కొ.కు కథలు

         కొ.కు గారి కథల సంకలనం “కుటుంబరావ్ కథలు” లో 35 కథలు ఉన్నాయి. మంచి హాస్యమూ, వ్యంగ్యమూ ఉన్నాయి ఈ కథల్లో. బరువైన కథలు కావు. సాధారణ మైన సంగతులు …. సాధారణమైన కథా వస్తువు … అసాధారణమైన కథనం … చక్కని క్లారిటీ – వెరసి ఇవి టిపికల్ కొ.కు గారి కథలు.

        “32 డౌన్ క్రాసింగ్” కథ ముగింపు నాకు అర్థం కాలేదు కానీ భార్యా-భర్తల మధ్య ఉండే అనుబంధం, వారి ఆలోచనల గురించిన పోలికా చక్కగా చూపారు. “ఒక పతివ్రత” కథ పర్వాలేదు. “అమాయకురాలు” కథ నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని వ్యక్తుల కథ. కాస్త జాలి కలిగిస్తుంది పాఠకుడిలో. “రక్త స్పర్శ” కథ బాగుంది. ఇది చదవడం ఓ మంచి అనుభవం. అక్క-తమ్ముడి మధ్య అనుబంధం చక్కగా చూపారు. “మొండివాడు” కథలో రచయిత చెప్పదలుచుకున్నది నాకు అర్థం కాలేదు కానీ మంచి కథనం. “అపనమ్మకం” కథ వస్తువు పరంగా నచ్చకపోయినా శైలి పరంగా చూస్తే నచ్చింది . “మంత్రగాడు” కథలో మళ్ళీ ఉధ్ధేశ్యం అర్థం కాకపోయినా కూడా కథనం బావుండటం తో నచ్చింది. “అసలు మాది కిష్కింద” హాస్యం,వ్యంగ్యం నిండిన కథ. “కనకవల్లి కథ” కథ కదిలించింది. “హోటెల్ పరిచయుడు” కథ నవ్వించింది. 

           “ఇట్లా జరిగిపోతే” కథ చదివాక ఇదొక తరహా తత్వ బోధ ఏమో అనిపించింది.  “మేడిపండు”,”ఆర్థికోపన్యాసాలు”,”దీపావళి”,”తులసమ్మ గారు”,”రెళ్ళూ,మూళ్ళూ”, “ఎల్లువ తక్కువ కులాలు”, “సత్యసంధుడు” బావున్నాయి. “ఒక ప్రణయ కథ” ఈ సంకలనం మొత్తానికీ నాకు కాస్త విడ్డూరంగా అనిపించిన కథ. “బ్రహ్మాస్త్రం” భట్రాజు ల మీద భట్రాజు గిరీ మీదా నిందా స్తుతీ, స్తుతి నిందా కలగలిసిన కథ. “ఎక్స్ ట్రా”,”సినిమా సరదా”,”పాప ఫలం” – కథల్లో మంచి హాస్యం ఉందనిపించింది. “నీ కాల్మొక్తా నీ బాంచని” కథలో చక్కని సంభాషణలు ఉన్నాయి. “సుడిగుండాలు” లో కాలేజీ జీవితాన్ని వర్ణించిన విధానం చాలా బాగుంది. “పిన్ని” కథ నన్ను ఆ కథలోని చిన్నపిల్లను చేసేసింది చదివిన ఆ కాసేపూ. “ఙాని” కథ లో వ్యంగ్యం బాగుంది.
 
        “ఈ ఇల్లు” కథ మంచి ఫ్లో లో సాగింది. ఈ కథా వస్తువు కాస్త విభిన్నంగా అనిపించింది. “రోడ్డు పక్కని శవం” కథ పర్వాలేదు. “సూర్యం సాహసం”,”దినచర్య”,”వెళ్ళిన పని” కథలు ఆసక్తికరంగా, తగినంత హాస్యం,వ్యంగ్యం కలిసి బావున్నాయి. “కలలోని యధార్థం” ఆర్.కే.నారాయణ్ గైడ్ తరహా కథ. బానే ఉంది. “కుల ద్వేషం” కొన్ని చోట్ల అర్థం కాకపోయే అవకాశం ఉంది. 

       “అఙానం మనుష్యులను ఆకర్షిస్తుంది. ఏం జరుగుతుందీ తెలీని చోట ఎక్కువ మంది చేరతారు” (రోడ్డు పక్కని శవం) అన్నా, “ఎవరూ గ్రహించలేని సత్యాలని తెలుసుకుని ఎవరికీ చెప్పకుండా ఉండడం లో గొప్ప ఆనందం ఉంది” (దినచర్య) అన్నా, “రామనాథం అత్తగారి వంక తీక్షణంగా చూసాడు. ఆమెకు అల్లుడి రెండు కళ్ళలోనూ మూడో కన్ను జాడలు కనిపించినై” అన్నా “జీవితం పొరపాటున నాటకమౌతుందేమో అని జీవితమంతా భయపడిన నేను …. “(అపనమ్మకం) అన్నా కుటుంబరావు గారు సాధారణ వాక్యాల్లో ఎన్నో సత్యాలు చెప్పగలరు. చెబుతూనే నవ్వించ గలరు కూడా.

       ఈ కథల్లో ఎక్కడో కొన్ని చోట్ల కొన్ని అంశాలు అర్థం కాకపోవచ్చేమో కానీ  నచ్చకపోయే అవకాశాలు తక్కువ. ఈ విషయం అని లేకుండా ఎన్నో విషయాల గురించి అలవోకగా చర్చిస్తారు ఆయన కథల్లోనే. కొన్ని చోట్ల పాఠకుడి కి కలగబోయే సందేహాలను ముందే ఊహించేసాడా అనిపిస్తుంది ఆయన మనలో సందేహం కలుగుతూండగానే దాన్ని తీర్చేయడం చూస్తే. మొత్తం లో అన్నింటికన్నా నాకు నచ్చింది ఆయన కథనం. ఈ కథల్లో ఆద్యంతమూ ఆకట్టుకునేది శైలీ … పదాల కూర్పూ, నేను గమనించినంతవరకూ. ఎక్కడా బోర్ అన్నదే కొట్టదు ఇవి చదువుతూ ఉంటే. ఇంతకంటే బగా ఎవరూ రాయలేరేమో అని కూడా అనిపించింది కొన్ని చోట్ల. కథంటూ రాస్తే కొ.కు లా రాయాలి అనిపించింది పుస్తకం చివరకి వచ్చేసరికి.

Advertisements
Published in: on October 4, 2006 at 8:14 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/10/04/%e0%b0%95%e0%b1%8a%e0%b0%95%e0%b1%81-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

 1. హాయ్,

  మీకు అంత సమయం…ఎలా దొరుకుతుందండి…బాబు…
  ఏదేమైనా….మీ బ్లాగు చదువుతుంటే….మా విజయవాడ గ్రంధాలయంలో…
  తిరుగుతున్నట్లుంది..

  రాజు.

 2. ఈ పుస్తకం ఈ మధ్యే నేనూ చదవడం జరిగింది. కుటుంబరావు గారి కథలు చదవడం ఇదే మొదటి సారి. మీరు చెప్పినట్టు కొన్ని కథల్లో గొప్ప జీవిత సత్యాలు చెప్పారు. కాస్త తాత్త్వికత కూడా కనబడింది అక్కడక్కడ.

  చాలా కథల్లో స్త్రీ పురుష సంబంధాల (read అక్రమ సంబంధాలు) అంశం ఉండడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఇది నాకు అంత నచ్చలేదు. అలాగే కొన్ని కథల్లో క్లిష్టతో, అస్పష్టతో గానీ సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల కాస్త వెలితిగా అనిపించింది.

  మొత్తానికి కథలు నాకు మరీ బాగా నచ్చలేదు గానీ చదివించేటట్టు గానే ఉన్నాయి.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: