The first post for At random

                               There was one comment that this blog is becoming boring for the reason that it is composed of only things about books,movies etc etc. Well, Though that is the only purpose with which I began blogging, for a change, and respecting the views of a commentator, I am introducing this new section in to the blog – “At Random” 🙂 As the name indicates, these are my random thoughts……             ఇది నా చైతన్య స్రవంతి 🙂
                     నిన్న ఇంటికి రాగానే ఇక్కడో డిస్కషన్ … మార్గదర్శి గురించి. పేపర్లు చదవడం మానేశా ఈ మధ్య. అందువల్ల నాకు మొదట విషయం అర్థం కాలేదు. తరువాత కథ తెలిసింది అన్నమాట. ఈనాడు పత్రిక విచ్చలవిడి గా .. భయం భక్తీ లేకుండా …. ది గ్రేట్ ప్రభుత్వాన్నే విమర్శించేస్తోందని – ” ఆయ్!” అని హూంకరించాలని ఈ మార్గదర్శి కథ మొదలెట్టారని ఓ భోగట్టా. నిన్న రాత్రి భలే ఉండింది – ఈటీవీ2 లో ఏమో గొప్ప నమ్మకం వెలిబుచ్చిన డిస్ట్రిబ్యూటర్లు , తేజా వార్తల్లో ఏమో వీళ్ళ కి వ్యతిరేకంగా మాట్లాడే బాధితులూ …. అహాహా…. కన్నుల పండుగ్గా ఉండింది. ఈరోజు పొద్దున్న – అంతా అయ్యాక : మళ్ళీ ఈనాడు పేపరే చదివా. ఆ తరువాత శైలజా కిరణ్ ఇంటర్వ్యూ .. టీవీ లో :).  ఇంక ఎక్కువ study చేస్తే  పిచ్చెక్కేస్తుందని వదిలేసా.

        ఈ మధ్య కాలం లో నాకో అనుమానం వచ్చింది. కాంగ్రెస్ మన రాష్ట్రం లో వచ్చే ఎన్నికల్లో గెలవదు ఏమో అని. అసలు నిజంగానే పాలన సరిగా లేదో లేక ఇద్దరి పాలనా ఒకేలా ఉన్నా నేను తెదెపా కాలం లో రాజకీయాలని గమనించలేదో .. లేక … ఇప్పుడే గమనించడం లేదో తెలీదు కానీ : నాకు ఎందుకో ఇది వరలోనే బాగుండేదేమో అనిపించింది.   Ignorance is bliss !  అప్పుడే బాగుండేది. కాస్త చుట్టు పక్కల చూడ్డం మొదలెట్టేసరికి : ఇదిగో ఇలా అనుమానాలు! 🙂

            రాత్రి చాన్నాళ్ళకు ఓ అగాథా క్రిష్టీ నవల చదివా. హికరీ డికరీ డాక్ అంట దాని పేరు. పేరు ఏదో రైం లా ఉందని సరదా కథ అనుకోకండి. హత్యలు … హత్యలు ఉన్నాయ్. అలాగే మన చుట్టూ కూడా ఏవో కుట్రలు జరుగుతాయో ఏం కతో!  క్రిష్టీ మళ్ళీ వస్తే బాగుండు. నేను శిష్యరికం తీసుకుని ఈ తరం వారికి డిటెక్షన్ పాఠాలు చెప్తా 🙂 నాకూ స్వప్న దర్శనం ఇచ్చి పాఠాలు చెప్పేస్తే బాగుండు. తరువాత నేనూ ఓ స్కూల్ పెడతా : సౌష్టీ సస్పెన్స్ స్కూల్ అని. 😉 (Sowmya + christie =  soustie)
నిన్న ఈ న్యూస్ చానెళ్ళ గొడవ మధ్యలో “ఇంద్రుడు చంద్రుడు” సినిమా ఓ 20 నిముషాలు చూసా. బోలెడు సార్లు చూసా కానీ … నిన్న చూసిన పాట, తరువాతి సీన్లు మాత్రం ఇప్పటి వరకూ ఎప్పుడూ చూళ్ళేదు –  విచిత్రంగా!

                 కొసమెరుపు ఏంటంటె ఇక్కడ : నాకు సెమెస్టర్ పరీక్షలు ఇప్పుడు. నా అష్టావధానం మధ్య సమయం చిక్కితే చదూకోవాలి అన్నమాట ! 🙂 In case I feel like studying!!! 🙂

Advertisements
Published in: on November 8, 2006 at 4:28 am  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/11/08/the-first-post-for-at-random/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. ‘నా అష్టావధానం మధ్య సమయం చిక్కితే చదూకోవాలి అన్నమాట !’. మొదట చదువు, ఆ తర్వాతే మిగతావి. ఇది చదువుకోవలసిన సమయం కదా. ఈ టపా భిన్నంగా, ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఈ టపా బాగున్నా, ఉందని రాయను -పొగడ్తలు అజీర్ణం చేసే వయస్సు మీది.

 2. సి.బి.రావ్ గారు భలే చెప్పారు.
  నాకు బాగా గుర్తు చదువుకునే రోజుల్లో పరీక్షలు వచ్చేస్తుంటాయి, మనసంతా ఆందోళన, కానీ చదివే మూడ్ రాదు. వస్తే మాత్రం బాగా చదివేవాన్ని. ఒక్కోసారి పరీక్షలు ఇంకో వారంలో వున్నాయన్నా మూడ్ వచ్చేది కాదు. అప్పుడు నాకు పని చేసే మందేంటో తెలుసా? నా మిత్రులు నాకు దాని గురించి చెప్పు, దీని గురించి చెప్పు అని నస పెట్టేవాళ్ళు. నేను చెబితే బాగా తలకెక్కుతుందని, నేను చెబుతాననే వాళ్ళింకా చదవలేదస్నే వాళ్ళు. అదేం చిత్రమో గానీ నాకోసం గాక వాళ్ళకోసం చదివేవాన్ని. వాళ్ళకు చెప్పడం కోసం గనుక వివరంగా చదివేవాన్ని. వాళ్ళు ఎంతో బాగా మన లెక్చరర్స్ కంటె బాగా చెప్పావని పొగుడుతుంటే మరింత పొగడ్త కోసం మరింతగా చదివేవాన్ని.
  మీకూ అలాంటి మిత్రులు దొరుకుతారేమొ చూడండి.
  ఇక రాజకీయాల గురించి మీ పరీక్షలయ్యాక చర్చిద్దాం!
  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. అదేమిటో సౌమ్యగారు నాకు మీరు ఏమి రాసినా భలే నచ్చేస్తుంది.
  చరసాల గారు చెప్పినట్టు గానే మేము కూడ అందరం ఒక్కొ ప్రశ్న చెప్పుకునెవాళ్ళం సినిమా కధ చెప్పుకున్నట్టు.అలాయితె బాగ గుర్తుంటుందని.మొత్తం సంవత్సరం అంతా తెగ ఎంజోయ్ చేసేసి పరీక్షల దగ్గరకి వచేసరికి ఇనాల్లు పెళ్ళి పెళ్ళి అన్నారు అదేదొ ఇప్పుడు చేసేస్తే బాగుండు అనుకునేవాల్లం

 4. write more of these posts..public demand!!

 5. paina comments raasina shreyobhilashulantha chaduvkovali ani chepthunnaru kaani, i really liked the ending. suits me more than anyone else. neeku ashtavadhanam, naaku chaturdhavadhanam (dunno if the word is right) – eating, chatting cum skyping, movies and music. madhyalo time dorikithe assignments laantivi chesthuntaa.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: