కొకు లేఖలు

“కొకు లేఖలు” – కొడవటిగంటి కుటుంబరావు గారు వివిధ సందర్భాల్లో  వివిధ వ్యక్తులతో కొన్నేళ్ళు జరిపిన ఉత్తరాల సంకలనం. చాలా ఉత్తరాలే సేకరించారు. నాకు ఆ ఉత్తరాల వెల్లువ చూసి ఆశ్చర్యం కలిగింది. అందరూ ఈయన ఉత్తరాలని ఎంత పదిలంగా దాచుకోకపోతే ఇప్పుడు పుస్తకం అచ్చేసే అన్ని ఉత్తరాలు తయారౌతాయి? ఈ ఉత్తరాల్లో కొకు గారు ఎన్నో అంశాల గురించి చర్చించారు. ఆయనకున్న విషయ పరిఙానం నన్ను ఎప్పుడూ అబ్బురపరిచేదే అయినా .. మళ్ళీ కొత్తగా అబ్బురపడ్డాను ఈ పుస్తకం చదువుతూ. కథ లు నవలల శైలుల దగ్గరి నుంచి, సైన్సూ, రాజకీయాలు, విరసం, సినిమా, ఇతర కథకులపై తన అభిప్రాయాలు, మన పురాణాలు – ఇలా ఎన్నెన్నో విషయాల గురించి కొకు గారి అభిప్రాయాల సంకలనం ఈ లేఖలు.

చిన్న కథ ని, నవల ని పోలుస్తూ సీ.వీ.సుబ్బారావు గారితో ఇలా అంటారు : “చిన్న కథ మనుష్యుల మధ్యసామాజిక సంబంధాల్ని వ్యక్తం చేయగలదు. కానీ వాటిలో కలిగే మార్పులను వ్యక్తం చేయలేదు. దానికి నవలే సరి అయినది”. అని. బీ.టీ.రామానుజం గారికి రాసిన లేఖలో – “కథ రాయడానికి తగిన ప్రేరణా శక్తీ మనలో ఉంటే అది రాయదగిన కథే. అవి లేని పక్షం లో ఇతరులు విమర్శించి, మన చేత మంచి కథలు రాయించలేరు అనుకుంటాను.” -అని. నిఖిలేశ్వర్ కి రాసిన లేఖలో విమర్శ గురించి చెబుతూ – “విమర్శ వచ్చినప్పుడల్లా “panicky ” అయిపోకండి. అది ఉపకరించేది గా ఉందా, వినాశనాత్మకంగా ఉన్నదా కేవలం ఉన్మాదం గా ఉన్నదా? అని ఆలోచించండి” అన్న మాటలు – పై మూడు వాక్యాలూ ప్రత్యేకంగా వర్థమాన రచయితలకు ఎంతగానో ఉపయోగపడతాయని నా నమ్మకం. చలసాని ప్రసాద్ గారితో ఉత్తరం లో శంకరాభరణం పై కొకు అభిప్రాయాలు చదివాను. ఆసక్తికరంగా ఉన్నాయి. కనక్ ప్రవాసి అన్న ఆయన కు రాసిన లేఖలో – శ్రీపాద వారి శైలి ని గురించీ, ఆయన కథల గురించి బాగా రాసారు. కొకు ఎంత లోతు గా గమనిస్తారో ఆ అభిప్రాయాల ద్వారా అర్థం అయింది నాకు. “పురాణం” వారితో లేఖలు నాకు చాలా నచ్చాయి. ఆ లేఖల్లో బోలెడు విషయాలేం చర్చకి రాకపోయినా కూడా మంచి లేఖలవి. ఆ కాలం లో ఇంతమంది గొప్ప రచయిత మధ్య సంబంధాలు ఎలా ఉండేవో వీళ్ళిద్దరి మధ్య నడిచిన లేఖల్లో చూడొచ్చు. ఓ మంచి అనుభవం … ఈ ఉత్తరాలు చదవడం. నండూరి రామ్మోహన రావు గారితో లేఖల్లో శాస్త్రీయ చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయి.

అయితే ఈ లేఖల సంకలనం లో రెండు పేద్ద లోపాలు ఉన్నాయి:
1. ఇక్కడ కొకు గారి జవాబులే ఉన్నాయి. అవతలి వారి జాబులు లేవు. కనీసం ముందు ఉత్తరం లో ఏం అడిగారు అని ఓ రెండు లైన్లు అన్నా రాసి ఉండాల్సింది. కొన్ని చోట్ల ఈ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఉదాహరణ కు – కూరెళ్ళ విఠాచార్య కి రాసిన ఓ ఉత్తరం ఇలా ఉంటుంది. వరుసగా 15 సంఖ్యలు వేసి ఉంటాయి. ప్రతి సంఖ్య పక్కనా దాని జవాబు. అంతే. జవాబు కూడా కొన్ని చోట్ల ఔను, కాదు, తెలీదు -ఇలా ఒక్క పదం లో ఉంటుంది. ఏం అర్థం కావాలని నాబోటి జనాలకి?? విరసం గురించి ఓ చిన్న ఇంట్రో ఇచ్చినా బాగుండేది. అంటే అప్పట్లో వీళ్ళు ఇందులో మెంబర్లు, వీళ్ళు కారు అలాగ.
2. రెండోది, మొదటి దాని అంత పెద్దదీ అయినది – ఆ లేఖలు నడిపిన వారి పేర్లు రాసి వదిలేయడం. ఈ కనక్ ప్రవాసి ఎవరో…కూరెళ్ళ ఎవరో….రాజేంద్ర ఎవరో….సెవెన్ స్టార్స్ సిండికేట్ ఏంటో..త్రిపురనేని మధుసూధన రావు ఎవరో…..గాయక్వాడ్ ఎవరో…. – ఇదంతా నా తరం వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఒక చోట ఐతే ఆ పేజీ లో ఆర్.కె అని ఉంటూంది అంతే. తరువాతి పేజీలో ఆ ఆర్.కె తో కొకు ఉత్తరాలు. కొ.కు గారు “రామక్రిష్ణా రావు గారూ” అంటూ మొదలుపెట్టబట్టి సరిపోయింది కానీ ఉత్తరం లో, లేకుంటే ఎవరనుకోవాలి? కాస్త ఓ రెండు ముక్కలు ఆ మనుష్యుల గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా ఇవ్వకపోవడం వల్ల నా బోటి కొ.కు పోయాక పుట్టిన బ్యాచ్ జనాల గతేం కావాలి?

ఆనాటి సాహితీ జీవనమూ, రాజకీయ పరిణామాలు, విరసం ఇలా ఎన్నో చర్చించినప్పటికీ పై రెండు కారణాల వల్ల ఈ పుస్తకం చదవడం నాకూ మంచీ చేడూ కాని ఓ తరహా అనుభవం …. గందరగోళం తో నిండినది …. మిగిల్చింది. కొకు రచనల్లో ఉండే స్పష్టత ఈ సంకలనం లో లోపించింది పై రెండు లోపాల వల్ల.

Advertisements
Published in: on September 23, 2006 at 8:34 am  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/09/23/%e0%b0%95%e0%b1%8a%e0%b0%95%e0%b1%81-%e0%b0%b2%e0%b1%87%e0%b0%96%e0%b0%b2%e0%b1%81-2/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. wow! first telugu blog I ever read and looks like you are a great writer / critic!

  2. good points. I don’t know who edited this volume. In the 6 volume collection of KoKu’s collected works edited by Ketu Viswanatha Reddy, such biographical and historical information is given in footnotes – sometimes bordering on the ridiculous – actually, I take that back. A time may come soon when ppl may not know that information which I believe to be common knowledge.

    Anyways..
    Kanak Pravasi was a person called Kanakayya who was doing PhD dissertation on Sreepada’s stories. He must have communicated with Koku about his research. He never completed his dissertation, but apparently was successful in gathering almost all the stories ever written by Sreepada. Just FYI.

  3. Chamarti kanakayya studied in Govt. arts college Rajahmundry 1951-55 . He wrote some stories/kavithas in the college/ hostel magazine. Koduri kousalyadevi is a contemporary of kanak pravasi. I remember the story written by kousaladevi in the same college magazine. The story is called “Abala kadu sabala”
    I studied in thesame college from 1955-59.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: