a short nap, Sringeri,Thumbi and coffee

             ఈరోజు చాలా విషయాలు జరిగిపోయాయి – మధ్యాహ్నం 2 నుంచి 5 లోపు నాకు బోలెడు ఙానోదయమూ , ఒకానొక సందేహమూ కూడా వచ్చేసాయి. వెరసి I have enough stuff for a post today……. అందుకని ఇప్పుడు బ్లాగేస్తున్నా …..

                  RK Narayan Sringeri పై రాసిన ఓ వ్యాసం చదువుతున్నా …. శృంగేరి వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందని నాకు తెలీదు. Ofcourse, ఈ భారద్దేశం లో ప్రతి చిన్న ఊరికీ ఏదో ఓ చరిత్ర ఉంటుంది అనుకోండి … ఇంక శృంగేరి లాంటి క్షేత్రాల సంగతి చెప్పనక్కరలేదు. అయినా ఆసక్తి కరమైన వ్యాసం. శంకరాచార్యులవారు సరైన ప్రదేశం వెదుకుతూ శృంగేరి కి వచ్చినప్పుడు అక్కడ ఓ నాగుపాము కప్ప కి తన పడగ నీడ లో ఆశ్రయం ఇస్తున్న దృశ్యం చూసారంట. అప్పుడు –  ఈ ప్రదేశం లో ని ప్రశాంతతా గురించి అర్థమై ఇక్కడ పీఠం స్థాపించాలని అనుకున్నారంట. ఇక్కడి ప్రజలు ఎంత మంచి వారో కూడా చెప్పారు నారాయణ్ గారు. ఇంకా … అక్కడి గుళ్ళ గురించి గోపురాల గురించి చిన్న సైజు కథలు చెప్పారు. మొత్తం అయ్యాక నా డైలాగు : “అమ్మా, మనం సృంగేరి కి వెల్దామా? ” అని. 🙂
 
                “Thumbi” అనబడు మూడేళ్ళ పిల్లాడి (ఆ పిల్లాణ్ణి తమ్ముడు అన్న అర్థం లో కాదు .. మామూలుగా తంబి అనేవాళ్ళంట) అల్లరి చేష్టలన్నీ వర్ణిస్తూ రాసిన వ్యాసం మరోటి. అది చదువుతూంటే నాకు తెలిసిన పిల్లలందరి అల్లర్లూ కళ్ళ ముందు కనబడ్డాయి. నాకు “మహా అల్లరి” అన్న పేరు ఉండేది చిన్నప్పుడు. సో, పనిలో పనిగా నన్ను కూడా THUMBI లా ఊహించేసుకున్నా ….. 🙂 వెరైటీ అనుభవం. ఇది చదువుతూ కారణమేం లేకుండానే మా అమ్మ ని “AMMAAAA” అంటూ పిలిచేసరికి ఇద్దరం నవ్వుకున్నాం. అబ్బ …. హాయిగా కాలం అక్కడే ఆగిపోయి ఉంటే ఎంత బాగుండు ….. అప్పుడైతే మా ఇంటి సామ్రాజ్యానికి నేనే రాజూ రాణీ పోలీసూ దొంగానూ! ఇప్పుడో – వద్దన్నా పెద్దరికం వచ్చేస్తోంది ….. 😦

               కాఫీ తాగడం చెడ్డ అలవాటు అనెవరన్నా అంటే నాకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ఇన్నాళ్ళకి ఈరోజు RKN పుణ్యమా అని నాకు ఓ గొప్ప విషయం తెలిసిపోయింది.  కాఫీ మన దేశం లోకి తెచ్చింది బాబాబుదేన్ అనే ఓ యోగి అని, ఇప్పుడు కొండల్లో కోనల్లో ఉన్న కాఫీ ప్లాంట్లు ఆయన పుణ్యమే అని , సో కాఫీ కి తాత్విక చరిత్ర ఉందనీ (ఉన్నా లేకున్నా ఉంది అంతే) తెలిసింది. ఇంకెవరన్నా కాఫీ గురించి అనాలీ – వాళ్ళకి చరిత్ర చెప్పి ఓ కప్పు కాఫీ ఇవ్వందే వదలను.  🙂

                మధ్యాహ్నం ఈ వ్యాసాలు చదువుతూ నిద్రపోయా. నిద్ర లో ఓ వింత కల. కల్లో స్కూలు నాటి అంత క్లోజు కాని నేస్తాలు కొందరూ, BE నాటి మంచి నేస్తాలు కొందరూ, మా తమ్ముడూ : ఇలా ఎందరో కనిపించేసారు. మధ్యాహ్నం కలకి ఇన్ని పాత్రలు అవసరమా అని కూడా అనిపించేసింది. గంట నిద్రకే నాకు సందేహం వచ్చేసింది – ఈ కల ఈరోజు ఈ సమయం లో ఎందుకొచ్చిందో అన్నదే నా సందేహం. ఏదేమైనా …. రేపు మధ్యాహ్నం మూడింటికి ఆఖరి సెమెస్టర్ పరీక్ష. కాబట్టి ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. సెలవు. శాంతి స్వరూప్ స్టైలు … 🙂

              Lastly 1 word : RKN rox 🙂

Advertisements
Published in: on November 12, 2006 at 12:37 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/11/12/a-short-nap-sringerithumbi-and-coffee/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: