Excerpt from “Sudigundaalu” – a short story

కుటుంబరావు గారి ” సుడిగుండాలు ” కథలో బయటి ఊరిలో ఉండి చదువుకుని విద్యార్థి జీవితం ముగిసి తన ఊరు చేరుతున్న కథానాయకుడి మనోభావాలను ఇలా చెప్పడం నాకు నచ్చింది. అది ఇక్కడ మీతో పంచుకుంటున్నా –

” …. నాలుగు సంవత్సరాల స్వేఛ్చా విహారం. ఆ జీవితం లో కృతిమ బాంధవ్యాలు లేవు. ఇష్టమైన వాణ్ణి హృదయానిక హత్తుకోవడమూ , లేని వాణ్ణి దూరంగా ఉంచడమూ , కోపం తెప్పించిన వాణ్ణి ఇష్టమైతే క్షమించడమూ , లేక పోతే భరతం పట్టించి మరుక్షణం అంతా మరిచిపోవడమూ.

బుద్ధి వచ్చింది లగాయతు మూసి ఉన్న తలుపులన్నీ తెరిచి ఆత్మ యొక్క మూల మూల కీ గాలీ,వెలుతురూ పోనిచ్చి, ఇష్టం వచ్చిన విషయాని గూర్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, ఎవరేమనుకుంటారో అనే భయం అవసరం లేకుండా, అప్రయత్నంగా ఊరే భావాలని మురగపెట్టకుండా …… ఎంత సుఖమయమైన జీవితం !!!

మళ్ళీ ఈ ప్రపంచం లోకి. తనకంటే 30 ఏళ్ళు ముందుగా పుట్టానని అనుక్షణం గుర్తు చేసే తంద్రి దగ్గరకి, తొమ్మిది నెల్లు మోసి కని పెంచానని మాతృనియంతృత్వం చేసే తల్లి దగ్గరికి, నా భార్య తమ్మునివి, నా గులామువి అని ఙాపకం చేసే బావ గారి దగ్గరికి, తను మనసు విచ్చి మాట్లాడినా, గట్టిగా నవ్వినా అనుమానించే అర్థ మృతుల మధ్యకు – కాస్త తెలివిగా మాట్లాడితే బియ్యే అనీ, ఆడదాని వంక పొరపాటున చూస్తే వయసులో ఉన్న బ్రహ్మచారి అని అనుమానించే సంఘం లోకి …. సుడిగుండాల్లోకి …..”

Published in: on September 18, 2006 at 9:35 am  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/09/18/excerpt-from-sudigundaalu-a-short-story/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. మీ బ్లాగులు చూసి నేను నవీన్ పుస్తకాలు avkf.org లో దొరికినవన్నీ తెప్పించుకున్నాను. ఈరోజే “అంపశయ్య” పూర్తి చేశాను.
    మీ బ్లాగులు మంచి పుస్తకాలను పరిచయం చేస్తున్నాయి. కృతజ్ఞతలు.
    — ప్రసాద్
    http://charasala.wordpress.com


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: