Dr Benjamin – one of the best docs I ever saw

          మొన్న ఆదివారం నాడు పొద్దున్నే 5:30 కి లేచా. ఇటీవలి కాలం లో నేను అంత త్వరగా లేవడం అసలు జరగలేదనే చెప్పాలి. దీనికి ఓ కారణం ఉంది. మా కాలేజీ ఆషాకిరణ్ వారు దగ్గర్లోని స్లం ఏరియా వారికి ఓ Medical Camp ఏర్పాటు చేస్తున్నారు. నాకు ఆదివారాలు కాలేజీ కి సంబందించి ఏ ప్రోగ్రాములు నచ్చవు. అది ఎంత ఉదాత్తమైన దైనా సాధ్యమైనంత వరకు ఆదివారం అంటే నేను ఎవరన్నా నా బదులు వెల్తారా అనే చూస్తూ ఉంటాను. ఆదివారం ఒకటి దొరుకుతుంది అమ్మ తో గడపడానికి. ఇక ఆరోజూ నేను వీథుల్లో తిరుగుతూ ఉంటే ఎలా ? కానీ … ఈ సారి తెలుగు తెలిసిన వాళ్ళ కొరత ఉంది అంటే అయిష్టంగానే వస్తా అని చెప్పాను.

         అదిగో ఆ కారణాన కాలేజీ కి వచ్చి అక్కడినుండి మందులు నిండిన రెండు అట్టపెట్టెలతో నేనూ, రెంజిని అనబడు ఈ క్యాంప్ ని co-ordinate చేస్తున్న PhD Student నా కైనెటిక్ లో బయలుదెరాము. మిగితా వాలంటీర్లు కూడా మా వెనగ్గా వచ్చేసారు. కాసేపటికి డాక్టర్ గారు వచ్చారు. ఈ ఉపోద్ఘాతమంతా ఈయన గురించి చెప్పడానికే.

         డాక్టర్ బెంజమిన్ గారి గురించి నాకు ఆట్టే తెలీదు. అసలు ఆయన పేరు తెలిసిందే camp గురించిన minutes ని మాకు moderator మెయిల్ చేసినప్పుడు ! కానీ ఆయన పేషంట్లతో ఎంత బాగా మాట్లాడారో …. ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లు ఉంది. వాళ్ళ తో వాళ్ళ భాష లోనే సంభాషణ నడిపడం నాకు ఎంత గానో నచ్చింది. మధ్య మధ్య న మాక్కూడా ఎన్నో ఉపయోగకరమైన విషయాలు చెప్తూ వచ్చారు. తన అనుభవాలు, general health problems గురించి – ఇలా చాలా విషయాలు చెప్పారు. డాక్టర్ గారు ఆ జనాలను deal చేసిన తీరు నాకు బాగా నచ్చింది.

         గుడిసెల్లో ఉండే వాళ్ళ జీవితం గురించి నాకేం అవగాహన లేదు కానీ ఈరోజు చూస్తూ ఉంటే కాస్త తెలిసింది. వారికి ప్రధాన సమస్యలు రెండు ఏమో అనిపించింది. 1) పారిశుధ్య సమస్య 2)కాస్త ఆత్మీయమైన ఓదార్పు, ధైర్యం చెప్పడం. తాగుడు వంటి సమస్యలు ఉన్నాయి … కానీ నాకు ఇవి వాళ్ళు అక్కడికి రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమో అనిపించింది. కొన్ని విషయాల్లో వారి నిస్సహాయత చూసి జాలి వేసింది. నేను ఏమన్నా చేయగలనా ? అన్న ప్రశ్న నన్ను చాలా ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇలా నన్ను నేను ఎన్నో సార్లు ప్రశ్నించుకున్నా అనుకోండి. జీవితాంతం ఇలా ఎన్నో సార్లు ప్రశ్నించుకుంటూనే ఉంటా కూడా.

           అలాంటి ప్రశ్నలను …. సమాధానాలను వెదుక్కునే ప్రయత్నం లో కలిగిన అనుభవాలను చెప్పుకోడానికే కదా ఈ బ్లాగు ఉన్నది :). ఇంతకీ బెంజమిన్ గారి తో మాట్లాడ్డం కుదర్లేదు కానీ – “Sir! hatsoff to U!అని చెప్పేదాన్నేమో మాట్లాడి ఉంటే. నేను ఇప్పటివరకూ మంచి డాక్టర్లను చాలా మందినే చూసా – ఈ తరహా సంధర్భం లో వాళ్ళు ఏం చేసిఉండేవారో చెప్పలేను కానీ ఈ డాక్టర్ గారు మాత్రం the best. ఈయన్ను చూసి చాలా మంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

         
 

Advertisements
Published in: on October 3, 2006 at 8:44 am  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/10/03/dr-benjamin-one-of-the-best-docs-i-ever-saw/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. చాలా బాగుంది ఈ టపా. ఇంతకీ మీ పేరు…

  2. సౌమ్య గారూ,
    ఇంత మంచి ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటున్న మీరు భలే అదృష్టవంతులు.

    –ప్రసాద్
    http://charasala.com/blog/

  3. ఓకే.. సౌమ్య గారే అన్నమాట…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: