From Anuradha,with love

“ఫ్రం అనురాధా విత్ లవ్” అన్నది నవీన్ చిన్న కథల సంకలనం. ఇందులో 21 కథలున్నాయి. అన్నీ పత్రికల్లో వచ్చినవే నేను గమననించినంతవరకూ. ఈ కథలన్నింటిలోనూ నేను గమనించింది ఏమిటంటే వస్తువు లో పెద్ద గా ఏం వైవిధ్యం లేకపోవడం. మొత్తం మీద 90% కథలు రెండే వస్తువుల చుట్టూ తిరిగినట్లు అనిపించింది. అవి – 1. నక్సల్-పోలీసులు-ప్రజల సంబంధాలు 2.భార్య-భర్త ల బంధాలు.

మళ్ళీ ఇందులో సామాన్య జీవితం లో ఉండే హాస్యాన్ని కూడా పట్టించుకోలేదేమో అనిపించింది నవలల్లో లాగానే. మొదటి కథ “అనంతం” – భార్యా భర్తల తగువు. “బాంధవ్యాలు” నవల లోని సన్నివేశాల లానే అనిపించింది. “ప్రజల డబ్బు” కథ నాకైతే అంత లోతుగా అర్థం కాలేదు కానీ కాస్త వ్యంగ్యాస్త్రం లా అనిపించింది. “మత్తు” – రెండు విషయాల మధ్య పోలికలతో నడుస్తుంది. పర్వాలేదు అనిపించింది. “బ్లాస్ట్-బ్లాస్ట్”,”ప్రతిఘటన”,”ఆర్నెల్ల దాకా రాను”,”ఎదురు దాడి” – ఈ నాలుగూ నక్సల్ ఎంకౌంటర్ల నేపథ్యం లో నడిచేవి. బాగా ఆలోచింపజేసేవి. మంచి కథల్లానే అనిపించినా కూడా అక్కడక్కడా రచయిత శైలి ఎందుకో గానీ పత్రికా రిపోర్టు లా,డాక్యుమెంటరీ లా కూడా అనిపించింది. అన్నింటిలోనూ ఒకే విషయం అంతర్లీనంగా ఉండి కేవలం అదే విషయమై వేర్వేరు సంఘటనలు మాత్రం చెప్తూ ఉండడం వల్ల అనుకుంటా.

“కసి” – బాగా కదిలించే కథ. ఈ కదిలించే కథలు వస్తువు వల్ల కదిలిస్తాయా, చెప్పే విధానం వల్ల కదిలిస్తాయా అన్నది నాకు ఎప్పుడూ సందేహమే. అందుకని ఈ తరహా కథలను నేను శైలి పరంగా చూడలేను.  “కార్యేషు దాసి”,”ఓ హక్కు కోసం” – పెళ్ళై, తమ హక్కుల కోసం పోరాడే ఇండివిడ్యూయాలిటీ ఉన్న అమ్మాయిల కథలు. బానే ఉన్నాయి. “ట్యూషన్ మాస్టారు” – వస్తువూ, వర్ణనా ఏవీ నాకు అంత నచ్చలేదు. “ఫ్రం అనురాధ విత్ లవ్” – మంచి కథ. కొంత వరకూ సస్పెన్స్ నింపి కథకు మంచే చేసారేమో రచయిత అనిపిస్తుంది. “దాడి”,”బలి” – రెండూ మళ్ళీ నక్సల్ ఎంకౌంటర్ కథలు. మళ్ళీ ఆలోచనలు రేకెత్తించే కథలు రెండూనూ. “ఊబి” – భర్త భార్యని సిన్మా భాష లో చెపాలంటే మోసం చేయడం పై. అయితే ఇదే కథ “హెచ్” అన్న పేర్తో వచ్చినట్లు గుర్తు ఏదో పత్రిక లో. ఓ మాదిరిగా ఉంది. “వేరు ద్వీపాలు” ఆలోచింపజేసే కథ.

“నీ ప్రాణానికి నా ప్రాణం” – మళ్ళీ ఆలోచింపజేసే కథ. నక్సల్-పోలీసు సంబంధాల పైనే. “హత్య” కథ చాలా గందరగోళం లా అనిపించింది నాకు. “నిప్పురవ్వలు”,”తెర” పర్వాలేదు. “చెర” కథ పర్వాలేదు కానీ బాగా కదిలించే గుణం ఉంది ఇందులో. “ఎనిమిదో అడుగు” కథ అమ్మాయి వ్యక్తిత్యం గురించిన కథ.  “పొరపాటు” – ఈ సంకలనం లో చివరి కథా , నాకు నచ్చిన కథ.  మొత్తానికైతే బానే ఉన్నాయి కథలు.

అయితే నవలలు నడిపినంత పట్టుతో, వ్యాసాలు రాసినంత నేర్పు తో ఈ కథలు నవీన్ రాయలేదు అనిపించింది. ఇది నా అనుభవం లో తెలుసుకున్న విషయం. కాబట్టి ఇలాగే అందరికీ జరగాలని కూడా ఏం లేదు. మొత్తానికి చదవదగ్గ పుస్తకమే.

Advertisements
Published in: on September 21, 2006 at 4:15 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/09/21/from-anuradhawith-love/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. title chuusi utsaahamgaa chadavaDam modalupeTTaanu :)kaanii chuustE kathala review! reviews raastuu unDE koddii niilO pariNati peragaDam spashTamgaa kanipistOndi. chakkaTi review idi. nii reviews chadivi pustakam konacchO lEdO nirNayinchukOvacchu. mundu mundu marinta pEru gaDinchi, “sowmya review lO manchi rating icchindi anTE adi konadagga pustakamE” ani andaruu anukunE sthaayiki chEraalani aaSistunnaanu.

  2. dear sowmya, I just have gone through all your reviews. They are fully covered, communicative, emphatical narration will all these factors lead the person of literature to obtain the book and read and involve himself. Anubhavam veru Anubhuti veru. Mee reviews chadivite, rendu kalugutunnaayi. Haardhika abhinamdanalu. mee krushi imkaa raaNimchaalani naa aasha and blessings to you. kbs sarma.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: