సందేహాలు

మరో మారు AK లో ఈరోజు. ఏ రోజుకారోజు చెప్పుకోదగ్గ విషయాలేం లేకపోయినా కూడా నాలో కలుగుతున్న ఆనందాన్ని , ఈ వారానికి రెండు గంటల క్లాసులు నాకు నేర్పుతున్న పాఠాల్ని నేను గమనిస్తూనే ఉన్నాను. పిల్లలకి చదువు చెప్పడం అంత సృజనాత్మకమైన పని ఇంకోటి లేదు అని నాకు అర్థమైంది. ఈ పని లో గెలవాలంటే గొప్ప ఓపికా , నేర్చుకోవాలన్న తపనా మాత్రమే కాదు … ఎంతో ఊహా శక్తి కూడా ఉండాలి అని నాకు రోజులు గడిచే కొద్దీ అవగతమౌతోంది.

“ఈ క్లాసులకి కూడా ప్రెపేర్ అవుతావా ఏంటి?” అని అడిగింది నా స్నేహితురాలు నన్ను ఈరోజు స్కూలు అయ్యాక. నిజానికి నేను ఈ వారం వెళితే వచ్చేవారం దాకా మళ్ళీ ఆలోచించను ఈ క్లాసుల గురించి …. నా క్లాసుల గొడవల్లో. కానీ … ఆ అమ్మాయి వెటకారానికే అడిగినా , అందులో నిజం ఉంది. ఈ క్లాసులకి నిజానికి బోలెడు చదువుకోవాలి – జీవితాన్ని, పిల్లల తత్వాన్నీ. ఎప్పటికప్పుడు కాస్త ఆలోచించుకుని వెళదాము అని అనుకుంటూనే ఉంటా కానీ … నా acads గొడవల్లో దీన్ని పట్టించుకోవడం లేదు నేను.

వాళ్ళకి ఓ మంచి పద్ధతి లో చదువు చెప్పాలని నాకు మహా తాపత్రేయం. అయినా నాలోని బాధ్యతా రాహిత్యానికి తోడు ఓ విధమైన నిస్సహాయత – ఇలా బోలెడు కారణాల వల్ల మొత్తానికైతే నా స్వప్నాలకూ, సత్యాలకూ బోలెడు తేడా నాకు 3-D స్క్రీన్ లో కనిపిస్తూనే ఉంది. నాకు తెలుసు అనుభవం లో నేనూ రాటుదేలతా అని. కానీ ఆ అనుభవం తో పాటు అనుభవఙుల సలహాలు కూడా అవసరమే. మీకు తోచినవి మీరూ చెప్పండి – How to make learning a good experience for children of this kind of background అని. 🙂

Advertisements
Published in: on October 19, 2006 at 3:14 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/10/19/%e0%b0%b8%e0%b0%82%e0%b0%a6%e0%b1%87%e0%b0%b9%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. ఇంతకీ ఈ పిల్లలకి ఏం చెబుతున్నారో చెప్పనే లేదు. మీరింత కష్టపడుతున్నారంటే మీరు మిగిలిన మేడంలని (అంటే మీరు బడిలో ఉన్నప్పుడు ఎలా చదువుచెప్పారో అలా) అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఒక మూస పద్ధతిలో చదువు చెప్పాలని మన బ్రెయిన్లో ఎప్పుడో హార్డ్‌వైరైపోయిందిగా మరి.

 2. అసలు ఎక్కడ పని చేస్తున్నారు? ఎంత వయసు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు? ఎమి చెబుతున్నారు? గట్రా విషయాలు తెలిస్తే నాకు తోచింది నేను చెప్పగలను

  నవీన్ గార్ల
  http://gsnaveen.wordpress.com

 3. నన్నడిగితే ఏ పాఠం కంటె గూడా పిల్లలకి “ప్రేమ” నేర్పించడం చాలా ముఖ్యం. అదిగో వాడికంటె నీకు మార్కులు రాలేదు, నీకంటె వాడు నయం లా ఒకరి మీద ఒకరికి అసూయ, స్పర్థ నేర్పించడం కంటె ఒకరంటె ఒకరికి ప్రేమ, స్నేహం నేర్పించాలి. సరిహద్దుల్లేని ప్రేమతో పిల్లల మనుసుల్ని మనం గెలుచుకోగలిగితే, అనంతమైన అనురాగం మనం చూపించగలిగితే అదే వాళ్ళలో కూడా పరస్పర ప్రేమను కలిగిస్తుందని నేననుకుంటాను. కానీ పిల్లలకు చెప్పడంలో నాకు అనుభవం లేదు, నా పిల్లలకు తప్పితే.
  నేను నా పిల్లలను ఎంతగా ప్రేమిస్తానంటే తనేదైన తప్పు చేస్తే నేను కాసేపు మౌనం వహిస్తే చాలు, తను సహించ లేదు, పిచ్చిదానిలా ఏడ్చేస్తుంది, క్షమాపణలు చెప్పేస్తుంది, మళ్ళీ నేను తనని అక్కున చేర్చుకునేదాక విలవిల్లాడిపోతుంది. కానీ మా ఆవిడ నాది అతి గారాభం అంటుంది.
  కానీ నాకు అది తప్ప వేరేది రాదు. ప్రేమ ద్వారానే వాళ్ళలో కలిగే పరివర్తన శశ్వతమయిందని నేను నమ్ముతాను.

  ఇక చదువు విషయానికి వస్తే వీలయితే మీరు మాంటిస్సోరి విధానాలను(http://www.montessori.edu/) చుడండి. ఎంతసేపూ నోటితో చెప్పే బదులు చెప్పేదానికి అనుగుణంగా మీరేమయినా దృశ్యరూపక వస్తువులు తయారుచేయగలరేమొ ఆలోచించండి. నా చిన్నప్పటి చదువుల్లో ఘనము (cube) అంటే వూహించుకున్నదే గానీ చూసింది లేదు.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 4. మీరు రాసినవి చదువుతూంటే సుధా నారాయణ మూర్తి గారి వ్యాసాలు గుర్తొస్తున్నాయి.

  ఆశాకిరణ్ లాంటి వాతావరణంలో పిల్లలకి చదువు చెప్పడానికి ప్రత్యేక పద్దతులు అవసరం.

  1. కొంచమే చెప్పినా వారి మైండ్స్ లో అలా గుర్తు ఉండి పొయేలా చెప్పాలి. నిజమే హోం వర్క్ చేసుకుని వెళ్ళాలి. చార్టులు , బొమ్మల లాంటివి చూపించి చెప్పాలి. వారి అవగాహనా స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ గమనిస్తూ దానికి అనుగుణంగా చెప్తూఉండాలి. మధ్య మధ్యలో ప్రశ్నల ద్వారా చెప్పేది వాళ్ళకెలా చేరుతోందో తెల్సుకోవాలి.

  2. ఒకే లెక్చరర్ మామూలు కాలేజి పిల్లలకి ఒక లాగా, ఓపెన్ యూనివర్సిటీలో చదివే వాళ్ళకి మరోలాగా పాఠం చెప్తూంటారు. సిలబస్ కూడా మారుతుంది ఒకే డిగ్రీ వాళ్ళకైనా. ఈ పిల్లలకి చెప్తున్న విషయంపై వీలైనంత వరకు సమగ్ర అవగాహన కల్పించే ప్రయత్నం చెయ్యాలి.

  3. జీవితం, కష్టాలు నేర్పిన అనుభవం అటువంటి పిల్లలని
  మరింత ప్రాక్టికల్ గా మారుస్తుంది. (కనీసం మధ్య తరగతి స్థాయి వాళ్ళ పిల్లల కన్నా) పాఠం చెప్పేటప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లోనుంచి ఉదాహరణలు చెప్పాలి.

  3. అటువంటి పిల్లలు సమాజం పట్ల కొంచెం నిర్లక్ష్యం , వ్యతిరేక భావనలతో ఉంటారు. మధ్య మధ్యలో అవకాశం ఉన్నప్పుడు జీవితం గొప్పతనాన్ని , విలువల అవసరాన్ని , తోటివారితో మెలగవల్సిన తీరుని వారికి అర్థమయ్యే మాటల్లో చెప్పాలి. నిజానికి ఇదే అసలైన చదువు. సత్య సాయి బాల వికాస్ పుస్తకాల్లోంచి కథలు చెప్తే బాగుంటుంది అప్పుడప్పుడు.

  ఇప్పటికివే తోచాయి మరో సారి మరి కొన్ని చెప్తాను.

  కృష్ణ

  హైదరాబాద్ మహా నగరం

 5. hi proceed


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: