సత్యమే శివం

                          కొన్ని సినిమాలు జీవితాన్ని మనం చూసే విధానాన్నే మార్చేస్తాయి. అలా నన్ను ప్రభావితం చేసిన ఒక సినిమా “అన్ బే  శివం” లేదా “సత్యమే శివం”.  మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన తీరు లో గొప్ప శక్తి ఉంది.  నాకు… సరిగా గుర్తులేదు… గుర్తు ఉన్నంత వరకు ఇవే అనుకుంటా పదాలు:
“ఆస్తికులైన హితులందరికి శివమే సత్యమట
నాస్తికులైన స్నేహితులకు మరి సత్యమే శివమంట”

ఈ దేవుడేంటో … ఈ కాన్సెప్ట్ ఏంటో అని తలకొట్టుకునే రోజుల్లో చూసా ఈ సినిమా ని. మానవత్వాన్ని మించిన దేవుడు లేడని ఎంత ప్రాక్టికల్ గా చెప్పారంటే – ఆ రోజు నుండీ ఈ రోజు దాకా నేను అదే మార్గం లో ఉన్నా. నాలో కలిగిన అయోమయం చాలా వరకు పోయింది ఈ సినిమా సంభాషణ లు విన్నాక. ప్రతి మనిషి లోనూ దేవుడు ఉన్నాడు – ఇంకొకరి క్షేమం గురించి ఆలోచించే ప్రతి మనిషీ దేవుడే అన్న సందేశం సూటిగా నా గుండెల్లో అలా దిగిపోయి – పాతుకుపోయింది. అయితే – ఈ సందేశాన్ని ఆవేశం గానో, మనుష్యుల్ని ఈసడిస్తూనో ఇవ్వలేదు. పూర్తి స్థాయి హాస్యం తో ఇచ్చారు. అది నన్ను అంత లా కట్టిపడేసి నడిస్తే ఈ బాట లో నడవాలి అనిపించేలా చేయడానికి కారణం ఇదే అనుకుంటా.

ఈ సినిమా కి సంబంధించినంత వరకు ఇది కాకుండా ఇంకా ఎన్నో చెప్పుకోవలసిన విషయాలు ఉన్నాయి. కానీ నేను నేర్చుకున్న జీవిత పాఠం ఇది : దేవుడు ఎక్కడో ఉండడు. దేవుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. నీ తోటి మనిషి కష్టాన్ని నువ్వు పంచుకున్నప్పుడో, లేక ఆ కష్టం తీరడానికి నువ్వు తోడ్పడినప్పుడో నీలోని దేవుడు ఎదుటివారికి కనిపిస్తాడు. అలాగే జీవితం లో నువ్వు ఈ రెండో వైపు చిక్కినప్పుడు ఎదుటి వారి లోని దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. అని.

“ఆస్తికులైన హితులందరికి శివమే సత్యమట
నాస్తికులైన స్నేహితులకు మరి సత్యమే శివమంట”

Advertisements
Published in: on November 7, 2006 at 5:36 am  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/11/07/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b1%87-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. సౌమ్యా,
  ఇది హిందీ సినిమానా? తెలుగా? నాకూ చూడాలని వుంది.
  క్రితం వారాంతం మా మితృడి ఆహ్వానం మీద ISKCON వారి సత్సంగ్ కు వెళ్ళాను. వాళ్ళు చెప్పేది వింటే నాకు మతి పోయింది. సత్యము శివమూ కాదట, శివము సత్యమూ కాదట. అన్నీ కృష్నుడే! మనిషి మనిషికి సహాయపడటమనేది ప్రాదాన్యం వున్నదిగా లేనే లేదు.
  కృష్నున్ని కీర్తించడం, భజన చెయ్యడం, భక్తితో సేవించడం ఇవే మోక్షమార్గాలట! “మానవ సేవే మాధవ సేవ” కదా అని నేనంటే, అలా అని గీతలో ఎక్కడుందో చెప్పు అని ఎదురు ప్రశ్నించాడు ఆ స్వామి! గీతలో లేని దేనికీ వాళ్ళు పూచికపుల్ల విలువ ఇయ్యటం లేదు.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. ఆ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం.కమల్ హాసన్, మాధవన్ మద్య నడిచే ఎన్నొ సన్నివేసాలు మంచి సందేసాన్ని కామెడి గా చెపుతూనే మనసుని కదిలిస్తాయి.కానీ ఎందుకో ఈ సినిమా చాలామందికి నచ్చలేదు.నేను బాగుంది కదా అంటే నీకిలాంటి సినిమాలు కూడా నచ్చుతాయా అని నవ్విపోయారు నా ఫ్రెండ్స్ అందరూ…

 3. సత్యమే శివం నేను ఒక పది సార్లు చూసా…ప్రత్యేకించి నవ్వుతూ కోపాన్ని ఎదుర్కోవటం చాలా కష్టం, అది ఎంత సులభమో ఈ చిత్రంలో చూడవచ్చు.

 4. ప్రతి మనిషి లోనూ దేవుడు ఉన్నాడు – ఇంకొకరి క్షేమం గురించి ఆలోచించే ప్రతి మనిషీ దేవుడే. ఇంత చక్కటి సందేశాన్నిచ్చిన ఈ చిత్రం Box-Office దగ్గర బోల్తా పడింది. ఇలాంటి మంచి చిత్రాలు ఆడకపొతే దాని ప్రభావం మిగతా నిర్మాతలపై కూడా ఉంటుంది. ఈ సినిమా అందరూ మరిచిపొయిన సమయంలో మరలా మీ చక్కటి సమీక్ష ద్వారా గుర్తుకు తెచ్చారు.

 5. చాలా గొప్పచిత్రం. కమల్ లాంటి practical మనుషులే చేయగలిగిన చిత్రం. నేను మళ్లీ ఓసారి చూస్తా. నా దృష్టిలో ఈ సినిమా కూడా ఒక భగవద్గీతే.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: