Evening on Gachibowli mainroad

నాకు చాలా విషయాలు ఎందుకో గానీ తలకెక్కవు. అలాంటిదే ఇదీనూ. ఈ రోజు మా ఆషాకిరణ్ పిల్లల్ని రోడ్డు దాటిస్తున్నాం. 13 మంది పిల్లలు. ముగ్గురం వాలంటీర్లం. గచ్చిబౌలి మెయిన్ కూడలి. ఆఫీసులు వదిలే టైము. గమనించలేదు కానీ రోడ్డు నిండా ట్రాఫిక్ పోలీసులు. మేము పిల్లలతో రోడ్డు క్రాస్ చేసేందుకు వచ్చామో లేదో అక్కడున్న పోలిసాయన పొలికేకలు మొదలెట్టాడు. సరే పిల్లలందర్నీ ఆగమని మేమూ రోడ్డు పక్కగా నిలబడ్డాం. అయినా ఆయన అరుపులు మానలేదు. మాకు ఎందుకో అర్థం కాలేదు. రోడ్డు పక్కగా ఉంటే చాలదట. ఇంకా వెనక్కి నడిచి, అక్కడ ఏదో త్రవ్వకాల పనుల మట్టి అనుకుంటా గుట్టగా పోసి ఉంచారు … చీకట్లో సరిగా గమనించలేదు … దాని మీద కి వెళ్ళిపోయి నిలబడ్డాం. అక్కడికీ శాంతించలేదు మనిషి. ఏదో అరుస్తూనే ఉన్నాడు. ఏమన్నా మాట కు మాట అందామన్నా పోలిసాయన కదా ఏం చేస్తాడో అన్న వెధవ భయం ఒకటి ఏద్చింది కద !!

కాసేపలాగ ఎదురుచూసాం. మా అదృష్టం అనుకుంటా గానీ రోడ్డు కి అన్నివైపులా ట్రాఫిక్ నిలిపేసిన పదినిముషాలకే ఆ వీవీఐపీ లు ఎవరో త్వరగా తెమిలి పుణ్యం కట్టుకున్నారు. 12 సరిగ్గా 12 వాహనాలు వరుసగా వెళ్ళాక పోలిసాయన మమ్మల్ని వదిలాడు. అసలైతే ఇవన్నీ మామూలే. నేను గగ్గోలు పెట్టడం అనవసరం. కానీ అంత మంది చిన్న పిల్లలు ఉన్నారు కదా …. కాన్వాయ్ రావడానికి ఇంకా టైం ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళని రోడ్డు దాటనిస్తే ఏం పోయింది ? పైగా ఆ అరుపులొకటి. అయినా ఎవరిని ఏమనగలం ? పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఈ ఆలోచనలు పక్కన పెడితే ఈ తతంగం … అదే అసలే ట్రాఫిక్ జాం లతో అల్లాడే నగరం లో ఇలా కృత్రిమంగా జాం లు సృష్టించడం అవసరమా ? అని నా సందేహం.

ప్రజల కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వాధికారుల కోసం ప్రజల్నే ఇబ్బందికి గురిచేయడం న్యాయంగా అనిపించడం లేదు. ఈరోజు నేనేదో కష్టపడిపోయానని కాదు ఇదంతా చెప్తున్నది. ఇలాంటివి ఈ నగరం లో ఉన్నందుకు చాన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నా. ప్రశ్నించుకుంటూనే ఉన్నా. ఈరోజేదో ఈ బ్లాగు ఉంది కాబట్టి పంచుకుంటున్నా.

Published in: on September 20, 2006 at 3:37 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/09/20/evening-on-gachibowli-mainroad/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. దానినే పోయేకాలం అంటారు. ఈ రోజు ఖైరతాబాదు జంక్షన్లో (రెండు గంటల క్రితం), ఎర్ర సిగ్నల్…సత్యం వారి ఆంబులెన్స్ ఒకటి తెగ అరుస్తుంది, ఎవరికో పరిస్థితి విషమం అనుకుంటా…ట్రాఫిక్ పోలీసులు అలా దాన్ని వింటూనే వున్నారు, ఇంకో వైపు నుంచి వాహనాలు వదుల్తున్నారు. నేను నా బైక్ పక్క వున్న పోలీసుకు చెప్పా! నా వైపు అదోలా (వీడెవెడ్రా!) చూసి దూరంగా పోయాడు…వాడి తండ్రే ఆ ఆంబులెన్సులో ఉంటే?

    మానవత్వాన్ని దర్జాగా చంపేసారు. చాల కష్టంగా వుంది..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: