పస లేకపోయినా ఇందులో చదివించే గుణం ఉంది. కాస్త కుతూహలంగానే ఉండింది కథ చదువుతూ ఉంటే. రెండు నవలల్లోనూ Poirot ని ముసలి వాడై, వ్రుత్తి నుంచి రెటైర్ అయినట్లే చూపింది క్రిస్టీ. అప్పటికే ముసలి వాడు అయిపోతే ఇంక ఆ పాత్ర ఆక్టివ్ గా ఉన్న రోజులు ఏవి ? అన్న సందేహం వచ్చింది. ఎందుకంటే – వికీ సమాచారం ప్రకారం : మొదటి Poirot నవల 1920 లో అచ్చైంది. చివరిది 1975. ఈ లెక్కల్ని బట్టి చూస్తే Poirot తనని తాను పాతకాలపు మనిషి గా చెప్పుకుంటూనే అన్నాళ్ళూ ఆ పాత్ర ఆ ఇమేజి లోనే బోలెడు కేసులు పరిష్కరించింది అన్నమాట 🙂 మిగిలిన పాత్రలు కూడా 1923 కే ఆ పాత్ర గొప్పతనం వినేసి ఉన్నవాళ్ళు. అఫ్కోర్స్ …. అది కథ లో పాత్రే ! దానికి వయసు తో సంబంధం లేదు అనుకోండి … ఎందుకో ఈ ఆలోచన తట్టింది………

ఈ సంగతి అట్లా ఉండగా నిన్న రాత్రి ఇంట్లో వాసిరెడ్డి సీతాదేవి కి ఏదో అవార్డు వచ్చిందని చదివాక ఆమె పుస్తకం ఒకటి కనబడింది. “అర్చన” అన్న నవల. అది చదివాను. నాకు అతి-గా అనిపించింది అది కొన్ని చోట్ల. తరుణ్ తన్ను తాను అర్చన చనిపోయే ముందు తనకు రాసిన లేఖ చదివి ప్రశ్నించుకునే సమయం లో వేసుకున్న ప్రశ్నలు  చాలా బాగున్నాయి. ఆలోచింపజేసేవి. అవి తప్ప ఆ కథ లో నాకు అభ్యుదయం ఏమీ కనబళ్ళేదు. కొన్ని చోట్ల బాగున్నా కానీ ….. పాత్రల చిత్రణ కూడా నాకంత నచ్చలేదు. పార్ట్లు పార్ట్లు గా బాగుంది కానీ.. మొత్తానికి పేలవంగా ఉంది.

అంతా అయ్యాక ఓ సందేహం వచ్చింది : నా చూపుల్లో ఏదో లోపం ఉండి ఉంటుంది అని. లేదా అభ్యుదయం అన్న దానికి నా అర్థమూ, రచయిత్రి అర్థమూ వేరే అయిఉండాలి. స్త్రీ కి గౌరవం ఇవ్వాలి అన్న పాయింటుని కథానాయకుడూ, నేనూ వేర్వేరు రకాలుగా అర్థం చేసుకుని ఉండాలి…….

ఈ మధ్య పుస్తకాల గురించి బ్లాగు రాయనందుకు Compensation గా…… 🙂

Advertisements
Published in: on November 26, 2006 at 12:06 pm  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/11/26/%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a6-%e0%b0%9f%e0%b0%aa%e0%b0%be/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. ఆ పుస్తకాల మాట ఎలావున్న మీరు వాటిని వివరణాత్మకం గా వివరించే[విమర్శించే] తీరు మాత్రం నాకు చాల నచ్చుతుందండి.

  2. వాసిరెడ్డి సీతాదేవి రచనల్ని ఆవిడ రాసిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చదవాలి. ఆవిడ personal background కూడా. నా వుద్దేశంలో ఆవిడ రచనలు కొకు, రావిశస్త్రిల రచనల్లాగా కాలాతీతమైనవి కావు. అంతే కాక, సమాజంలోని విభిన్న శక్తులు ఎలా పనిచేస్తాయో అన్నదాని గురించి ఆవిడ ఎక్కువ ఆలోచించినట్టు కనబడదు – పైకి కనిపించే పరిణామాల్ని చిత్రించి ఊరుకున్నారు. ఆవిడ కాలానికి ఆవిడ రచనలు విప్లవాత్మకాలు కాకపోయినా, అభ్యుదయ భావంతో రాసిన వాటికిందే లెక్క.
    బీటెక్కు చదువుతున్న కాలంలో మొదటిసారిగా హెర్క్యూల్ పోయిరో తో పరిచయం. ఇక అమెరికా వొచ్చాక, నవలలూ విపరీతంగా చదివాను, సినిమాలూ, టీవీ షోలూ విపరీతంగా చూశాను. కాలక్రమేణా ఆ అభిరుచి పోయింది. మీ బ్లాగుతో అవన్నీ గుర్తుకొచ్చాయి.

  3. ఇటీవలే సీతాదేవి కాలంచేశారు. తమ నవలలకు ఐదు సార్లు సాహిత్య అకాడెమీ అవార్డులను గెలుచుకొన్నారట. మట్టిమనిషి, సమత, మరీచిక వంటివి ప్రసిద్ధాలు(ట).
    http://contenttools2.msnserver.com/Telugu/News/Regional/0704-13-7.htm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: